PoliticsGullapally Venkatesheditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_analysis/ap-politics-janasen-pavan-kalyan-pavan-politicsf7490d7d-1034-4991-8a6d-38cadb6108d6-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_analysis/ap-politics-janasen-pavan-kalyan-pavan-politicsf7490d7d-1034-4991-8a6d-38cadb6108d6-415x250-IndiaHerald.jpgజనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గత కొంత కాలంగా ప్రజల్లో చులకన అవుతున్నారు అనే ప్రచారం రాజకీయ వర్గాల్లో ఎక్కువగా జరుగుతున్నది. వాస్తవానికి పవన్ కళ్యాణ్ ఏ నిర్ణయం తీసుకున్నా సరే ఇది వివాదాస్పదంగా ఉంటుంది. కాపు సామాజికవర్గ నేతలను ఆకట్టుకునే ప్రయత్నం పవన్ కళ్యాణ్ చేస్తున్నారు. ఇన్ని రోజులు కూడా ఆయన సినిమాల మీద దృష్టి సారించి ఇప్పుడు బయటకు వచ్చేసి సినిమాలను పక్కన పెట్టి వెళ్తున్నారు. రాజకీయంగా కొన్ని ప్రయత్నాలు కూడా చేస్తున్నారు. తిరుపతి పార్లమెంటు పరిధిలో ఎక్కువగా ఉన్న కాపు సామాజికవర్గం నేతలను ఆకటpawan kalyan;pawan;cbn;kalyan;tiru;bharatiya janata party;telugu desam party;janasena;telugu;tirupati;husband;tdp;ycp;janasena party;hindus;partyపవన్ తో బాబు భేటీ...?పవన్ తో బాబు భేటీ...?pawan kalyan;pawan;cbn;kalyan;tiru;bharatiya janata party;telugu desam party;janasena;telugu;tirupati;husband;tdp;ycp;janasena party;hindus;partySun, 31 Jan 2021 09:00:00 GMTజనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గత కొంత కాలంగా ప్రజల్లో చులకన అవుతున్నారు అనే ప్రచారం రాజకీయ వర్గాల్లో ఎక్కువగా జరుగుతున్నది. వాస్తవానికి పవన్ కళ్యాణ్ ఏ నిర్ణయం తీసుకున్నా సరే ఇది వివాదాస్పదంగా ఉంటుంది. కాపు సామాజికవర్గ నేతలను ఆకట్టుకునే ప్రయత్నం పవన్ కళ్యాణ్ చేస్తున్నారు. ఇన్ని రోజులు కూడా ఆయన సినిమాల మీద దృష్టి సారించి ఇప్పుడు బయటకు వచ్చేసి సినిమాలను పక్కన పెట్టి వెళ్తున్నారు. రాజకీయంగా కొన్ని ప్రయత్నాలు కూడా చేస్తున్నారు.

తిరుపతి పార్లమెంటు పరిధిలో ఎక్కువగా ఉన్న కాపు సామాజికవర్గం నేతలను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. కాపు సామాజికవర్గ ఓటర్లను కూడా ఆయన పెంచుకునే విధంగా అడుగులు వేయటంపై ఇప్పుడు రాజకీయ వర్గాల్లో ఎక్కువగా ప్రచారం జరుగుతుంది. భారతీయ జనతా పార్టీ హిందువులను టార్గెట్ చేసే ప్రయత్నాలు చేస్తుంది. అయితే పవన్ కళ్యాణ్ కాపులను దూరం చేసే అవకాశం ఉన్న నేపథ్యంలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు రంగంలోకి దిగారని అంటున్నారు. పవన్ కళ్యాణ్ త్వరలోనే తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబుతో కూడా సమావేశమయ్యే అవకాశాలున్నాయని వార్తలు వినపడుతున్నాయి.

అయితే పవన్ కళ్యాణ్ ని కట్టడి చేయడానికి తిరుపతి ఉప ఎన్నికల నుంచి తప్పుకోవాలని టిడిపి అధిష్ఠానం నుంచి ఒత్తిడి వచ్చే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. తెలుగుదేశం పార్టీ, వైసీపీ... అభ్యర్థులను కూడా ప్రకటించారు. జనసేన బీజేపీ మాత్రం అభ్యర్థిని ప్రకటించలేదు. అయితే జనసేన పార్టీ పూర్తిగా తిరుపతి ఉప ఎన్నికలకు దూరంగా ఉండాలని భారతీయ జనతా పార్టీ కూడా మద్దతు ఇవ్వవద్దు అని పవన్ కళ్యాణ్ మీద చంద్రబాబు నాయుడు ఒత్తిడి తీసుకువచ్చే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. మరి పవన్ కళ్యాణ్ విషయంలో బిజెపి ఎలా స్పందిస్తుంది ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది ఏంటి అనేది చూడాలి. ఏది ఎలా ఉన్నా సరే ఈ పరిణామాలు ఇప్పుడు ఆసక్తికరంగా మారుతున్నాయి.


మోదీ వెన‌క్కి త‌గ్గారు... ఢిల్లీలో రైతుల ఉద్య‌మానికి కేంద్రం త‌ల‌వంచుతోంది....

జగడ్డ: నెల్లూరులో బీజేపీ-జనసేన మాస్టర్ ప్లాన్..

జగడ్డ: గవర్నర్ ను శాసించే అధికారం నిమ్మగడ్డకు ఉందా...?

కాపు వేద‌న‌: ప‌వ‌న్‌ను కాపులు అందుకే న‌మ్మ‌ట్లేదా ?

కాపు వేద‌న‌: ప‌వ‌న్ క‌న్నా.. చిరునే బెట‌ర్.. గుర్తుకొస్తున్న‌ నాటి ఘ‌ట‌న..‌!

రియల్ హీరో కు టాలీవుడ్ లో విలన్ గా కలిసొచ్చిన సినిమాలు.!! ఏంటో తెలుసా ?

జగడ్డ: టీడీపీకి ఆనాటి శృంగారం.. ఇప్పుడు వ్యభిచారంగా మారిందా..?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Gullapally Venkatesh]]>