Moviesyekalavyaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/movies/movies_latestnews/tollywoode3a5dc13-5a2e-4ace-8109-f475ecd86462-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/movies/movies_latestnews/tollywoode3a5dc13-5a2e-4ace-8109-f475ecd86462-415x250-IndiaHerald.jpgతెలుగు ప్రేక్షకులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న సినిమాలు.. ఆచార్య, పుష్ప, ఆర్ఆర్ఆర్. ఈ మూడు సినిమాలూ భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్నాయి. వీటిలో మెగాస్టార్ చిరంజీవి ఆచార్య మినహా మిగతా రెండు సినిమాలూ పాన్ ఇండియా రేంజ్‌లో తెరకెక్కుతున్నాయి. పుష్ప సినిమాలో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ గంధపు చెక్కల స్మగ్లర్‌గా పూర్తి డీ గ్లామరస్ రోల్‌లో కనిపిస్తుండగా....tollywood;chiranjeevi;ntr;kumaar;shiva;allu arjun;rajamouli;sukumar;india;alluri sitarama raju;rrr movie;cinema;lord siva;nandamuri taraka rama rao;seetharamaraju;arjun 1;seetharama raju;master;chitramఆచార్య, పుష్ప, ఆర్ఆర్ఆర్‌లలో అదే కామన్ పాయింట్.. వాళ్లకి ఆ మోజెందుకే..!ఆచార్య, పుష్ప, ఆర్ఆర్ఆర్‌లలో అదే కామన్ పాయింట్.. వాళ్లకి ఆ మోజెందుకే..!tollywood;chiranjeevi;ntr;kumaar;shiva;allu arjun;rajamouli;sukumar;india;alluri sitarama raju;rrr movie;cinema;lord siva;nandamuri taraka rama rao;seetharamaraju;arjun 1;seetharama raju;master;chitramSun, 31 Jan 2021 13:24:00 GMTఇంటర్నెట్ డెస్క్: తెలుగు ప్రేక్షకులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న సినిమాలు.. ఆచార్య, పుష్ప, ఆర్ఆర్ఆర్. ఈ మూడు సినిమాలూ భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్నాయి. వీటిలో మెగాస్టార్ చిరంజీవి ఆచార్య మినహా మిగతా రెండు సినిమాలూ పాన్ ఇండియా రేంజ్‌లో తెరకెక్కుతున్నాయి. పుష్ప సినిమాలో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ గంధపు చెక్కల స్మగ్లర్‌గా పూర్తి డీ గ్లామరస్ రోల్‌లో కనిపిస్తుండగా.. ఆర్ఆర్ఆర్‌లో ఎన్టీఆర్, రామ్‌చరణ్‌లు చారిత్రాత్మక వ్యక్తులైన కొమరం భీం, అల్లూరి సీతారామరాజులుగా అలరించనున్నారు. అయితే ఈ మూడు సినిమాల్లో ఓ కామన్ పాయింట్ ఉంది. అదేంటో తెలుసుకోవాలనుకుంటున్నారా.. అయితే చదవండి.

కోవిడ్ ప్ర‌భావంతో మూత‌ప‌డిన సినిమా థియేటర్లు ఇప్పుడిప్పుడే తెరుచుకుంటున్నాయి. దీంతో ఇప్ప‌టికే విడుద‌ల కాకుండా గతేడాది నుంచి నిలిచిపోయిన సినిమాలన్నీ థియేటర్లకు క్యూ కడుతున్నాయి. ఈ క్రమంలోనే టాలీవుడ్‌తో పాటు, కోలివుడ్, మాలీవుడ్ సినిమాలు కూడా రిలీజ్‌కు సిద్ధమవుతున్నాయి. ఇందులో చిన్న చిత్రాల నుంచి భారీ చిత్రాలు కూడా ఉన్నాయి. అందులో ఆర్ఆర్ఆర్, ఆచార్య‌, పుష్ప సినిమాల విడుదలకు సంబంధించిన విశేషమేమంటే ఈ మూడు చిత్రాలూ 13వ తేదీనే విడుద‌ల కానున్నాయి.

ఆర్ఆర్ఆర్, ఆచార్య‌, పుష్ప సినిమాల్లో ముందుగా ప్రేక్ష‌కుల ముందుకు ఆచార్య‌ రాబోతోంది. మెగాస్టార్ 152వ చిత్రంగా తెరకెక్కిన ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలే ఉన్నాయి. ఆలయాల్లో జరుగుతున్న అవినీతిపై ఈ సినిమా ఉంటుందని టాక్ నడుస్తోంది. కొర‌టాల శివ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతోన్న ఈ సినిమా మే 13వ తేదీన విడుద‌లకు సిద్ధమవుతోంది.

ఆచార్య తరువాత స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటించిన ప్యాన్ ఇండియా మూవీ పుష్ప థియేటర్లను పలుకరించనుంది. అల్లు అర్జున్-సుకుమార్ కాంబినేష‌న్‌లో రూపొందుతోన్న ఈ సినిమా ఆగ‌స్టు 13న విడుద‌లకు రెడీ అయింది. ఇక చివరిగా జక్కన్న రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న మాస్టర్ పీస్.. ఆర్ఆర్ఆర్ కూడా ప్యాన్ ఇండియా సినిమాగానే ప్రేక్షకుల ముందుకు రానుంది.

ద‌స‌రా సంద‌ర్భంగా అక్టోబ‌ర్ 13న ఈ సినిమాను విడుద‌ల చేయనున్నట్లు రాజమౌళి ఈ మధ్యనే ప్రకటించారు. అయితే వేర్వేరు నెల‌ల్లో విడుదలవుతున్నా.. 13వ తేదీనే రిలీజ్ అవుతుండడం ఇందులోని కామన్ పాయింట్. మరి ఈ సినిమాల దర్శకనిర్మాతలకు ‘13’పై ఆ మోజెందుకే తెలియడంలేదు. అయితే ఈ సినిమాల్లో ఏవి బ్లాక్ బస్టర్లుగా నిలుస్తాయి..? ఏవి మంచి సినిమాలు అనిపించుకుంటాయి..? అనే విషయాలు తెలియాలంటే మాత్రం మరికొన్ని నెలలు ఆగాల్సిందే.




ధోనీ అరుదైన రికార్డు పై కన్నేసిన కోహ్లీ.. కేవలం అడుగు దూరంలో..?

బ్రాహ్మణ ఘోష : ప్రభుత్వానికి ఆ చట్టం చేసే ధైర్యం ఉందా ?

అనుష్క కూడా క్యాస్టింగ్ కౌచ్ బాధితురాలే...?

అషు రెడ్డి అసలు పేరు ఏంటో తెలుసుకోండి.. !!

జగడ్డ : నిమ్మగడ్డ అక్కడే గురి...పెద్ద దెబ్బే మరి...?

ప‌శ్చిమ పంచాయ‌తీల్లో ఫ్యాన్‌కు బ్యాండ్ ప‌డిపోద్దిగా... ఈ నాలుగు చోట్ల క‌ష్ట‌మే ?

కృష్ణా `పంచాయ‌తీ` ఎవ‌రి సొత్తు.. ఆ పార్టీకి దెబ్బ‌డిపోయిన‌ట్టే ?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - yekalavya]]>