PoliticsVAMSIeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/jagan-nimmagadda-elections6060a57b-1d13-46d5-a802-8b93af2e6bf1-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/jagan-nimmagadda-elections6060a57b-1d13-46d5-a802-8b93af2e6bf1-415x250-IndiaHerald.jpgరాష్ట్రంలో ఎన్నికల నగారా మోగింది. అటు ప్రభుత్వ అధికారులు ఇటు ఎన్నికల సంఘం అధికారులు పంచాయితీ ఎన్నికల నిర్వహణ ప్రయత్నాలలో తలమునకలై ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ ఎన్నికల అధికారి నిమ్మగడ్డ రమేష్ కుమార్ విడుదల చేసిన షెడ్యూల్ ప్రకారం రాష్ట్రంలో రెండు విడతలుగా పంచాయతీ ఎన్నికలు జరగనున్నాయి. jagan-nimmagadda-elections;kumaar;dr rajasekhar;andhra pradesh;district;backward classes;panchayati;king;local language;ycp;partyజగడ్డ: తాడిపత్రి వైసీపీ బీసీ నేతకు అన్యాయం...జగనోరూ చూశారా... ?జగడ్డ: తాడిపత్రి వైసీపీ బీసీ నేతకు అన్యాయం...జగనోరూ చూశారా... ?jagan-nimmagadda-elections;kumaar;dr rajasekhar;andhra pradesh;district;backward classes;panchayati;king;local language;ycp;partySat, 30 Jan 2021 13:00:00 GMTఆంధ్రప్రదేశ్ ఎన్నికల అధికారి నిమ్మగడ్డ రమేష్ కుమార్ విడుదల చేసిన షెడ్యూల్ ప్రకారం రాష్ట్రంలో రెండు విడతలుగా పంచాయతీ ఎన్నికలు జరగనున్నాయి. అందులో భాగంగానే నిన్నటి నుండి ప్రకటించిన జిల్లాలలో నామినేషన్ ప్రక్రియ మొదలయింది. ఇప్పటికే రాజకీయ పార్టీలు మరియు స్థానిక కార్యకర్తలు వారి వారి అభ్యర్థులను నామినేషన్ వేయించేందుకు రసవత్తరంగా ప్రయత్నాలు చేస్తున్నారు.

అయితే ఇదంతా ఇలా జరుగుతూ ఉంటే అనంతపురం జిల్లాకు చెందిన ఒక వైసీపీ బీసీ నాయకుడు పార్టీలో మా సామాజిక వర్గానికి సరైన గుర్తింపు దక్కడం లేదంటూ ఆవేదన చెందడం వైసీపీ ప్రభుత్వానికి తలనొప్పిగా మారింది. పూర్తి వివరాల్లోకి వెళితే ఆ నేత అనంతపురం జిల్లా తాడిపత్రి నియోజకవర్గం యాడికి మండలానికి చెందిన మధు రాజు గా తెలిసింది. ఈయన యాడికి మండలానికి వైసీపీ బీసీ సెల్ కన్వీనర్ గా పనిచేస్తున్నారు. మధు రాజు దివంగత నేత వై ఎస్ రాజశేఖర్ రెడ్డికి వీరాభిమాని. ఆయన ప్రజలకు చేసిన సేవలను చూసి ఆయనపై అభిమానాన్ని పెంచుకున్నాడు.

ఈ అభిమానమే మధు రాజును వైసీపీలో నాయకునిగా చేరేలా ప్రేరేపించింది. దాదాపు 17 సంవత్సరాలనుండి ఎంతో నిబద్ధతగా, పార్టీకి విధేయుడిగా పార్టీ అభివృద్ధి కోసం నిరంతరం కష్టపడుతున్న నాకు ఆదరణ కరువవుతోంది అని తన బాధను తెలిపారు. అంతే కాకుండా వేరే రాజకీయ పార్టీ నుండి వైసీపీ లోకి చేరినవారికి మాత్రం ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారని వ్యాఖ్యలు చేశారు. ఇప్పటికే జగనోరు మాత్రం బీసీలకు అవి చేశాము, ఇవి చేశాము చెప్పుకుంటుంటే, ఇప్పుడు ఇలా సొంత పార్టీలోని నేతకే అన్యాయం జరగడాన్ని ఏవిధంగా సమర్ధించుకుంటారో తెలియాల్సి ఉంది.

ప్రస్తుతం జరగాల్సిన పంచాయితీ ఎన్నికలలో ఈ ప్రభావం ఉంటుందని ఆ నియోజకవర్గ నాయకులు సందిగ్ధంలో పడ్డారు. ఇలా సంవత్సరాలనుండి పార్టీకి కొమ్ము కాసే చిన్నపాటి కార్యకర్తలు మరియు మధు రాజు వంటి నేతలు ఎంతో మంది చెప్పలేక ఉన్నారు. ఇకనైనా వైసీపీ అధిష్టానం పార్టీలోని నాయకులకు ముందు ప్రాధాన్యత ఇస్తే, పార్టీ మరింత బలపడే అవకాశముంటుందని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. మధు రాజు ఈ విషయాన్ని ముఖ్యమంత్రికి తెలియాలని వేరే దారి లేక ఈ విధంగా సోషల్  మీడియాలో పంచుకోవడం జరిగింది. ఈ విషయంలో జగనోరు ఏమి చేస్తారో చూడాలి...?


గబ్బా హీరో రిషబ్ పంత్ కి కీలక బాధ్యతలు.. ఫాన్స్ హ్యాపీ..?

జగడ్డ : వైఎస్సార్ ని ఆకాశానికెత్తేసిన నిమ్మగడ్డ ?

జగడ్డ: వారెవా.. వైఎస్‌తో నిమ్మగడ్డ అనుబంధం మీకు తెలుసా...?

పుష్ప సినిమా పై అభిమానుల కొత్త డిమాండ్..

కాపు వేద‌న‌: శాసించే కాపులు... యాచించే స్థాయిలోనా ?

అల్లు వారి రామాయణం... అదే టార్గెట్...?

జగడ్డ: నిమ్మగడ్డ సారూ..జగనోరి బొమ్మ ఉంటే భయమా...?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - VAMSI]]>