PoliticsGiddaluri Srinivasa Raoeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_analysis/ap-local-war-first-day-nominations0358a93a-0d7f-44c7-b53e-719b58054f1d-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_analysis/ap-local-war-first-day-nominations0358a93a-0d7f-44c7-b53e-719b58054f1d-415x250-IndiaHerald.jpgరాష్ట్రంలో పంచాయతీ ఎన్నికలకు నామినేషన్ల పర్వం పేలవంగా మొదలైంది. విజయనగరం జిల్లా మినహా మొత్తం 12 జిల్లాల్లో నామినేషన్ల ప్రక్రియ మొదలు కాగా.. తొలిరోజు కేవలం 3,515 నామినేషన్లు దాఖలైనట్లు రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ ప్రకటించింది. విజయనగరం మినహా మిగిలిన అన్ని జిల్లాల్లో మొదటి విడతలో భాగంగా 3,249 సర్పంచ్‌లు, 32,504 వార్డులకు ఎన్నికలు నిర్వహించాల్సి ఉంది. అత్యథికంగా తూర్పుగోదావరి జిల్లాలో సర్పంచి స్థానాలకు 248 నామినేషన్లు దాఖలు కాగా.. అత్యల్పంగా నెల్లూరు జిల్లాలో కేవలం 27నామినేషన్లు మాత్రమే వేశారు అభ్యర్థుjagan-nimmagadda-elections;kumaar;godavari river;ramireddy pratap kumar reddy;2019;district;east;nellore;east godavari;panchayati;mla;tdp;local language;ycp;reddy;partyజగడ్డ: నెల్లూరులో అత్యల్పంగా నామినేషన్లు.. కారణం ఏంటి..?జగడ్డ: నెల్లూరులో అత్యల్పంగా నామినేషన్లు.. కారణం ఏంటి..?jagan-nimmagadda-elections;kumaar;godavari river;ramireddy pratap kumar reddy;2019;district;east;nellore;east godavari;panchayati;mla;tdp;local language;ycp;reddy;partySat, 30 Jan 2021 08:00:00 GMTపంచాయతీ ఎన్నికలకు నామినేషన్ల పర్వం పేలవంగా మొదలైంది. విజయనగరం జిల్లా మినహా మొత్తం 12 జిల్లాల్లో నామినేషన్ల ప్రక్రియ మొదలు కాగా.. తొలిరోజు కేవలం 3,515 నామినేషన్లు దాఖలైనట్లు రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ ప్రకటించింది. విజయనగరం మినహా మిగిలిన అన్ని జిల్లాల్లో మొదటి విడతలో భాగంగా 3,249 సర్పంచ్‌లు, 32,504 వార్డులకు ఎన్నికలు నిర్వహించాల్సి ఉంది. అత్యథికంగా తూర్పుగోదావరి జిల్లాలో సర్పంచి స్థానాలకు 248 నామినేషన్లు దాఖలు కాగా.. అత్యల్పంగా నెల్లూరు జిల్లాలో కేవలం 27నామినేషన్లు మాత్రమే వేశారు అభ్యర్థులు. వార్డు మెంబర్ల స్థానాలకు కూడా అతి తక్కువ స్థాయిలో 46 నామినేషన్లు మాత్రమే పడ్డాయి.

నెల్లూరు జిల్లాలో మొత్తం 941 గ్రామ పంచాయతీలకు ఎన్నికలు జరగాల్సి ఉండగా.. తొలిరోజు కేవలం 27నామినేషన్లే దాఖలు కావడం విశేషం. మొత్తం 9 మండలాలకు గాను 27 మంది మాత్రమే నామినేషన్లు వేశారు. తొలివిడత ఎన్నికలు జరుగుతున్న కావలి డివిజన్లో అధికార పార్టీదే పెత్తనం అంతా. కావలి ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి నేతృత్వంలో వైసీపీ ఎన్నికలను ఎదుర్కొంటోంది. అదే సమయంలో టీడీపీకి పెద్ద దిక్కుగా ఉన్న బీదా సోదరులలో చీలిక రావడం, 2019 ఎన్నికలలో టీడీపీ తరపున పోటీ చేసిన బీదా మస్తాన్ రావు.. ఆ తర్వాత వైసీపీలో చేరడంతో అక్కడ వైసీపీ మరింత బలం పుంజుకుంది.

కావలి డివిజన్లో 80శాతం ఏకగ్రీవాలకు ప్రయత్నం చేస్తామని చెబుతున్నారు వైసీపీ నేతలు. మరోవైపు టీడీపీ నేతలు కూడా
నామినేషన్ల తొలిరోజు ఆయా మండలాల్లో పర్యటించి స్థానిక నేతలు, కార్యకర్తల్లో ధైర్యం నింపే ప్రయత్నం చేశారు. అయితే తొలిరోజు టీడీపీ తరపున నామినేషన్లు పడిన దాఖలాలు కనిపించలేదు. వైసీపీ తరపున నామినేషన్ వేసినవారంతా దర్జాగా పార్టీ కండువా కప్పుకుని వస్తే, ఇతర అభ్యర్థులు పార్టీలకు సంబంధం లేనట్టు నిరాడంబరంగా వచ్చి నామినేషన్ వేసి వెళ్లిపోయారు. మొత్తమ్మీద నామినేషన్ల తొలిరోజే నెల్లూరు జిల్లాలో పరిస్థితి ఎలా ఉంటుందో ఓ అంచనాకి వచ్చే అవకాశం కనిపించింది. ప్రతిపక్ష టీడీపీ ప్రభావం అస్సలు ఏమాత్రం కనిపించలేదు. ఏకగ్రీవాల జోరు కనిపించే అవకాశం స్పష్టంగా ఉంది. అందుకే నామినేషన్లు తక్కువగా నమోదయ్యాయని అంటున్నారు విశ్లేషకులు.




అన్నా హజారే యూ టర్న్!

పదమూడో సారి యుద్దానికి సిద్దమయిన వెంకటేష్ - చిరంజీవి

జగడ్డ: విజయనగరం జిల్లాలో పోలీసులు ఇంత సీన్‌ చేస్తున్నారా..?

ఎడిటోరియల్: "కచరా" పోయి "కతరా" పాలనా!

ఇక పవర్ స్టార్ వంతు ... ఒకటి కాదు, ఏకంగా రెండు బుల్లెట్స్ రెడీ... ??

జగడ్డ: పవన్ కల్యాణ్ దెబ్బ అదుర్స్ కదూ..!

జగడ్డ: వార్నీ.. ఈ ఆఫీసర్‌.. నిమ్మగడ్డకే షాక్ ఇస్తున్నాడే..!?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Giddaluri Srinivasa Rao]]>