HealthSS Marvelseditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/politics/politics_latestnews/covishield21165574-0b4b-4332-a8a0-659f0e1bd608-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/politics/politics_latestnews/covishield21165574-0b4b-4332-a8a0-659f0e1bd608-415x250-IndiaHerald.jpgఇటీవలే దేశవ్యాప్తంగా వ్యాక్సిన్ డ్రైన్ పూర్తి చేసుకొని అన్ని రాష్ట్రాల్లో మొదటి విడత వ్యాక్సిన్ డోసులను అందజేస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ వ్యాక్సిన్ పంపిణీలో వినియోగిస్తున్న కొవిషీల్డ్ కరోనా వ్యాక్సిన్‌పై బీజేపీ ఎంపీ సుబ్రమణ్యస్వామి కీలక సందేహం వెలిబుచ్చారు. 65 ఏళ్లు పైబడిన వారికి ఈ వ్యాక్సిన్ ఇవ్వవచ్చా అని ప్రశ్నించారు. జర్మనీలో ఈ ఏజ్ గ్రూప్ వారికి ఆక్స్‌ఫర్డ్ వ్యాక్సిన్ ఇవ్వొద్దంటూ అక్కడి ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిన విషయాన్ని ప్రస్తావిస్తూ ఆయన ఒక ట్వీట్ చేశారుcovishield;rakshita;bharatiya janata party;india;mp;telugu;twitterఆ వయసు వారికి ఆక్స్ ఫర్డ్ టీకా ఇవ్వొచ్చా ? - బీజేపీ ఎంపీ సూటి ప్రశ్నఆ వయసు వారికి ఆక్స్ ఫర్డ్ టీకా ఇవ్వొచ్చా ? - బీజేపీ ఎంపీ సూటి ప్రశ్నcovishield;rakshita;bharatiya janata party;india;mp;telugu;twitterSat, 30 Jan 2021 19:00:00 GMTకొవిషీల్డ్ కరోనా వ్యాక్సిన్‌పై బీజేపీ ఎంపీ సుబ్రమణ్యస్వామి కీలక సందేహం వెలిబుచ్చారు. 65 ఏళ్లు పైబడిన వారికి ఈ వ్యాక్సిన్ ఇవ్వవచ్చా అని ప్రశ్నించారు. జర్మనీలో ఈ ఏజ్ గ్రూప్ వారికి ఆక్స్‌ఫర్డ్ వ్యాక్సిన్ ఇవ్వొద్దంటూ అక్కడి ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిన విషయాన్ని ప్రస్తావిస్తూ ఆయన ఒక ట్వీట్ చేశారు. ‘ఇది కొవిషీల్డ్‌కు కూడా వర్తిస్తుందా?’ అని ఆయన ప్రశ్నించారు.
 
 
ఆక్స్‌ఫర్డ్-ఆస్ట్రాజెనెకా రూపొందించిన కొవిడ్ వ్యాక్సిన్ వినియోగంపై జర్మన్ వ్యాక్సిన్ కమిషన్ కీలక సూచనలు చేసింది. 65 ఏళ్లు దాటిన వారెవరికీ ఈ టీకాను ఇవ్వొద్దని జర్మన్ ప్రభుత్వానికి సూచించింది. వయసు పైబడిన వారికి ఈ వ్యాక్సిన్ ఇవ్వడం వల్ల ఏవైనా దుష్ప్రభావాలు రావొచ్చునని అభిప్రాయపడింది. తమ ఆందోళనకు కారణం కూడా ఉందని జర్మన్ వ్యాక్సిన్ కమిషన్ పేర్కొంది. 65 ఏళ్ల పైబడిన వారిపై ఈ వ్యాక్సిన్ ప్రభావం ఎలా ఉంటుందనే దానిపై సరైన సమాచారం లేదని పేర్కొంది. వారిలో సైడ్ ఎఫెక్ట్స్ అధికంగా ఉండొచ్చనే అనుమానాలు వ్యక్తం చేసింది. 65 ఏళ్ల కంటే తక్కువ వయస్సు గల వారికి మాత్రమే ఆస్ట్రాజెనెకా టీకా ఇవ్వడం సురక్షితం అని అభిప్రాయపడింది. 18 ఏళ్ల నుంచి 64 ఏళ్ల మధ్య వయసు గల వారికి మాత్రమే ఈ వ్యాక్సిన్‌ను ఇవ్వాలని జర్మన్ ప్రభుత్వానికి సిఫారసు చేసింది. ఆక్స్‌ ఫర్డ్-ఆస్ట్రాజెనెకా సంయుక్తంగా అభివృద్ధి చేసిన కరోనా వ్యాక్సిన్‌ను భారత్‌లో సీరం ఇన్‌స్టిట్యూట్ సంస్థ ‘కొవిషీల్డ్’ పేరుతో ఉత్పత్తి చేస్తోంది. భారత ప్రభుత్వం కొవాగ్జిన్‌తో పాటు దీనికి ఎమర్జెన్సీ వినియోగానికి అనుమతి ఇచ్చింది. అంతేకాకుండా.. కొవాగ్జిన్‌తో పోలిస్తే, కొవిషీల్డ్ డోసులను ఎక్కువగా వినియోగిస్తున్నారు. భారత్ ‘కొవిషీల్డ్’ వ్యాక్సిన్‌ను దేశ అవసరాలకు వినియోగించడమే కాకుండా ఇప్పటికే చాలా దేశాలకు సరఫరా కూడా చేసింది. ఈ నేపథ్యంలో బీజేపీ సీనియర్ నేత సుబ్రమణ్య స్వామి వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.


" style="height: 733px;">




అతనితో నటించేందుకు నో అంటున్న రౌడీ బేబీ ఫ్యాన్స్....

జగడ్డ: మార్చి తర్వాత కూడా నిమ్మగడ్డేనా!

జగడ్డ : నిమ్మగడ్డ ఎటాక్..ఏపీ మంత్రుల కౌంటర్ ఎటాక్ !!

శ్రీదేవి, రాజబాబు జంటగా నటించిన సినిమా ఇదే..!?

మళ్ళీ మొదటికొచ్చిన మహేష్...ఫ్యాన్స్ కి షాక్...?

బ్రాహ్మణ ఘోష : భ్రాహ్మణులు వెనుకబడటానికి కారణం ఏంటి..??

F3 ప్రీ రిలీజ్ బిజినెస్ అదుర్స్.. వెంకటేష్, వరుణ్ తేజ్ స్టామినా ప్రూవ్ చేస్తుంది..!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - SS Marvels]]>