PoliticsN.ANJIeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/sucidiec1b8f015-52a9-475f-b61e-6bffbcad4c0d-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/sucidiec1b8f015-52a9-475f-b61e-6bffbcad4c0d-415x250-IndiaHerald.jpgపెళ్లి చేసుకొని అత్తింట్లో అడుగుపెట్టిన ఆడపిల్లలకు వరకట్న వేధింపులు స్వాగతం పలుకుతున్నాయి. కష్టసుఖాల్లో చివరి వరకు తోడు ఉండాల్సిన భర్తే చిత్ర హింసలకు గురిచేస్తున్నారు. అన్యోన్యంగా ఉండాల్సిన భార్య భర్తలు చీటికి మాటికి గొడవలు పడి ప్రాణాలు తీసుకుంటున్న సంఘటనలు మనం ఎన్నో చూశాం. అలాంటి ఘటనే నిజామాబాద్ జిల్లాలో జరిగింది.sucidie;district;police;pond;village;marriage;husband;wifeచెరువులో దూకి తల్లి బిడ్డల ఆత్మహత్య.. ఎందుకంటే..!?చెరువులో దూకి తల్లి బిడ్డల ఆత్మహత్య.. ఎందుకంటే..!?sucidie;district;police;pond;village;marriage;husband;wifeSat, 30 Jan 2021 08:00:00 GMTపెళ్లి చేసుకొని అత్తింట్లో అడుగుపెట్టిన ఆడపిల్లలకు వరకట్న వేధింపులు స్వాగతం పలుకుతున్నాయి. కష్టసుఖాల్లో చివరి వరకు తోడు ఉండాల్సిన భర్తే చిత్ర హింసలకు గురిచేస్తున్నారు. అన్యోన్యంగా ఉండాల్సిన భార్య భర్తలు చీటికి మాటికి గొడవలు పడి ప్రాణాలు తీసుకుంటున్న సంఘటనలు మనం ఎన్నో చూశాం. అలాంటి ఘటనే నిజామాబాద్ జిల్లాలో జరిగింది. భర్త వేధింపులు తాళలేక ఆ ఇల్లాలు చావే శరణ్యమని తలచింది. అల్లారుముద్దగా పెంచిన కన్నకూతురితో సహా చెరువులో దూకి ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన మోపల్ మండలం కులస్పూర్ గ్రామంలో చోటు చేసుకుంది.

పూర్తి వివరాల్లోకి వెళ్తే.. నిజామాబాద్ జిల్లా మోపాల్ మండలం కంజర్ గ్రామానికి చెందిన జెనిగెల ర‌మేష్, అనురాధ దంప‌తుల‌కు ముగ్గురు కుమార్తెలు. పెళ్లైన దగ్గర నుంచి రమేశ్, అనురాధ దంపతులు అన్యోన్యంగానే ఉంటున్నారు. కానీ, ఏమైందో తెలియదు..భర్త రమేష్ గత కొంత కాలంగా భార్య అనురాధను వేధిస్తున్నాడు. దీంతో అనురాధ తన కూతుళ్లైన అక్షయ, నవ్యశ్రీ, వైష్ణవి లతో కలిసి శుక్రవారం ఉదయం కంజర్ కులాస్పూర్ గ్రామాల మధ్య ఉన్న పెద్ద చెరువులో దూకడానికి వెళ్లింది.

ఈ క్రమంలో చిన్న కూతురైన నవ్వే శ్రీ (08) ముందుగా చెరువులో తోసేసి తర్వాత తల్లి అనురాధ (38) చెరువులో దూకింది. అయితే మిగతా ఇద్దరు కూతుళ్లు భయా బ్రాంతులకు గురై ఆత్మహత్య చేసుకోవడానికి వెనుకాడారు. భయంతో ఇంటికి తిరిగి వచ్చేశారు. విషయం తెలుసుకున్న గ్రామస్థులు పోలీసులకు స‌మాచారం అందించారు. దీంతో సంఘ‌ట‌న స్థలానికి చేరుకున్న పోలీసులు పెద్ద చెరువులో గ‌జ ఈతగాళ్లతో శవాలను వెతికించారు. అనురాధ, చిన్న కూతురు వైష్ణవి ఇద్దరి మృత‌దేహాల‌ను చెరువు నుంచి బ‌య‌ట‌కు తీశారు. శ‌వ పంచనామా కోసం మృతదేహాలను జిల్లా ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై పూర్ణేశ్వర్ వెల్లడించారు.


అన్నా హజారే యూ టర్న్!

పదమూడో సారి యుద్దానికి సిద్దమయిన వెంకటేష్ - చిరంజీవి

జగడ్డ: విజయనగరం జిల్లాలో పోలీసులు ఇంత సీన్‌ చేస్తున్నారా..?

జగడ్డ: నెల్లూరులో అత్యల్పంగా నామినేషన్లు.. కారణం ఏంటి..?

ఎడిటోరియల్: "కచరా" పోయి "కతరా" పాలనా!

ఇక పవర్ స్టార్ వంతు ... ఒకటి కాదు, ఏకంగా రెండు బుల్లెట్స్ రెడీ... ??

జగడ్డ: పవన్ కల్యాణ్ దెబ్బ అదుర్స్ కదూ..!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - N.ANJI]]>