Politicsyekalavyaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/union-budgetb5c61d6f-4154-49c6-b880-3d6d50997f0d-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/union-budgetb5c61d6f-4154-49c6-b880-3d6d50997f0d-415x250-IndiaHerald.jpgదేశ అభివృద్ధికి ఆర్థిక వృద్ధి ఎంతో అవసరం. దేశ ఆర్థిక అవసరాలను తీర్చేందుకు, ప్రజలకు సంక్షేమ పథకాలు అందించేందుకు అవసరమయ్యే ఆర్థిక వనరులకు సంబంధించిన మూల్యాంకనం చేసి చట్ట సభల్లో ప్రభుత్వాలు బడ్జెట్‌ను ప్రవేశపెడతాయి. తాజాగా 2021 బడ్జెట్‌ను కేంద్ర ప్రభుత్వం పార్లమెంటులో..union budget;india;pranab mukherjee;morarji desai;prime minister;central government;yaswanth sinha;parliament;james cameron;mantraభారత తొలి బడ్జెట్ ప్రవేశ పెట్టింది ఓ మ్యాగజైన్ అధినేత అని తెలుసా..?భారత తొలి బడ్జెట్ ప్రవేశ పెట్టింది ఓ మ్యాగజైన్ అధినేత అని తెలుసా..?union budget;india;pranab mukherjee;morarji desai;prime minister;central government;yaswanth sinha;parliament;james cameron;mantraSat, 30 Jan 2021 16:20:22 GMTఇంటర్నెట్ డెస్క్: దేశ అభివృద్ధికి ఆర్థిక వృద్ధి ఎంతో అవసరం. దేశ ఆర్థిక అవసరాలను తీర్చేందుకు, ప్రజలకు సంక్షేమ పథకాలు అందించేందుకు అవసరమయ్యే ఆర్థిక వనరులకు సంబంధించిన మూల్యాంకనం చేసి చట్ట సభల్లో ప్రభుత్వాలు బడ్జెట్‌ను ప్రవేశపెడతాయి. తాజాగా 2021 బడ్జెట్‌ను కేంద్ర ప్రభుత్వం పార్లమెంటులో ప్రవేశపెట్టేందుకు సిద్ధమవుతోంది. అయితే భారత తొలి బడ్జెట్ ఎప్పుడు ప్రవేశపెట్టారో తెలుసా..? ఎవరు ప్రవేశపెట్టారో తెలుసా..? అయితే తెలుసుకోండి.

1860, బ్రిటీషు పాలనలో భారత్ ఉన్న కాలం. అప్పట్లో జేమ్స్ విల్సన్ అనే ఆర్థికశాస్త్ర నిపుణుడు భారత కౌన్సిల్‌లో కీలక నేతగా ఉండేవారు. ఆయనే తొలిసారిగా భారత బడ్జెట్‌ను 1860, ఏప్రిల్ 7న ప్రవేశపెట్టారు. దీనిని అప్పటి భారత వైశ్రాయ్‌కు అందజేశారు. ఈయన సొంతంగా ‘ది ఎకనమిస్ట్’ అనే వీక్లీ మ్యాగజైన్‌ను విడుదల చేసేవారు. బడ్జెట్‌ను ప్రవేశపెట్టడమే కాదు.. దానికి ఏడేళ్ల ముందే.. అంటే 1953లోనే భారత్‌లో తొలి చార్టర్డ్ బ్యాంక్‌ను కూడా ఆయన ఏర్పాటు చేశారు.

స్వతంత్ర భారత దేశంలో 1947, నవంబరు 26న తొలి బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. దీనిని అప్పటి భారత తొలి ఆర్థికమంత్రి ఆర్‌కే షణ్ముగం చెట్టి ప్రవేశపెట్టారు. అప్పటి బడ్జెట్ ఇంగ్లీషులోనే ప్రవేశపెట్టేవారు. అయితే 1955-56 నుంచి ఇంగ్లీషుతో పాటు హిందీలో కూడా ముద్రించడం ప్రారంభించారు. ఇక భారత ఆర్థిక మంత్రుల్లో అత్యధిక బడ్టెట్‌లు ప్రవేశపెట్టిన ఆర్థికమంత్రిగా మొరార్జీ దేశాయ్ ఉన్నారు. ఆయన ఏకంగా 10 సార్లు బడ్జెట్ ప్రవేశపెట్టారు. చిదంబరం 8 సార్లు బడ్జెట్ ప్రవేశపెట్టారు. వీరిద్దరి తరువాత ప్రణబ్ ముఖర్జీ, యశ్వంత్ సిన్హా, వైబీ చవాన్, సీడీ దేశ్‌ముఖ్‌లు ఒక్కొక్కరూ 7 సార్లు చొప్పున బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. ఇక దేశ చరిత్రలోనే తొలి మహిళా ఆర్థికమంత్రిగా బడ్జెట్ ప్రవేశ పెట్టిన ఘనత మాజీ ప్రధాని ఇందిరాగాంధీ పేరిటే ఉంది. ఆమె 1970-71 కాలంలో ఆర్థికమంత్రిగా ఉన్నప్పుడు బడ్జెట్ ప్రవేశపెట్టారు.


ఛా.. అందరూ వచ్చారు.. కానీ వీళ్లే ఎందుకు రావడం లేదు..

జీవిత రాజశేఖర్ కార్ లో లేచిపోయి పెళ్లి చేసుకున్న నళిని..భర్తను ఎందుకు వదిలేసింది

వెంకటేష్ హీరోయిన్ వ్యభిచారం చేస్తూ అరెస్ట్..ఆ తర్వాత ట్విస్ట్

ధర్మవరపు సుబ్రహ్మణ్యం చనిపోయే ఆఖరి రోజుల్లో ఏం చేసాడో తెలిస్తే ప్రతీ ఒక్కరూ కంటతడి పెట్టాల్సిందే..!!

కాపు వేద‌న‌: కాపుల విష‌యంలో ప‌వ‌న్‌కు చిరు క్లాస్‌.. మారుతున్న ప‌వ‌నాలు..!

ఆ రెండు జిల్లాల క‌మ్మ ఓటింగ్ ఎవ‌రికి ? స్థానికంపై చ‌ర్చ‌

ఇంద్రభవనం లాంటి బంగ్లా ఉన్న కూడా అద్దె ఇళ్లల్లో ఉంటున్న టాలీవుడ్ స్టార్స్




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - yekalavya]]>