PoliticsSRISHIVAeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/anna-hazare-u-turn-on-farmers-protest-support9a049273-d595-4ea8-a4d5-c5f21169be18-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/anna-hazare-u-turn-on-farmers-protest-support9a049273-d595-4ea8-a4d5-c5f21169be18-415x250-IndiaHerald.jpgరైతుల పోరాటానికి మద్దతు విషయంలో ప్రముఖ సామాజిక ఉద్యమకారుడు అన్నా హజారే యూటర్న్ తీసుకున్నారు. వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతులు చేస్తున్న ఆందోళనకు మద్దతుగా నిరవధిక నిరాహారదీక్ష చేపట్టనున్నట్టు ప్రకటించిన ఆయన.. తాాజాగా ఆ ఆలోచనను విరమించుకున్నారు.anna hazare farmers protest;ajith kumar;delhi;bharatiya janata party;haryana - chandigarh;maharashtra - mumbai;mohandas karamchand gandhi;police;chief minister;uttar pradesh;maharashtra;letter;local language;u turn;ajit pawarఅన్నా హజారే యూ టర్న్!అన్నా హజారే యూ టర్న్!anna hazare farmers protest;ajith kumar;delhi;bharatiya janata party;haryana - chandigarh;maharashtra - mumbai;mohandas karamchand gandhi;police;chief minister;uttar pradesh;maharashtra;letter;local language;u turn;ajit pawarSat, 30 Jan 2021 08:33:55 GMT వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఆందోళన చేస్తున్న రైతులు..ఈసారి ఆరు నెలలకు సరిపడా నిత్యావసర వస్తువులతో నిరసన ప్రాంతాలకు తరలివస్తున్నారు. దీంతో సింఘు సరిహద్దు వద్ద పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఉత్తరప్రదేశ్ నుంచి వెయ్యిమంది రైతులు గాజీపూర్ దీక్షా స్థలానికి చేరుకుని ఆందోళన చేస్తున్న రైతులకు మద్దతు ప్రకటించారు. ఢిల్లీ సరిహద్దులకు వెళ్లేందుకు హర్యానా రైతులు కూడా సిద్ధమవుతున్నారు.

      సింఘు సరిహద్దు వద్దకు చేరుకున్న స్థానికులుగా చెప్పుకుంటున్న కొందరు ఆ ప్రాంతాన్ని విడిచి వెళ్లాలంటూ రైతులపై కర్రలతో దాడికి దిగారు. వారు వేసుకున్న టెంట్లను పీకిపారేశారు. రైతులపైకి రాళ్లు రువ్వారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు లాఠీచార్జి చేసి బాష్పవాయువు గోళాలను ప్రయోగించారు. టిక్రీ సరిహద్దు వద్ద కూడా ఇలాంటి ఘటనే చోటుచేసుకుంది. దీంతో రెండు చోట్లా బలగాలను భారీగా మోహరించారు.

      రైతుల పోరాటానికి మద్దతు విషయంలో  ప్రముఖ సామాజిక ఉద్యమకారుడు అన్నా హజారే యూటర్న్ తీసుకున్నారు. వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతులు చేస్తున్న ఆందోళనకు మద్దతుగా నిరవధిక నిరాహారదీక్ష చేపట్టనున్నట్టు ప్రకటించిన ఆయన.. తాాజాగా ఆ ఆలోచనను విరమించుకున్నారు. మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, బీజేపీ నేత దేవేంద్ర ఫడ్నవీస్‌తో భేటీ అనంతరం ఆయన సమక్షంలోనే ఈ ప్రకటన చేశారు అన్నా హజారే. కనీస మద్దతు ధరను 50 శాతం పెంచాలని ప్రభుత్వం నిర్ణయించినట్టు తనకు లేఖ అందిందని, తాను ప్రతిపాదించిన 15 డిమాండ్ల పరిష్కారానికి కృషి చేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలిసిందని, అందుకే నిరాహార దీక్ష ఆలోచనను విరమించుకుంటున్నట్టు హజారే తెలిపారు.


     జాతిపిత మహాత్మాగాంధీ వర్ధంతిని పురస్కరించుకుని శనివారం సద్భావన దినం పాటించాలని రైతులు నిర్ణయించారు. ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు రైతులు ఉపవాస దీక్షచేపట్టనున్నారు.రైతు ఉద్యమానికి రాష్ట్రీయ లోక్‌దళ్ చీఫ్ అజిత్ సింగ్ మద్దతు ప్రకటించారు.




బ్రాహ్మ‌ణ ఘోష‌: బ‌్రాహ్మ‌ణులు వేసే ఈ ప్ర‌శ్న‌కు జ‌గ‌నోరి ద‌గ్గ‌ర ఆన్స‌ర్ ఉందా ?

పదమూడో సారి యుద్దానికి సిద్దమయిన వెంకటేష్ - చిరంజీవి

జగడ్డ: విజయనగరం జిల్లాలో పోలీసులు ఇంత సీన్‌ చేస్తున్నారా..?

జగడ్డ: నెల్లూరులో అత్యల్పంగా నామినేషన్లు.. కారణం ఏంటి..?

ఎడిటోరియల్: "కచరా" పోయి "కతరా" పాలనా!

ఇక పవర్ స్టార్ వంతు ... ఒకటి కాదు, ఏకంగా రెండు బుల్లెట్స్ రెడీ... ??

జగడ్డ: పవన్ కల్యాణ్ దెబ్బ అదుర్స్ కదూ..!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - SRISHIVA]]>