PoliticsSRISHIVAeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/mp-revanth-reddy9dd2d42f-d33e-4392-8de1-406a6fcc9443-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/mp-revanth-reddy9dd2d42f-d33e-4392-8de1-406a6fcc9443-415x250-IndiaHerald.jpgతెలంగాణ ఫైర్ బ్రాండ్ లీడర్ , మల్కాజ్ గిరి రేవంత్ రెడ్డి మరోసారి తన విశ్వరూపం చూపించారు. తన పవర్ ఫుల్ ప్రసంగాలతో ప్రత్యర్థులపై విరుచుకుపడే రేవంత్ రెడ్డి.. ఈసారి ఏకకాలంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను, ప్రధాని మోడీ, సీఎం కేసీఆర్ ను... టీఆర్ఎస్, బీజేపీలను తీవ్ర స్థాయిలో టార్గెట్ చేశారు.mp revanth reddy;modi;kcr;dharma;rajeev;revanth;delhi;bharatiya janata party;telangana rashtra samithi trs;korcha;telangana;revanth reddy;congress;ram madhav;mp;రాజీనామా;district;kanna lakshminarayana;prime minister;chief minister;mla;central government;research and analysis wing;reddy;leader;partyఅర గుండు.. తొండి.. తాగుబోతు! వామ్మో రేవంత్ రెచ్చిపోయాడుగా!అర గుండు.. తొండి.. తాగుబోతు! వామ్మో రేవంత్ రెచ్చిపోయాడుగా!mp revanth reddy;modi;kcr;dharma;rajeev;revanth;delhi;bharatiya janata party;telangana rashtra samithi trs;korcha;telangana;revanth reddy;congress;ram madhav;mp;రాజీనామా;district;kanna lakshminarayana;prime minister;chief minister;mla;central government;research and analysis wing;reddy;leader;partySat, 30 Jan 2021 20:14:15 GMTతెలంగాణ ఫైర్ బ్రాండ్ లీడర్ , మల్కాజ్ గిరి రేవంత్ రెడ్డి మరోసారి తన విశ్వరూపం చూపించారు. తన పవర్ ఫుల్ ప్రసంగాలతో ప్రత్యర్థులపై విరుచుకుపడే  రేవంత్ రెడ్డి.. ఈసారి ఏకకాలంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను, ప్రధాని  మోడీ, సీఎం కేసీఆర్ ను... టీఆర్ఎస్, బీజేపీలను తీవ్ర స్థాయిలో టార్గెట్ చేశారు.
నిజామాబాద్ జిల్లా ఆర్మూరులో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పసుపు రైతులకు మద్దతుగా చేపట్టిన రాజీవ్ రైతు భరోసా దీక్లలో పాల్గొన్న  రేవంత్ రెడ్డి.. పంచ్ డైలాగులతో అదరగొట్టారు.

సీఎం కేసీఆర్, ప్రధాని మోడీ ఒడిలో కూర్చుని రైతులను దగా చేస్తున్నారని కాంగ్రెస్ నేత రేవంత్‌రెడ్డి మండిపడ్డారు. పసుపు బోర్డు పెడతానన్న బోడ గుండోడు ఏడికి పోయిండని ఎంపీ అర్వింద్‌ను ఉద్దేశించి ఎద్దేవాచేశారు. ఢిల్లీలో రైతుల చస్తున్నా.. పట్టించుకోకుండా రైతు సంక్షేమ ప్రభుత్వం అని చెప్పుకోవడానికి సిగ్గులేదని విమర్శించారు. అరగుండతో మనకు పని లేదన్న రేవంత్ రెడ్డి... ప్రధాని మోడీ గుండెల మీదనే   గుద్దుదామని రైతులకు పిలుపిచ్చారు. ఢిల్లీ వీధుల్లో కదం తొక్కడానికి కదిలి రావాలని పసుపు రైతులను కోరారు.  

    ‘‘నీ పేరులోనే ధర్మం ఉంది కానీ చేసేదంతా అధర్మమే. అర్వింద్‌ను గెలిపిస్తే పసుపు బోర్డు తెస్తానన్న బీజేపీ నేత రాంమాధవ్ హామీ ఏమైంది?. అర్వింద్ బాల్య వితంతువుగా మారుతావా?. రైతులతో ఇలాగే వ్యవహరిస్తే నీ రాజకీయ భవిష్యత్తును బొంద పెడతారని రేవంత్ రెడ్డి చెప్పారు. ‘‘ధర్మపురి నువ్వు గుండు కొట్టించుకన్నా పర్వాలేదు. ఎంపీ పదవికి రాజీనామా చేయకున్నా పర్వాలేదు. కానీ.. 20 నెలలైనా పసుపు బోర్డు ఎందుకు తేలేదో చెప్పాలి. పార్లమెంట్‌లో రైతుల పక్షాన ఎందుకు కొట్లాడటం లేదు.’’ అని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు.

తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ పైనా విరుచుకుపడ్డారు రేవంత్ రెడ్డి. బండి సంజయ్.. తొండి సంజయ్ లా మారి అన్ని అబద్దాలే చెబుతున్నారని విమర్శించారు. బండి సంజయ్‌కు నిజామాబాద్ రైతుల గోస కనిపించడం లేదా అని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. మద్దతు ధర ఇస్తున్నందుకే నష్టం వస్తుందని ముఖ్యమంత్రి కేసీఆర్ అనడం సరికాదన్నారు రేవంత్ . రైతు బతికుండగా సాయం చేయని కేసీఆర్ చచ్చాక 6 లక్షలు ఇస్తాడట.. ఇలాంటి ముఖ్యమంత్రి ఎక్కడైనా ఉంటారా అని ఆయన ప్రశ్నించారు.ఆర్మూర్ ఎమ్మెల్యే ఎత్తిపోతల్లో ముందుంటారని రేవంత్ రెడ్డి ఎద్దేవా చేశారు.
 


అతనితో నటించేందుకు నో అంటున్న రౌడీ బేబీ ఫ్యాన్స్....

జగడ్డ: మార్చి తర్వాత కూడా నిమ్మగడ్డేనా!

జగడ్డ : నిమ్మగడ్డ ఎటాక్..ఏపీ మంత్రుల కౌంటర్ ఎటాక్ !!

శ్రీదేవి, రాజబాబు జంటగా నటించిన సినిమా ఇదే..!?

మళ్ళీ మొదటికొచ్చిన మహేష్...ఫ్యాన్స్ కి షాక్...?

బ్రాహ్మణ ఘోష : భ్రాహ్మణులు వెనుకబడటానికి కారణం ఏంటి..??

F3 ప్రీ రిలీజ్ బిజినెస్ అదుర్స్.. వెంకటేష్, వరుణ్ తేజ్ స్టామినా ప్రూవ్ చేస్తుంది..!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - SRISHIVA]]>