PoliticsVUYYURU SUBHASHeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/politics/politics_latestnews/jagan7e1d00a3-b3f8-4979-b57e-cf9f0a041106-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/politics/politics_latestnews/jagan7e1d00a3-b3f8-4979-b57e-cf9f0a041106-415x250-IndiaHerald.jpgన‌మ్ముకోవ‌డం మంచిదే అయినా.. ఈ నేప‌థ్యంలో స్థానిక నాయ‌క‌త్వాన్ని జ‌గ‌న్ ప‌ట్టించుకోక‌పోవ‌డం స‌రికాద‌నే సూచ‌న‌లు కొన్నాళ్లుగా పార్టీలో వినిపిస్తున్నాయి. ముఖ్యంగా ఎవ‌రైతే.. జ‌గ‌న్ సీఎం కావాల‌ని కోరుకున్నారో.. వారంతా ఇప్పుడు తిర‌స్క‌ర‌ణ‌ల‌కు, నిర్ల‌క్ష్యానికి గుర‌వుతున్నారు. దీంతో వీరంతా ఇప్పుడు ఎన్నిక‌ల‌కు దూరంగా ఉండాల‌ని అంత‌ర్గ‌తంగా నిర్ణ‌యించుకున్నారు. మ‌రోవైపు జ‌గ‌న్ ఏ ప‌థ‌కాల‌నైతే.. న‌మ్ముకున్నారో.. వాటిపై ప్ర‌జ‌ల్లో మిశ్ర‌మ స్పంద‌న వ‌స్తోంది. ఎందుకంటే.. క్షేత్ర‌స్థాయిలోల‌బ్ధి దారులు అంద‌రికీjagan;tiru;letter;local language;ycp;mantraజ‌గ‌న్ ప్లాన్ ఇంత రివ‌ర్సా.... ప‌ల్లెల్లో రేపు రిజ‌ల్ట్ ఇదే...?జ‌గ‌న్ ప్లాన్ ఇంత రివ‌ర్సా.... ప‌ల్లెల్లో రేపు రిజ‌ల్ట్ ఇదే...?jagan;tiru;letter;local language;ycp;mantraSat, 30 Jan 2021 08:30:00 GMTవైసీపీ అధినేత‌, సీఎం జ‌గ‌న్ దూకుడు ఇప్పుడు చ‌ర్చ‌నీయాంశంగా మారింది. ఇప్ప‌టి వ‌రకు జ‌గ‌న్ త‌న ప‌థ‌కాలు, సంక్షేమ కార్య‌క్ర‌మాల‌ను న‌మ్ముకున్నారు. ముఖ్యంగా పేద‌ల‌కు ఇళ్లు, అమ్మ ఒడి, ఇత‌ర కీల‌క ప‌థ‌కాల‌ను న‌మ్ముకున్నారు. ఇవే త‌న‌కు ప్ర‌జ‌ల్లో మంచి ఫాలోయింగ్ తెస్తాయ‌ని భావించారు. కానీ, ఎన్నిక‌ల స‌మ‌యం వ‌చ్చే స‌రికి.. ఇవ‌న్నీ ప్ర‌యోజ‌నం క‌ల్పించేంది కేవ‌లం 30% మాత్ర‌మేన‌ని స్పష్ట‌మై పోయింది. తాజాగా ఇదే విషయంపై వైసీపీలోనూ చ‌ర్చ సాగుతోంది. ప్ర‌భుత్వం అనేక ప‌థ‌కాలు ప్ర‌వేశ పెట్టినా.. వాటి ఫ‌లితం మాత్రం ఆశించిన విధంగా లేద‌ని అంటున్నారు.

గ‌తంలోనూ చంద్ర‌బాబు ప్ర‌భుత్వం అనేక ప‌థ‌కాలు ప్ర‌వేశ పెట్టింది. అప్ప‌ట్లోనూ ఎన్నిక‌ల్లో త‌మ‌దే గెలుపు అని నాయ‌కులు అనుకున్నారు. కానీ .. ప్ర‌జ‌లు ఎలాంటి తీర్పు చెప్పారో తెలిసిందే. ఇప్పుడు ఇలాంటి ప‌రిస్థితి వైసీపీకి ఎదుర‌వుతోంద‌ని అంటున్నారు వైసీపీ నాయ‌కులు. ముఖ్యంగా ప‌థ‌కాల‌ను న‌మ్ముకోవ‌డం మంచిదే అయినా.. ఈ నేప‌థ్యంలో స్థానిక నాయ‌క‌త్వాన్ని జ‌గ‌న్ ప‌ట్టించుకోక‌పోవ‌డం స‌రికాద‌నే సూచ‌న‌లు కొన్నాళ్లుగా పార్టీలో వినిపిస్తున్నాయి.

ముఖ్యంగా ఎవ‌రైతే.. జ‌గ‌న్ సీఎం కావాల‌ని కోరుకున్నారో.. వారంతా ఇప్పుడు తిర‌స్క‌ర‌ణ‌ల‌కు, నిర్ల‌క్ష్యానికి గుర‌వుతున్నారు. దీంతో వీరంతా ఇప్పుడు ఎన్నిక‌ల‌కు దూరంగా ఉండాల‌ని అంత‌ర్గ‌తంగా నిర్ణ‌యించుకున్నారు. మ‌రోవైపు జ‌గ‌న్ ఏ ప‌థ‌కాల‌నైతే.. న‌మ్ముకున్నారో.. వాటిపై ప్ర‌జ‌ల్లో మిశ్ర‌మ స్పంద‌న వ‌స్తోంది. ఎందుకంటే.. క్షేత్ర‌స్థాయిలోల‌బ్ధి దారులు అంద‌రికీ న్యాయం జ‌ర‌గ‌క‌పోవ‌డ‌మేన‌ని అంటున్నారు. పైగా మంత్రులు త‌మ‌కు న‌చ్చిన వారిని మాత్ర‌మే ల‌బ్ధి దారులుగా ఎంపిక చేసుకున్నారు. దీంతో గ్రామీణ ప్రాంతాల్లో పేద‌ల‌కు ఇళ్ల ప‌థ‌కం వ్య‌తిరేక ఫ‌లితం ఇచ్చింది.

అదేవిధంగా ముందు ల‌బ్ధి దారులుగా ఎంపిక చేసిన వారిని కూడా త‌ర్వాత మంత్రులు, ఎంపీల జోక్యంతో తొల‌గించారు. దీంతో వారంతా కూడా అధికారుల చుట్టూ ఇప్ప‌టికీ తిరుగుతున్నారు. ఇక‌, అమ్మ ఒడి వంటి కీల‌క ప‌థ‌కం ప‌రిస్థితి కూడా ఇలానే ఉంది. దీంతో జ‌గ‌న్ దూకుడు వ‌ర్క‌వుట్ అయ్యేలా క‌నిపించ‌డం లేద‌ని అంటున్నారు. అలా కాకుండా స్థానిక నేత‌ల‌ను ప్రోత్స‌హించి ఉంటే ప‌రిస్థితి వేరేలా ఉండేద‌ని చెబుతున్నారు. మ‌రి ఏం జ‌రుగుతుందో చూడాలి.  


అన్నా హజారే యూ టర్న్!

పదమూడో సారి యుద్దానికి సిద్దమయిన వెంకటేష్ - చిరంజీవి

జగడ్డ: విజయనగరం జిల్లాలో పోలీసులు ఇంత సీన్‌ చేస్తున్నారా..?

జగడ్డ: నెల్లూరులో అత్యల్పంగా నామినేషన్లు.. కారణం ఏంటి..?

ఎడిటోరియల్: "కచరా" పోయి "కతరా" పాలనా!

ఇక పవర్ స్టార్ వంతు ... ఒకటి కాదు, ఏకంగా రెండు బుల్లెట్స్ రెడీ... ??

జగడ్డ: పవన్ కల్యాణ్ దెబ్బ అదుర్స్ కదూ..!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - VUYYURU SUBHASH]]>