PoliticsVUYYURU SUBHASHeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_analysis/jagan-tdpe8f23f88-764b-4cf7-a5a0-6f288b1fb7bd-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_analysis/jagan-tdpe8f23f88-764b-4cf7-a5a0-6f288b1fb7bd-415x250-IndiaHerald.jpgమొత్తం ఫైనాన్స్ చేయ‌గ‌ల బ‌ల‌మైన ఆర్థిక నేత‌. కొద్ది రోజుల క్రిత‌మే ఇదే జిల్లాకు చెందిన మాజీ మంత్రి శిద్ధా రాఘ‌వ‌రావు కుటుంబాన్ని బ‌ల‌వంతంగా వైసీపీలో చేర్చుకున్నారు. శిద్ధా గ్రానైట్ క్వారీల‌పై ప‌దే ప‌దే దాడులు చేయించ‌డంతో ఆ కుటుంబం ఆ దాడులు త‌ట్టుకోలేక వైసీపీలోకి వెళ్లిపోయింది. ఇక ఇప్పుడు గొట్టిపాటిని గ‌త కొద్ది రోజులుగా వ‌రుస‌గా టార్గెట్ చేస్తూ వ‌స్తున్నారు. తాజాగా స్తానిక ఎన్నిక‌ల వేళ ప్ర‌కాశం జిల్లాలో అద్దంకితో పాటు ప‌రుచూరు, సంత‌నూత‌ల‌పాడు, చీరాల అటు ప‌శ్చిమ ప్ర‌కాశంలో ప‌లువురు టీడీపీ నేత‌ల‌jagan tdp;cbn;editor mohan;jagan;andhra pradesh;district;k s ravikumar;mandalam;chief minister;mla;minister;letter;tdp;local language;prakasam district;chirala;ycp;gottipati ravi kumar;prakasm;sv mohan reddy;reddy;chilakaluripeta;addanki;partyజ‌గ‌నోరికే కొర‌క‌రానోడుగా మారిన ఒకే ఒక్క ఎమ్మెల్యే...!జ‌గ‌నోరికే కొర‌క‌రానోడుగా మారిన ఒకే ఒక్క ఎమ్మెల్యే...!jagan tdp;cbn;editor mohan;jagan;andhra pradesh;district;k s ravikumar;mandalam;chief minister;mla;minister;letter;tdp;local language;prakasam district;chirala;ycp;gottipati ravi kumar;prakasm;sv mohan reddy;reddy;chilakaluripeta;addanki;partySat, 30 Jan 2021 09:30:00 GMTఒకే ఒక్క ఎమ్మెల్యే ఏపీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి కి కొరకరాని కొయ్యగా మారాడు. గతంలో జగన్ ముఖ్య అనుచరుడుగా ఉన్న సదరు ఎమ్మెల్యే పార్టీ ఫిరాయించిన గెలిచిన ఏకైక ఎమ్మెల్యే గా రికార్డు క్రియేట్ చేశారు. సదరు ఎమ్మెల్యేను ఇప్పుడు తిరిగి వైసీపీలో చేర్చుకునేందుకు వైసిపి అధిష్టానం ముప్పుతిప్పలు పెడుతున్నా ఆ ఎమ్మెల్యే మాత్రం జ‌గ‌న్ వైపే చూడ‌డం లేదు. అంతే కాదు తన నియోజకవర్గంలో వైసీపీ కి ఎంత మాత్రం స్కోప్ ఇవ్వటంలేదు. ఇంతకు ఆ ఎమ్మెల్యే ఎవరో కాదు ప్రకాశం జిల్లా అద్దంకి ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్. 2014లో వైసీపీ తరపున గెలిచిన 23 ఎంఎల్ఏలను చంద్రబాబునాయుడు ప్రలోభాలకు గురిచేసి టీడీపీలోకి లాక్కున్న విషయం తెలిసిందే.

వీరిలో గెలిచింది ఒక్క ర‌వికుమార్ మాత్ర‌మే. ర‌వికుమార్ లాంటి వ్య‌క్తి టీడీపీలో ఉంటే అద్దంకిలో మాత్ర‌మే కాదు... ప్ర‌కాశం జిల్లాకు మొత్తం ఫైనాన్స్ చేయ‌గ‌ల బ‌ల‌మైన ఆర్థిక నేత‌. కొద్ది రోజుల క్రిత‌మే ఇదే జిల్లాకు చెందిన మాజీ మంత్రి శిద్ధా రాఘ‌వ‌రావు కుటుంబాన్ని బ‌ల‌వంతంగా వైసీపీలో చేర్చుకున్నారు. శిద్ధా గ్రానైట్ క్వారీల‌పై ప‌దే ప‌దే దాడులు చేయించ‌డంతో ఆ కుటుంబం ఆ దాడులు త‌ట్టుకోలేక వైసీపీలోకి వెళ్లిపోయింది. ఇక ఇప్పుడు గొట్టిపాటిని గ‌త కొద్ది రోజులుగా వ‌రుస‌గా టార్గెట్ చేస్తూ వ‌స్తున్నారు.

తాజాగా స్తానిక ఎన్నిక‌ల వేళ ప్ర‌కాశం జిల్లాలో అద్దంకితో పాటు ప‌రుచూరు, సంత‌నూత‌ల‌పాడు, చీరాల అటు ప‌శ్చిమ ప్ర‌కాశంలో ప‌లువురు టీడీపీ నేత‌ల‌కు ర‌వి అండ‌గా ఉంటార‌న్న అనుమానంతో ర‌వి గ్రానైట్ క్వారీల‌పై వైసీసీ స‌ర్కార్ వ‌రుస‌గా దాడులు చేయిస్తున్న‌ట్టు ఆరోప‌ణ‌లు వ‌స్తున్నాయి. జిల్లాలోని చీమకుర్తి ప్రాంతంలో గొట్టిపాటికి ఉన్న గ్రానైట్ క్వారీలపై దాడులు చేసి లెక్క‌ల్లో తేడాలున్నాయ‌ని మూసివేయించారు.

ఇప్పుడు గుంటూరు జిల్లాలోని నాదెండ్ల మండలం, చిలకలూరిపేట దగ్గరలోని గణపవరం, మార్టూరు మండలంలోని జొన్నతాళి దగ్గరున్న ఫ్యాక్టరీల్లో వ‌రుస‌గా సోదాలు చేయిస్తోంది. ఎలాగైనా గొట్టిపాటిని పార్టీలో చేర్చుకోవాల‌ని జ‌గ‌న్ ద‌గ్గ‌ర నుంచే ఆదేశాలు ఉన్నా గొట్టిపాటి ఏ మాత్రం లొంగ‌కుండా స్థానిక ఎన్నిక‌ల్లో మ‌రింత క‌సితో ప‌ని చేస్తోన్న ప‌రిస్థితి ఉంది. 


జగడ్డ : జగనోరి రాజ్యం.. రాజ్యాంగానికి పరాకాష్ట..!!

బ్రాహ్మ‌ణ ఘోష‌: జ‌గ‌న్ వ‌స్తే క‌ష్టాలు తీర‌తాయ‌నుకుంటే రెట్టింప‌య్యాయే ?‌

జగడ్డ: కొత్త ఎన్నికల కార్యదర్శిగా ఐఏఎస్ కన్నబాబు ...?

బ్రాహ్మ‌ణ ఘోష‌: బ‌్రాహ్మ‌ణులు వేసే ఈ ప్ర‌శ్న‌కు జ‌గ‌నోరి ద‌గ్గ‌ర ఆన్స‌ర్ ఉందా ?

జ‌గ‌న్ ప్లాన్ ఇంత రివ‌ర్సా.... ప‌ల్లెల్లో రేపు రిజ‌ల్ట్ ఇదే...?

ప్ర‌కాశం టీడీపీలో ఏం జ‌రుగుతోంది.... ఒకేసారి ఇన్ని షాక్‌లా ?

పదమూడో సారి యుద్దానికి సిద్దమయిన వెంకటేష్ - చిరంజీవి




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - VUYYURU SUBHASH]]>