MoviesMamatha Reddyeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/bigg-bossfe9892e1-37a7-401a-8b0e-51b4b85c13d0-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/bigg-bossfe9892e1-37a7-401a-8b0e-51b4b85c13d0-415x250-IndiaHerald.jpgనటన మీద ఉన్న ఆసక్తితో ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది హిమజ. కెరీర్ ఆరంభంలో సీరియళ్లలో నటించే అవకాశాన్ని అందుకుంది. కొంచెం ఇష్టం.. కొంచెం కష్టం సీరియల్ తో బుల్లితెరకు పరిచయమైన నటి హిమజ. ఈ క్రమంలోనే ఎన్నో ఆఫర్లను దక్కించుకుని సత్తా చాటిందీ బ్యూటీ. bigg boss;beauty;bhama;bigboss;interview;nenu sailaja;reality show;contract;heroineబిగ్ బాస్ షో గురించి బయట ఎవరికి తెలియని నిజాలు బయటపెట్టిన హిమజ.!?బిగ్ బాస్ షో గురించి బయట ఎవరికి తెలియని నిజాలు బయటపెట్టిన హిమజ.!?bigg boss;beauty;bhama;bigboss;interview;nenu sailaja;reality show;contract;heroineSat, 30 Jan 2021 19:45:21 GMTనేను శైలజ సినిమాతో సైడ్ ఆర్టిస్ట్ గా వెండితెరకు పరిచయమైంది ఈ భామ. ఇక వరుస అవకాశాలను సద్వినియోగం చేసుకుంటూ ఇక ఇటీవల ఆమె హీరోయిన్ గా ఒక్క చిత్రాన్ని కూడా రూపొందించారు.

ఇక కెరీర్ సాఫీగా సాగిపోతోన్న సమయంలో బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్‌లోకి ఎంట్రీ ఇచ్చింది హిమజ. మూడో సీజన్ ‌కు కంటెస్టెంట్‌ గా వచ్చిన ఆమె.. తనదైన మార్కు చూపించి పాపులారిటీని సొంతం చేసుకుంది. నిజాయితీగా ఆడుతూ.. ఉన్నది ఉన్నట్లు చెబుతూ ప్రేక్షకుల నుంచి ఓట్లను రాబట్టింది. కానీ, కొన్ని గొడవల కారణంగా ఎన్నో రోజులు హౌస్‌లో ఉండలేకపోయింది.

అయితే హిమజ సోషల్ మీడియాలో యమ యాక్టివ్‌గా ఉంటోంది. ఈ క్రమంలోనే తనకు సంబంధించిన ఎన్నో విషయాలను ఫ్యాన్స్‌తో పంచుకుంటోంది. మరోవైపు, తన స్నేహితులతో కలిసి తరచూ ఏదో ఒక ట్రిప్ వేస్తోందీ బ్యూటీ. ఈ నేపథ్యంలోనే ఇటీవల తోటి నటీమణులతో కలిసి ఉత్తరాదికి వెళ్లింది. వీటికి సంబంధించిన ఫొటోలు, వీడియాలను సోషల్ మీడియాలో షేర్ చేసింది.

ఇక బిగ్ బాస్ షోలోకి ఎంట్రీ ఇచ్చిన తర్వాత ఎంతో మంది వరుస ఆఫర్లను అందుకుంటూ దూసుకుపోతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో మూడో సీజన్‌లో కంటెస్టెంట్‌గా పాల్గొన్న తర్వాత మీకు అవకాశాలే రాలేదా? అని ఇటీవల జరిగిన ఓ ఇంటర్వ్యూలో యాంకర్.. హిమజను ప్రశ్నించింది. దీనికి సమాధానం చెబుతూ బిగ్ బాస్ గురించి కొన్ని రహస్యాలను బయట పెట్టింది ఈ భామ.

బిగ్ బాస్ షోపై హిమజ ఈ విధంగా స్పందించారు. ‘బిగ్ బాస్ తర్వాత చాలా షోల నుంచి నాకు ఆఫర్లు వచ్చాయి. కానీ, మాటీవీ వాళ్లతో చేసుకున్న ఒప్పందం వల్ల అవన్నీ కోల్పోయాను. లేకుంటే కథ వేరే ఉండేది. బిగ్ బాస్‌లోకి వెళ్లాలంటే.. నిర్ణీత కాలం పాటు మరే వినోద కార్యక్రమంలోనూ చేయకూడదని వాళ్ల ఒప్పందంలో ఉంది. కంటెస్టెంట్లంతా దానికి ఒప్పుకోవాల్సిందే' అంటూ హిమజ చెప్పుకొచ్చింది.


అతనితో నటించేందుకు నో అంటున్న రౌడీ బేబీ ఫ్యాన్స్....

జగడ్డ: మార్చి తర్వాత కూడా నిమ్మగడ్డేనా!

జగడ్డ : నిమ్మగడ్డ ఎటాక్..ఏపీ మంత్రుల కౌంటర్ ఎటాక్ !!

శ్రీదేవి, రాజబాబు జంటగా నటించిన సినిమా ఇదే..!?

మళ్ళీ మొదటికొచ్చిన మహేష్...ఫ్యాన్స్ కి షాక్...?

బ్రాహ్మణ ఘోష : భ్రాహ్మణులు వెనుకబడటానికి కారణం ఏంటి..??

F3 ప్రీ రిలీజ్ బిజినెస్ అదుర్స్.. వెంకటేష్, వరుణ్ తేజ్ స్టామినా ప్రూవ్ చేస్తుంది..!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Mamatha Reddy]]>