SportsKISHOREeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/sports/libra_libra/sports-news01f93f5b-8a69-4598-aca2-d7652250220e-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/sports/libra_libra/sports-news01f93f5b-8a69-4598-aca2-d7652250220e-415x250-IndiaHerald.jpgజస్ప్రీత్ బుమ్రా అసాధారణ బౌలర్ అని ఇంగ్లండ్‌ ఓపెనర్‌ రోరీ బర్న్స్‌ అన్నాడు. అతని బౌలింగ్ ఎదుర్కోవడం చాలా కష్టమని బర్న్స్ అభిప్రాయపడ్డాడు. బూమ్రా ప్రపంచ ఉత్తమ బౌలర్ గా తన స్థానాన్ని మెరుగు పరుచుకుంటున్నాడని తెలిపాడు. ప్రస్తుతం టీమిండియా ఫేస్ విభాగం పటిష్టంగా ఉందని అతను పేర్కొన్నాడు. భారత్ ఉన్న పిచ్ లపై టీమిండియా ఆటగాళ్లకు స్పష్టమైన అవగాహన ఉందని అన్నాడు. ఇటీవల టీమిండియా పేస్‌ బౌలర్లు చెలరేగుతుండటంతో భారత్‌ గడ్డపై ఈసారి తమకు సీమ్‌ పిచ్‌లు ఎదురవుతాయని ఆశిస్తున్నట్లు తెలిపాడు.sports news;virat kohli;india;australia;england;sri lanka;media;february;chennai;internationalబూమ్రా అసాధారణమైన బౌలర్ : ఇంగ్లాండ్ ఓపెనర్ !!బూమ్రా అసాధారణమైన బౌలర్ : ఇంగ్లాండ్ ఓపెనర్ !!sports news;virat kohli;india;australia;england;sri lanka;media;february;chennai;internationalSat, 30 Jan 2021 08:20:15 GMTభారత్ ఉన్న పిచ్ లపై టీమిండియా ఆటగాళ్లకు స్పష్టమైన అవగాహన ఉందని అన్నాడు. ఇటీవల టీమిండియా పేస్‌ బౌలర్లు చెలరేగుతుండటంతో భారత్‌ గడ్డపై ఈసారి తమకు సీమ్‌ పిచ్‌లు ఎదురవుతాయని ఆశిస్తున్నట్లు తెలిపాడు.

సాధారణంగా భారత్‌లో స్పిన్‌కు అనుకూలమైన పిచ్‌లే ఉంటాయి. కానీ గత కొంత కాలంగా భారత సీమర్లు కూడా స్పిన్నర్లకు దీటుగా మ్యాచ్‌ల్ని భారత్‌ వైపు తిప్పుతున్నారు. ఈ నేపథ్యంలో భారత పర్యటనకు వచ్చిన ఇంగ్లండ్‌ బ్యాట్స్‌మన్‌ బర్న్స్‌ మీడియా సమావేశంలో పిచ్‌ల సంగతి ప్రస్తావించాడు. భారత్ ఇంగ్లాండ్ జట్టు నాలుగు టెస్ట్ మ్యాచ్ లు, 5 టి20 లు, 3 వన్డేలలతో సుదీర్ఘ పర్యటన చేయనుంది. ఈ నేపథ్యంలో ఫిబ్రవరి 5 నుండి చెన్నైలో లో మొదటి రెండు టెస్టులు జరగనున్నాయి. ఇప్పటికే ఇరు జట్లు కూడా చెన్నై చేరుకుని క్వారంటైన్ నిబంధనలను పాటిస్తున్నారు.

భారత్ ఆస్ట్రేలియా పర్యటనలో ఘన విజయం సాధించి స్వదేశంలో జరిగే ఈ సిరీస్ పై కూడా పైచేయి సాధించాలని ఉండగా, ఇంగ్లాండ్ కూడా శ్రీలంక జట్టుపై క్లీన్స్వీప్ విజయం సాధించి ఆత్మవిశ్వాసం కూడగట్టుకుని టీమిండియాతో పోరుకు సిద్ధమైంది. అంతేకాకుండా కరోనా కారణంగా దాదాపుగా ఏడాది తర్వాత జరుగుతున్న మొదటి అంతర్జాతీయ సిరీస్ కూడా ఇదే కావడంతో అభిమానులు కూడా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మరి పైచేయి ఏ జట్టు సాధిస్తుందో చూడాలి. ఈ సిరీస్ లో విరాట్ కోహ్లీ కూడా తిరిగి జట్టులోకి రానుండడం టీమిండియాకు కలిసొచ్చే అంశం. గత ఆస్ట్రేలియా పర్యటనలో మొదటి టెస్టు అనంతరం జట్టుకు దూరమైన సంగతి తెలిసిందే.


చిన్న కారణానికే భార్య గొంతు కోసిన భర్త.. అసలేం జరిగిందంటే..?

పదమూడో సారి యుద్దానికి సిద్దమయిన వెంకటేష్ - చిరంజీవి

జగడ్డ: విజయనగరం జిల్లాలో పోలీసులు ఇంత సీన్‌ చేస్తున్నారా..?

జగడ్డ: నెల్లూరులో అత్యల్పంగా నామినేషన్లు.. కారణం ఏంటి..?

ఎడిటోరియల్: "కచరా" పోయి "కతరా" పాలనా!

ఇక పవర్ స్టార్ వంతు ... ఒకటి కాదు, ఏకంగా రెండు బుల్లెట్స్ రెడీ... ??

జగడ్డ: పవన్ కల్యాణ్ దెబ్బ అదుర్స్ కదూ..!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - KISHORE]]>