Politicspraveeneditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/revanth-reddy3105594c-7f9f-47de-8dd6-64e6f9bf6981-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/revanth-reddy3105594c-7f9f-47de-8dd6-64e6f9bf6981-415x250-IndiaHerald.jpgతెలంగాణ రాజకీయాల్లో కాంగ్రెస్ పార్టీలో ఫైర్ బ్రాండ్ గా పేరున్న రేవంత్ రెడ్డి ఎప్పుడు అధికార పార్టీ తీరును ఎండగడుతూ తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పిస్తూ ఉంటారు అన్న విషయం తెలిసిందే ప్రస్తుతం టీఆర్ఎస్ పార్టీ చేస్తున్న ప్రతి పనిని తప్పుబడుతూ టిఆర్ఎస్ చేస్తున్న తప్పులు అన్నింటినీ కూడా ప్రజల్లోకి తీసుకు వెళుతూ ఉంటారు మల్కాజ్గిరి ఎంపీ రేవంత్ రెడ్డి. అయితే గతంలో టిఆర్ఎస్ పార్టీ కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకత వ్యక్తం చేసి.. మద్దతు ఇవ్వబోమని అంటూ చెప్పడం.. ఇక ఆ తర్వాత ముఖ్యమంత్రి కkcr;kcr;prema;revanth;bharatiya janata party;telangana rashtra samithi trs;telangana;revanth reddy;congress;mp;chief minister;love;central government;u turn;nijam;reddy;party;malkajgiriకేసిఆర్ యూ టర్న్.. అందుకే అలా చేయట్లేదు : రేవంత్కేసిఆర్ యూ టర్న్.. అందుకే అలా చేయట్లేదు : రేవంత్kcr;kcr;prema;revanth;bharatiya janata party;telangana rashtra samithi trs;telangana;revanth reddy;congress;mp;chief minister;love;central government;u turn;nijam;reddy;party;malkajgiriSat, 30 Jan 2021 09:00:00 GMTతెలంగాణ రాజకీయాల్లో కాంగ్రెస్ పార్టీలో ఫైర్ బ్రాండ్ గా పేరున్న రేవంత్ రెడ్డి ఎప్పుడు అధికార పార్టీ తీరును ఎండగడుతూ తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పిస్తూ ఉంటారు అన్న విషయం తెలిసిందే ప్రస్తుతం టీఆర్ఎస్ పార్టీ చేస్తున్న ప్రతి పనిని తప్పుబడుతూ టిఆర్ఎస్ చేస్తున్న తప్పులు అన్నింటినీ కూడా ప్రజల్లోకి తీసుకు వెళుతూ ఉంటారు మల్కాజ్గిరి ఎంపీ రేవంత్ రెడ్డి. అయితే గతంలో టిఆర్ఎస్ పార్టీ కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకత వ్యక్తం చేసి.. మద్దతు ఇవ్వబోమని అంటూ చెప్పడం.. ఇక ఆ తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్ వ్యవసాయ చట్టాలకు మద్దతు ప్రకటించి యూటర్న్ తీసుకోవడం తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్గా మారిపోయింది అన్న విషయం తెలిసిందే.



 ఈ క్రమంలోనే తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన వ్యవసాయ చట్టాల విషయంలో తీసుకున్న నిర్ణయంపై అటు  ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పిస్తుంది. ఇక ఇటీవల ఇదే అంశంపై మాట్లాడిన తెలంగాణ కాంగ్రెస్ కీలక నేత మల్కాజిగిరి ఎంపీ రేవంత్ రెడ్డి కేసీఆర్ సర్కారు తీరుపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పిస్తూ విరుచుకుపడ్డారు. రైతులు  పై కేసీఆర్ కపట ప్రేమ చూపిస్తున్నారు అంటూ విమర్శించారు రేవంత్ రెడ్డి. బిజెపి టిఆర్ఎస్ పార్టీలు ఒక్కటే అంటూ వ్యాఖ్యానించారు రేవంత్ రెడ్డి.


 అందుకే రాష్ట్రపతి ప్రసంగాన్ని 18 పార్టీలు వ్యతిరేకించి బైకాట్ చేసినప్పటికీ కూడా టిఆర్ఎస్ మాత్రం వ్యతిరేకించలేదు అంటూ విమర్శలు చేశారు రేవంత్ రెడ్డి. రైతు చట్టాలకు వ్యతిరేకంగా ఒకప్పుడు మద్దతు ఇవ్వని ముఖ్యమంత్రి కేసిఆర్ ఇప్పుడు ఎందుకు యూటర్న్ తీసుకుని వ్యవసాయ చట్టాలకు జై కొడుతున్నారు అంటూ ప్రశ్నించారు. కేసిఆర్ నిజంగా రైతుల మేలు కోరుకుంటే వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపించాలని డిమాండ్ చేశారు. ఇక రైతులు చేస్తున్న ఉద్యమాన్ని ఆపాలని కేంద్రం ఎన్నో కుట్రలు చేస్తుందని ఆరోపించారు రేవంత్ రెడ్డి.


ఎమ్మెల్యే రోజాను తన నివాసంలో కలిసిన నటుడు అర్జున్ కుటుంబం..!

బ్రాహ్మ‌ణ ఘోష‌: బ‌్రాహ్మ‌ణులు వేసే ఈ ప్ర‌శ్న‌కు జ‌గ‌నోరి ద‌గ్గ‌ర ఆన్స‌ర్ ఉందా ?

జ‌గ‌న్ ప్లాన్ ఇంత రివ‌ర్సా.... ప‌ల్లెల్లో రేపు రిజ‌ల్ట్ ఇదే...?

ప్ర‌కాశం టీడీపీలో ఏం జ‌రుగుతోంది.... ఒకేసారి ఇన్ని షాక్‌లా ?

పదమూడో సారి యుద్దానికి సిద్దమయిన వెంకటేష్ - చిరంజీవి

జగడ్డ: విజయనగరం జిల్లాలో పోలీసులు ఇంత సీన్‌ చేస్తున్నారా..?

జగడ్డ: నెల్లూరులో అత్యల్పంగా నామినేషన్లు.. కారణం ఏంటి..?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>