PoliticsVUYYURU SUBHASHeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_analysis/brahminical-ghosha-doubling-up-if-you-want-to-end-the-hardships-with-jagan8a55d454-d0c2-491b-beb5-d2a4414d920a-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_analysis/brahminical-ghosha-doubling-up-if-you-want-to-end-the-hardships-with-jagan8a55d454-d0c2-491b-beb5-d2a4414d920a-415x250-IndiaHerald.jpgజ‌గ‌న్ ఏ సామా జిక వ‌ర్గానికి చెందిన నాయ‌కుడైనా.. ఏ మ‌తంపై విశ్వాసం ఉన్నా.. బ్రాహ్మ‌ణులు ప‌ట్టించుకోలేదు. త‌మ‌కు అంతో ఇంతో న్యాయం చేస్తాన‌ని హామీ ఇచ్చారుక‌నుక‌.. జ‌గ‌న్ అధికారంలోకి వ‌చ్చేయాల‌ని వారు కోరుకున్నారు. వారు కోరుకున్న‌ట్టు జ‌రిగిందో.. ప్ర‌జ‌లు కోరుకున్నారో.. రాష్ట్రంలో వైసీపీ స‌ర్కారు అధికారం చేప‌ట్టింది. మ‌రి ఇప్ప‌టికే రెండేళ్ల స‌మ‌యం దాటిపోతోంది. సీఎంగా జ‌గ‌న్ అధికారం చేప‌ట్టారు. అనేక మందికి ఎమ్మెల్సీల ద‌గ్గ‌ర నుంచి అన్ని ప‌దవులలోనూ ప్రాధాన్యం ఇచ్చారు. వివిధ కార్పొరేష‌న్ల‌ను ఇబ్బడిjagan;cm;letter;ycpబ్రాహ్మ‌ణ ఘోష‌: జ‌గ‌న్ వ‌స్తే క‌ష్టాలు తీర‌తాయ‌నుకుంటే రెట్టింప‌య్యాయే ?‌బ్రాహ్మ‌ణ ఘోష‌: జ‌గ‌న్ వ‌స్తే క‌ష్టాలు తీర‌తాయ‌నుకుంటే రెట్టింప‌య్యాయే ?‌jagan;cm;letter;ycpSat, 30 Jan 2021 09:10:00 GMTవైసీపీ అధినేత ప్ర‌స్తుత సీఎం జ‌గ‌న్ ఇచ్చిన హామీ. అయితే.. వైసీపీ స‌ర్కారు అయితే.. ఏర్ప‌డింది. కానీ, బ్రాహ్మ‌ణుల‌కు ఆయ‌న ఇచ్చిన హామీ మాత్రం ఏమీ లేకుండా పోయింది. గ‌త చంద్ర‌బాబు ప్ర‌భుత్వంలో ఆయ‌న బ్రాహ్మ‌ణుల‌కు ఇచ్చిన హామీ ఏమీలేదు. ఇక‌, చేసిందికూడా ఏమీ క‌నిపించ‌దు. ఒక్క బ్రాహ్మ‌ణ కార్పొరేష‌న్ ఏర్పాటు చేశారు. అంతే! ఇక‌, మిగిలిన ప‌ద‌వుల విష‌యంలోను, ఇత‌రత్రా.. అనేక విష‌యాల్లో చంద్ర‌బాబు బ్రాహ్మ‌ణుల‌కు మొండి చేయే చూపించారు.

దీంతో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న బ్రాహ్మ‌ణ సామాజిక వ‌ర్గం .. పాద‌యాత్ర స‌మ‌యంలో జ‌గ‌న్‌కు అండ‌గా నిలిచారు. అనేక చోట్ల య‌జ్ఞా లు, యాగాలు చేసి.. జ‌గ‌న్ అధికారంలోకి రావాల‌ని కోరుకున్నారు. అనేక ఆల‌యాల్లో పూజ‌లు కూడా చేశారు. జ‌గ‌న్ ఏ సామా జిక వ‌ర్గానికి చెందిన నాయ‌కుడైనా.. ఏ మ‌తంపై విశ్వాసం ఉన్నా.. బ్రాహ్మ‌ణులు ప‌ట్టించుకోలేదు. త‌మ‌కు అంతో ఇంతో న్యాయం చేస్తాన‌ని హామీ ఇచ్చారుక‌నుక‌.. జ‌గ‌న్ అధికారంలోకి వ‌చ్చేయాల‌ని వారు కోరుకున్నారు. వారు కోరుకున్న‌ట్టు జ‌రిగిందో.. ప్ర‌జ‌లు కోరుకున్నారో.. రాష్ట్రంలో వైసీపీ స‌ర్కారు అధికారం చేప‌ట్టింది.

మ‌రి ఇప్ప‌టికే రెండేళ్ల స‌మ‌యం దాటిపోతోంది. సీఎంగా జ‌గ‌న్ అధికారం చేప‌ట్టారు. అనేక మందికి ఎమ్మెల్సీల ద‌గ్గ‌ర నుంచి అన్ని ప‌దవులలోనూ ప్రాధాన్యం ఇచ్చారు. వివిధ కార్పొరేష‌న్ల‌ను ఇబ్బడి ముబ్బ‌డిగా నిధులు కూడా ఇచ్చారు. కానీ, బ్రాహ్మ‌ణ సామాజిక వ‌ర్గం విష‌యంలో మాత్రం ఆయ‌న దృష్టి సారించ‌డం లేద‌నే వ్యాఖ్య‌లు జోరుగా వినిపిస్తున్నాయి.

వాస్త‌వంగా చూసినా‌.. బ్రాహ్మ‌ణ కార్పొరేష‌న్‌కు చైర్మ‌న్ ప‌ద‌విని వేరేవారికి ఇచ్చే అవ‌కాశం ఉన్నా.. ఎమ్మెల్యేకు క‌ట్ట‌బెట్టారు. ఈ ప్లేస్‌లో ఇదే సామాజిక వ‌ర్గానికి చెందిన వారికి అవ‌కాశం ఇవ్వాల‌ని ప‌లువురు కోరుతున్నారు. ఇక‌, నామినేటెడ్ ప‌దవుల్లోనూ ఇలాంటి ప‌రిస్థితే ఉంది. మొత్తంగా చూస్తే.. జ‌గ‌న్ ప్ర‌భుత్వం రావాల‌ని కోరుకున్నా.. త‌మ‌కు ఏమీ జ‌ర‌గ‌లేద‌ని బ్రాహ్మ‌ణులు వాపోతున్నారు.




రైల్వేశాఖ షాకింగ్ నిర్ణ‌యం... రైల్వే స్టేష‌న్ల మూసివేత‌...

బ్రాహ్మ‌ణ ఘోష‌: బ‌్రాహ్మ‌ణులు వేసే ఈ ప్ర‌శ్న‌కు జ‌గ‌నోరి ద‌గ్గ‌ర ఆన్స‌ర్ ఉందా ?

జ‌గ‌న్ ప్లాన్ ఇంత రివ‌ర్సా.... ప‌ల్లెల్లో రేపు రిజ‌ల్ట్ ఇదే...?

ప్ర‌కాశం టీడీపీలో ఏం జ‌రుగుతోంది.... ఒకేసారి ఇన్ని షాక్‌లా ?

పదమూడో సారి యుద్దానికి సిద్దమయిన వెంకటేష్ - చిరంజీవి

జగడ్డ: విజయనగరం జిల్లాలో పోలీసులు ఇంత సీన్‌ చేస్తున్నారా..?

జగడ్డ: నెల్లూరులో అత్యల్పంగా నామినేషన్లు.. కారణం ఏంటి..?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - VUYYURU SUBHASH]]>