MoviesSeetha Sailajaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/tolllywoood836f1b73-7de1-4edb-b294-e81f05ec604a-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/tolllywoood836f1b73-7de1-4edb-b294-e81f05ec604a-415x250-IndiaHerald.jpgగత సంవత్సరం సినిమాల పండగ లేకపోవడంతో ఆలోటును సగటు ప్రేక్షకుడుకి తీరుద్దామని సినిమాల విడుదల ప్రకటనలతో టాలీవుడ్ హోరెత్తిపోతోంది. సంక్రాంతి రేసుకు వచ్చిన ‘క్రాక్’ మినహా మరి ఏసినిమా నిలబడలేదు. సంక్రాంతి తరువాత వచ్చిన ‘బంగారు బుల్లోడు’ ఫ్లాప్ అయితే నిన్న విడుదలైన ‘30 రోజులలో ప్రేమించడం ఎలా’ మూవీ కూడ ఫ్లాప్ టాక్ తెచ్చుకుంది అన్న వార్తలు వినిపిస్తున్నాయి. ఈ సినిమా పై ప్రక్షకుల తీర్పు ఎలా వచ్చినా ఏకంగా హీరోలు నిర్మాతలు మటుకు రాబోతున్న 9 నెలలలో విడుదల కాబోతున్న తమ సినిమాల దాడికి సంబంధించిన లీకులు ఇస్తూ tolllywoood;business;venkatesh;rana;nithin;allu arjun;kranthi;kranti;rajamouli;varun;varun sandesh;varun tej;makar sakranti;tollywood;rrr movie;cinema;sankranthi;love;industry;february;press;october;cheque;hero;khaidi.;june;kgf;kusuma jagadish;arjun 1;nithin reddy;march;nagashaurya;khaidi new;tuck jagdish;krack;tuck jagadish;narappa;love story;paruguసినిమాల రాకలో హీరోల పరుగులు కన్ఫ్యూజ్ అవుతున్న ప్రేక్షకులు !సినిమాల రాకలో హీరోల పరుగులు కన్ఫ్యూజ్ అవుతున్న ప్రేక్షకులు !tolllywoood;business;venkatesh;rana;nithin;allu arjun;kranthi;kranti;rajamouli;varun;varun sandesh;varun tej;makar sakranti;tollywood;rrr movie;cinema;sankranthi;love;industry;february;press;october;cheque;hero;khaidi.;june;kgf;kusuma jagadish;arjun 1;nithin reddy;march;nagashaurya;khaidi new;tuck jagdish;krack;tuck jagadish;narappa;love story;paruguSat, 30 Jan 2021 08:00:00 GMTటాలీవుడ్ హోరెత్తిపోతోంది. సంక్రాంతి రేసుకు వచ్చిన ‘క్రాక్’ మినహా మరి ఏసినిమా నిలబడలేదు. సంక్రాంతి తరువాత వచ్చిన ‘బంగారు బుల్లోడు’ ఫ్లాప్ అయితే నిన్న విడుదలైన ‘30 రోజులలో ప్రేమించడం ఎలా’ మూవీ కూడ ఫ్లాప్ టాక్ తెచ్చుకుంది అన్న వార్తలు వినిపిస్తున్నాయి.


సినిమా పై ప్రక్షకుల తీర్పు ఎలా వచ్చినా ఏకంగా హీరోలు నిర్మాతలు మటుకు రాబోతున్న 9 నెలలలో విడుదల కాబోతున్న తమ సినిమాల దాడికి సంబంధించిన లీకులు ఇస్తూ హడావిడి చేస్తున్నారు. వరస పెట్టి విడుదల కాబోతున్న ఈ సినిమాల లిస్టు చూస్తుంటే వరసపెట్టి దాడి చేయబోతున్న ఈ సినిమాల లిస్టులో ఎన్ని విజయవంతం అవుతాయి అన్న సందేహం కలగడం సహజం.


ఫిబ్రవరి నుండి నెలకు ఒక టాప్ హీరో సినిమా సందడి మధ్య ఫిబ్రవరిలో ‘ఉప్పెన’ ‘చెక్’ ‘ఏ1 ఎక్స్ ప్రెస్’ ‘జాంబీరెడ్డి’ ‘కపటధారి’ విడుదల కాబోతున్నాయి. ‘చెక్’ సినిమాలో నితిన్ ఉరిశిక్ష పడిన ఖైదీ పాత్రలో కనిపిస్తాడు అని తెలుస్తోంది. మార్చి నెలలో ‘శ్రీకారం’ ‘గాలిసంపత్’ ‘రంగ్ దే’ ‘అరణ్య’ ‘జాతిరత్నాలు’ ‘మోసగాళ్లు’ లాంటి సినిమాలు రాబోతున్నాయి. మార్చి నెలలో నితిన్ రానా ల మధ్య పోటీ ఉంటుంది. మండే ఎండలు ప్రారంభం అయ్యే ఏప్రియల్ నెలలో ‘సీటీమార్’ ‘వకీల్ సాబ్’ ‘లవ్ స్టోరీ’ ‘టక్ జగదీష్’ విరాటపర్వం’ సినిమాలు క్యూలో ఉన్నాయి. మే నెలకు సంబంధించి ‘ఆచార్య’ ‘రాధేశ్యామ్’ ‘సాయితేజ్’ ‘రిపబ్లిక్’ మూవీలు లిస్టులో ఉంటే జూన్ లో ‘నారప్ప’ ‘చావుకబురు చల్లగా’ ‘18-పేజెస్’ ‘ఖిలాడీ’ లాంటి సినిమాలు ఎదురు చూస్తున్నాయి.



జులైలో వరుణ్ తేజ్ ‘గని’ తో పాటు భారీ అంచనాలు ఉన్న ‘కేజీఎఫ్ చాప్టర్-2’ కూడా రిలీజ్ అయ్యే అవకాశం ఉంది. వీటితో పాటు నాగశౌర్య నటిస్తున్న ‘వరుడు కావలెను’  సినిమా కూడ ఈ రేస్ లో ఉంటుందని ప్రచారం జరుగుతోంది. ఇక షూటింగ్ కూడ అల్లు అర్జున్ ‘పుష్ప’ వెంకటేష్ వరుణ్ తేజ్ నటిస్తున్న ‘ఎఫ్ 3’ మూవీలతో పాటు ‘సర్కారు వారి పాట’ కూడ రేసులో ఉంటుందని అంటున్నారు. ఇక రాబోయే అక్టోబర్ నెల అత్యంత కీలకం. ‘ఆర్ ఆర్ ఆర్’ మూవీ పై 1000 కోట్ల బిజినెస్ చేయాలని రాజమౌళి కలలు కంటున్నాడు. ఇప్పుడు ఇన్ని సినిమాల రిలీజ్ డేట్స్ ఇంచుమించు ఖరార్ కావడంతో ఈ మూవీలలో ఎన్ని సినిమాలను జనం చూస్తారు ఎన్ని సినిమాలకు మంచి బిజినెస్ అవుతుంది అన్న విషయమై ఇండస్ట్రీ వర్గాలలో ఆశక్తికర చర్చలు జరుగుతున్నాయి..




చిన్న కారణానికే భార్య గొంతు కోసిన భర్త.. అసలేం జరిగిందంటే..?

పదమూడో సారి యుద్దానికి సిద్దమయిన వెంకటేష్ - చిరంజీవి

జగడ్డ: విజయనగరం జిల్లాలో పోలీసులు ఇంత సీన్‌ చేస్తున్నారా..?

జగడ్డ: నెల్లూరులో అత్యల్పంగా నామినేషన్లు.. కారణం ఏంటి..?

ఎడిటోరియల్: "కచరా" పోయి "కతరా" పాలనా!

ఇక పవర్ స్టార్ వంతు ... ఒకటి కాదు, ఏకంగా రెండు బుల్లెట్స్ రెడీ... ??

జగడ్డ: పవన్ కల్యాణ్ దెబ్బ అదుర్స్ కదూ..!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Seetha Sailaja]]>