Sportsyekalavyaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/sports/libra_libra/australia-head-coach-caught-an-aussies-player-from-reckoning-sandwich-in-pocket-to-field28d350a7-4e34-4067-a0e9-cea69dc956aa-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/sports/libra_libra/australia-head-coach-caught-an-aussies-player-from-reckoning-sandwich-in-pocket-to-field28d350a7-4e34-4067-a0e9-cea69dc956aa-415x250-IndiaHerald.jpgబోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో ఓటమి తరువాత ఆసీస్ హెడ్ కోచ్ జస్టిన్ లాంగర్‌పై తీవ్ర విమర్శలు మొదలయ్యాయి. లాంగర్ కోచింగ్ విధానాల వల్లే ఆసీస్ చరిత్రలో ఎన్నడూ లేని ఓటమిని మూటగట్టుకుందని అక్కడి పత్రికలు కోడై కూస్తున్నాయి. అయితే ఈ ఆరోపణలను లాంగర్ తనదైన శైలిలో తిప్పికొట్టాడు. తన కోచింగ్ విధానాలపై వస్తున్న ఆరోపణలను..sandwich;audi;icc t20శాండ్‌విచ్‌తో గ్రౌండ్‌లోకి.. ఆటగాడిని పట్టుకున్న ఆసీస్ కోచ్శాండ్‌విచ్‌తో గ్రౌండ్‌లోకి.. ఆటగాడిని పట్టుకున్న ఆసీస్ కోచ్sandwich;audi;icc t20Sat, 30 Jan 2021 18:27:00 GMTకాన్‌బెర్రా: బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో ఓటమి తరువాత ఆసీస్ హెడ్ కోచ్ జస్టిన్ లాంగర్‌పై తీవ్ర విమర్శలు మొదలయ్యాయి. లాంగర్ కోచింగ్ విధానాల వల్లే ఆసీస్ చరిత్రలో ఎన్నడూ లేని ఓటమిని మూటగట్టుకుందని అక్కడి పత్రికలు కోడై కూస్తున్నాయి. అయితే ఈ ఆరోపణలను లాంగర్ తనదైన శైలిలో తిప్పికొట్టాడు. తన కోచింగ్ విధానాలపై వస్తున్న ఆరోపణలను సైతం కొట్టిపారేశాడు. జట్టుతో తన సంబంధాలు కూడా బాగానే ఉన్నాయని, ఆటగాళ్లకు సరైన విధానంలోనే కోచింగ్ ఇస్తున్నానని చెప్పుకొచ్చాడు. భారత్‌తో సిరీస్ ఓటమి తరువాత నుంచి పరిస్థితులు కష్టంగా ఉన్నప్పటికీ జట్టుతో తన సంబంధాలు బాగానే ఉన్నాయని లాంగర్ వివరించాడు.

తన కోచింగ్ విధానం విషయంలో వస్తున్న ఆరోపణలపై లాంగర్ స్పందిస్తూ.. నాయకత్వం అంటే పాపులారిటీ కోసం పోటీపడడం కాదని, తాను ఎల్లప్పుడూ జట్టుకోసమే పనిచేస్తానని.. ఆటగాళ్లను నవ్విస్తూ, సరదాగా గడపడానికి తాను కోచ్‌గా లేనని అన్నాడు. ‘ఆటగాళ్లకు సరదాగా గడుపుతూ వారికి చక్కిలిగింతలు పెట్టే కోచ్ కావాలంటే.. అలాంటి కోచ్‌గా నేనుండలేను’ అంటూ లాంగర్ ఘాటు కామెంట్స్ చేశాడు. ఈ క్రమంలోనే ఓ పత్రికలో వచ్చిన శాండ్‌విచ్ వార్తపై కూడా లాంగర్ స్పందించాడు. ‘ఓ ఆటగాడు పిచ్‌పై తినడానికి తన జేబులో శాండ్‌విచ్‌ను తీసుకెళ్లేందుకు ప్రయత్నించాడు. అయితే దానిని నేను గమనించాను. అతడిని నిలువరించి దానిపై ప్రశ్నించాను. చాలాసేపు అర్థమయ్యేలా వివరించాను. అలా చేయడం కూడా తప్పేనా..?’ అని లాంగర్ ప్రశ్నించాడు.

ఇదిలా ఉంటే లాంగర్ ఆసీస్ జట్టుకు టీ20, టెస్ట్, వన్డే మూడు ఫార్మాట్లలోనూ కోచ్‌గా ఉన్నాడు. అంతేకాకుండా లాంగర్ జట్టు సెలక్షన్ ప్యానెల్‌లోని ముగ్గురు సభ్యుల్లో కూడా ఒకడిగా ఉన్నాడు. లాంగర్ కోచింగ్‌లోనే ఆసీస్ జట్టు ఇటీవల టీమిండియాతో బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ ఆడింది. అయితే అంతకుముందు వన్డేల్లో సత్తా చాటినా.. టీ20, టెస్టు సిరీస్‌లలో ఓటమి చవిచూసింది. ముఖ్యంగా ఆసీస్‌ ఓటమంటే ఎరుగని గాబా పిచ్‌పై కూడా భారత్‌ చేతిలో ఓడి చారిత్రక ఓటమిని చవిచూసింది.


ఇక థియేటర్లలో 100 శాతం.. కానీ..!

ఒకప్పటి బుల్లితెర న్యూస్ యాంకర్స్ ఇప్పుడు ఎలా ఉన్నారో తెలుసా..?

జగడ్డ : రాజ్యాంగ పదవిలో ఉన్న వారికి సభాహక్కుల ఉల్లంఘన నోటీసులు ఇవ్వచ్చా ?

చిరంజీవి, జూనియర్ ఎన్టీఆర్ లపై సంచలన వ్యాఖ్యలు చేసిన శ్రీరెడ్డి.. ఈసారి ఇలా టార్గెట్ చేసిందా..??

వైసీపీ వ‌ద్దే వ‌ద్దు... టీడీపీయే ముద్దు... జ‌గ‌నోరి దెబ్బేంటో తెలిసొచ్చిందా ?

ఏపీలో అక్క‌డ ఓట‌రు తీర్పు మారేనా... వైసీపీకి చుక్క‌లేనా ?

పుష్ప సినిమాలో అసలు సీక్రెట్ అదేనా.. గూస్ బంప్స్ పక్కా..!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - yekalavya]]>