Movieskurapati Dileep Kumareditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/categories/movies-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/categories/movies-IndiaHerald.jpgతమిళ దర్శకుడు వెంకట్ ప్రభు తెరకెక్కించిన లైవ్ టెలికాస్ట్ సిరీస్ తో ప్రేక్షకుల ముందుకొస్తుంది కాజల్. ఈ వెబ్ సిరీస్ ట్రైలర్ విడుదలైంది. ఇది చూసిన తర్వాత ఎక్కడో ఈ కథ చూసినట్లుందే అంటూ నెటిజన్స్ కామెంట్ పెడుతున్నారు. కాస్త సర్చ్ చేసి చూస్తే అసలు విషయం బయటికి వస్తుంది. లైవ్ టెలికాస్ట్ మూడేళ్ల కింద నయనతార నటించిన ఐరా కథను పోలి ఉంది. ఈ సిరీస్‌లో కొందరు టీవీ ఛానెల్ వాళ్లు ఓ ఇంట్లోకి వెళ్లి లేని దెయ్యాన్ని ఉందని చెప్పి నమ్మించి టీఆర్పీ రేటింగ్ కోసం చూస్తుంటారు. అలాగే అక్కడ ఐరాలో కూడా లేని దెయ్యాన్ని ఉందkajal agarwal;kajal aggarwal;nayantara;venkat;india;cinema;netizens;television;tamil;februaryనయనతార మూవీ ని కాపీ కొట్టిన కాజల్ అగర్వాల్ ....!!!నయనతార మూవీ ని కాపీ కొట్టిన కాజల్ అగర్వాల్ ....!!!kajal agarwal;kajal aggarwal;nayantara;venkat;india;cinema;netizens;television;tamil;februarySat, 30 Jan 2021 23:08:35 GMT
నయనతార మూవీ ని కాపీ కొట్టిన కాజల్ అగర్వాల్ ....!!!

ఇండియా హెరాల్డ్ అందిస్తున్న ఈ ఆర్టికల్ చదవండి..

ఇండస్ట్రీలో కాపీ కొట్టడం అనేది కామన్. కొందరేమో దాన్ని స్పూర్థి పొందాం అని చెప్తుంటారు. మరికొందరు మాత్రం సేమ్ ఆలోచన మాకు కూడా వచ్చిందని చెప్తుంటారు. కానీ ముందు ఆలోచన ఎవడికి వచ్చి సినిమా తీస్తాడో వాడే గొప్ప. వాడే ఒరిజినల్ కూడా. ఇప్పుడు కూడా నయనతార, కాజల్ విషయంలో ఇదే జరుగుతుంది. మూడేళ్ళ కింద వచ్చిన ఓ సినిమాకు సంబంధించిన కథ ఇప్పుడు వెబ్ సిరీస్‌లా వస్తుంది. అసలు విషయం ఏంటంటే కాజల్ అగర్వాల్ తొలిసారి డిజిటల్ మీడియాలోకి అడుగు పెట్టింది.

తమిళ దర్శకుడు వెంకట్ ప్రభు తెరకెక్కించిన లైవ్ టెలికాస్ట్ సిరీస్ తో ప్రేక్షకుల ముందుకొస్తుంది కాజల్. ఈ వెబ్ సిరీస్ ట్రైలర్ విడుదలైంది. ఇది చూసిన తర్వాత ఎక్కడో ఈ కథ చూసినట్లుందే అంటూ నెటిజన్స్ కామెంట్ పెడుతున్నారు.

కాస్త సర్చ్ చేసి చూస్తే అసలు విషయం బయటికి వస్తుంది. లైవ్ టెలికాస్ట్ మూడేళ్ల కింద నయనతార నటించిన ఐరా కథను పోలి ఉంది. ఈ సిరీస్‌లో కొందరు టీవీ ఛానెల్ వాళ్లు ఓ ఇంట్లోకి వెళ్లి లేని దెయ్యాన్ని ఉందని చెప్పి నమ్మించి టీఆర్పీ రేటింగ్ కోసం చూస్తుంటారు. అలాగే అక్కడ ఐరాలో కూడా లేని దెయ్యాన్ని ఉందని షూట్ చేసి పాపులర్ కావాలని చూస్తుంది నయనతార.

ఆ తర్వాత అసలు దెయ్యం వస్తుంది. అప్పుడు అక్కడ్నుంచి ఎలా తప్పించుకున్నారు అనేది ఐరా కథ. ఇప్పుడు లైవ్ టెలికాస్ట్ కథ కూడా ఇదే అని ట్రైలర్ చూస్తుంటేనే క్లారిటీ వచ్చేసింది. ఫిబ్రవరి 12న హాట్ స్టార్ డిస్నీలో లైవ్ టెలికాస్ట్ స్ట్రీమ్ కానుంది. 9 ఎపిసోడ్స్ కింద ఈ వెబ్ సిరీస్ తెరకెక్కించాడు దర్శకుడు వెంకట్ ప్రభు. కచ్చితంగా ఈ వెబ్ సిరీస్ తనకు మంచి పేరు తీసుకొస్తుందని నమ్ముతుంది కాజల్. కానీ కాపీ కథతో వస్తుందంటూ అప్పుడే కాజల్‌పై సోషల్ మీడియాలో సెటైర్లు మొదలైపోయాయి.

ఇలాంటి మరెన్నో ఆసక్తికరమైన విషయాలు కోసం ఇండియా హెరాల్డ్ గ్రూప్ ని ఫాలో అవ్వండి. ఇంకా మరెన్నో విషయాలు తెలుసుకోండి. 



3 నిమిషాల పాటకే అనసూయ అంత తీసుకుంటుందా.!

"ఎఫ్ 3" కి డిమాండ్ మాములుగా లేదుగా అంచనాలని అందుకోకపోతే అంతే సంగతులు....

జగడ్డ: టీడీపీకి షాకిచ్చిన నిమ్మగడ్డ!

జగడ్డ: మార్చి తర్వాత కూడా నిమ్మగడ్డేనా!

జగడ్డ : నిమ్మగడ్డ ఎటాక్..ఏపీ మంత్రుల కౌంటర్ ఎటాక్ !!

శ్రీదేవి, రాజబాబు జంటగా నటించిన సినిమా ఇదే..!?

మళ్ళీ మొదటికొచ్చిన మహేష్...ఫ్యాన్స్ కి షాక్...?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - kurapati Dileep Kumar]]>