PoliticsVUYYURU SUBHASHeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_analysis/kapu-rallyf6e461ff-ffc2-4c6b-b9d8-6cb3a4eae212-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_analysis/kapu-rallyf6e461ff-ffc2-4c6b-b9d8-6cb3a4eae212-415x250-IndiaHerald.jpg కాపుల్లో క్ర‌మ‌క్ర‌మంగా ఐక్య‌త పెరుగుతోంది. ముద్ర‌గ‌డ ప‌ద్మ‌నాభం కాపు ఉద్య‌మం ఎప్పుడు అయితే రాజేశారో వీరు ఒక్కొక్క‌రు పార్టీల‌కు అతీతంగా ఒక్క‌టి అవుతున్నారు. ఇక కోన‌సీమ‌లోనూ కాపుల ప్ర‌భావం చాలా ఎక్కువ‌. అందుకే రాజోలు నియోజ‌క‌వ‌ర్గంలో రాపాక వ‌ర‌ప్ర‌సాద్ గెలిచారు. అయితే ఆయ‌న ఎమ్మెల్యేగా గెలిచిన కొద్ది రోజుల‌కే కోన‌సీమ రాజ‌కీయాలు... ముఖ్యంగా రాజోలు రాజ‌కీయాల‌ను శాసించే ఓ సామాజిక వర్గం లాబీయింగ‌కు లొంగిపోయి వైసీపీ సానుభూతిప‌రుడు అవ్వ‌డంతో పాటు ప‌వ‌న్ క‌ళ్యాణ్‌పై తీవ్ర విమ‌ర్శ‌లు చేస్తున్నారు. kapu;chiranjeevi;rani;rapaka vara prasada rao;andhra pradesh;mla;letter;tdp;local language;ycp;party;gajuwakaకాపు వేద‌న‌: ఆ ఏపీ ఎమ్మెల్యే దెబ్బ‌కు కాపులు అంద‌రూ ఒక్క‌ట‌య్యారే ?కాపు వేద‌న‌: ఆ ఏపీ ఎమ్మెల్యే దెబ్బ‌కు కాపులు అంద‌రూ ఒక్క‌ట‌య్యారే ?kapu;chiranjeevi;rani;rapaka vara prasada rao;andhra pradesh;mla;letter;tdp;local language;ycp;party;gajuwakaSat, 30 Jan 2021 10:10:00 GMTచిరంజీవి ప్ర‌జారాజ్యం పార్టీ స్థాపించి కాపులు బ‌లంగా ఉన్న గోదావ‌రి జిల్లాల్లో నియోజ‌క‌వ‌ర్గం అయిన పాల‌కొల్లు నుంచి పోటీ చేస్తే ఓడించారు. ఇక గ‌త ఎన్నిక‌ల్లో ప‌వ‌న్ త‌మ్ముడు జ‌న‌సేన పార్టీ పెట్టి తాను సైతం అదే పాల‌కొల్లు ప‌క్క‌నే ఉన్న భీమ‌వ‌రం నుంచి పోటీ చేసినా మ‌ళ్లీ అక్క‌డ కూడా ఓడిపోయారు. ప‌వ‌న్ అన్న నాగ‌బాబు న‌ర‌సాపురం నుంచి ఎంపీగా పోటీ చేసి ఏకంగా మూడో స్థానంతో స‌రిపెట్టుకున్నారు. ప‌వ‌న్ కాపులు ఎక్కువుగా ఉన్న ఉత్త‌రాంధ్ర‌లో విశాఖ‌ను ఆనుకుని ఉన్న గాజువాక నియోజ‌క‌వ‌ర్గం నుంచి పోటీ చేసి అక్క‌డ మూడో స్థానంలో నిలిచారు.

ఇలా రాజ‌కీయంగా తాము రాజ్యాధికారంలో నిల‌బ‌డాల‌ని ఆశించే కాపులు త‌మ పార్టీ నేత‌లు పోటీ చేసినా ఏక‌తాటిమీద‌కు వ‌చ్చి త‌మ నేత‌ల‌ను గెలిపించుకోలేక‌పోతున్నారు. గ‌త టీడీపీ ప్ర‌భుత్వం అధికారంలో ఉన్న‌ప్ప‌టి నుంచి కాపుల్లో క్ర‌మ‌క్ర‌మంగా ఐక్య‌త పెరుగుతోంది. ముద్ర‌గ‌డ ప‌ద్మ‌నాభం కాపు ఉద్య‌మం ఎప్పుడు అయితే రాజేశారో వీరు ఒక్కొక్క‌రు పార్టీల‌కు అతీతంగా ఒక్క‌టి అవుతున్నారు. ఇక కోన‌సీమ‌లోనూ కాపుల ప్ర‌భావం చాలా ఎక్కువ‌. అందుకే రాజోలు నియోజ‌క‌వ‌ర్గంలో రాపాక వ‌ర‌ప్ర‌సాద్ గెలిచారు. అయితే ఆయ‌న ఎమ్మెల్యేగా గెలిచిన కొద్ది రోజుల‌కే కోన‌సీమ రాజ‌కీయాలు... ముఖ్యంగా రాజోలు రాజ‌కీయాల‌ను శాసించే ఓ సామాజిక వర్గం లాబీయింగ‌కు లొంగిపోయి వైసీపీ సానుభూతిప‌రుడు అవ్వ‌డంతో పాటు ప‌వ‌న్ క‌ళ్యాణ్‌పై తీవ్ర విమ‌ర్శ‌లు చేస్తున్నారు.

దీంతో రాపాక గెలుపుకోసం ఎంతో క‌ష్ట‌ప‌డ్డ రాజోలు, కోన‌సీమ కాపులు అంద‌రూ ఇప్పుడు రాపాక‌ను విమ‌ర్శించ‌డ‌మే కాదు.. రాజాకీయంగా మ‌నం ఉన్న‌త స్థానంలో లేక‌పోవ‌డం వ‌ల్లే క‌దా ?  మ‌నకు ఈ దుస్థితి అన్న ఆలోచ‌న‌లు చేస్తున్నారు. కాపు పార్టీ నేత‌లు రాజ‌కీయాల్లో మ‌రింత రాణించ‌డంతో పాటు వారు రాజ్యాధికారం దిశ‌గా ఎదిగిన‌ప్పుడే మ‌నం వేసిన ఓట్ల‌కు విలువ అంటుంద‌ని.. బ్ర‌ష్టు ప‌ట్టిపోయిన ఈ రాజ‌కీయాల‌ను స‌మ‌ర్థ‌వంతంగా ఎదుర్కొని రాణించాలంటే మ‌నం మ‌రింత క‌సితో ఐక్యంగా ఉండాల‌ని గోదావ‌రి జిల్లాల కాపుల‌కు తెలిసి వ‌స్తోంది.

స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల్లోనే కాకుండా.. భ‌విష్య‌త్ రాజ‌కీయాల్లోనూ గోదావ‌రి కాపుల్లో మెజార్టీ జ‌నాలు మాత్రం గ‌తం కంటే ఎక్కువ యూనిటీగా ఉండే ప్ర‌ణాళిక‌లే ర‌చిస్తున్నారు. మొత్తానికి ఈ కాపులు గెలిపించిన రాపాక చేసిన ప‌ని కాపుల్లో మ‌రింత ఐక్య‌త పెంచింద‌న్న‌ది మాత్రం వాస్త‌వం.




జగడ్డ: నిమ్మగడ్డ శీలానికి ఇదే అసలైన పరీక్ష..?

చిరంజీవి రాజకీయ భవిష్యత్ పై అచ్యుతశాస్త్రి భవిష్య వాణి !

క‌రోనాతో శృంగారానికి ఇంత లింక్ ఉందా... ఈ భ‌యంక‌ర నిజాలు న‌మ్మాల్సిందే ?

జ‌గ‌నోరికే కొర‌క‌రానోడుగా మారిన ఒకే ఒక్క ఎమ్మెల్యే...!

బ్రాహ్మ‌ణ ఘోష‌: జ‌గ‌న్ వ‌స్తే క‌ష్టాలు తీర‌తాయ‌నుకుంటే రెట్టింప‌య్యాయే ?‌

జగడ్డ: కొత్త ఎన్నికల కార్యదర్శిగా ఐఏఎస్ కన్నబాబు ...?

బ్రాహ్మ‌ణ ఘోష‌: బ‌్రాహ్మ‌ణులు వేసే ఈ ప్ర‌శ్న‌కు జ‌గ‌నోరి ద‌గ్గ‌ర ఆన్స‌ర్ ఉందా ?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - VUYYURU SUBHASH]]>