MoviesChagantieditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/rajashker-movies2f4a602a-eb7c-4275-8ce5-b9b5dafbfcd7-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/rajashker-movies2f4a602a-eb7c-4275-8ce5-b9b5dafbfcd7-415x250-IndiaHerald.jpgసీనియర్ హీరో రాజశేఖర్ ఆ మధ్య కాలంలో కరోనా బారిన పడి చావు అంచులు వరకు వెళ్లి వచ్చిన సంగతి తెలిసిందే. తీవ్ర అస్వస్థతకు గురైన ఆయన అభిమానులు, కుటుంబ సభ్యుల ప్రార్థనలతో మళ్లీ మామూలు మనిషి అయి తిరిగి వచ్చారు. అయితే ఈయన నీలకంఠ అనే దర్శకుడితో ఒక సినిమా చేస్తున్నాడని చాలా రోజుల క్రితం ప్రచారం జరిగింది. మలయాళంలో సూపర్ హిట్ అయిన జోసెఫ్ అనే సినిమాని తెలుగులోకి అనువదిస్తున్నారు అనే ప్రచారం జోరుగా సాగింది. తాజాగా అందుతున్న సమాచారం మేరకు ఈ సినిమా నుంచి దర్శకుడు నీలకంఠ తప్పు కొన్నారట. రాజశేఖర్ తో ఆయనకు వచ్చినjagan elections nimmagadda;dr rajasekhar;jeevitha rajaseskhar;neelakanta;cinema;telugu;producer;remake;director;wife;producer1;hero;traffic police;vరాజశేఖర్ తో విభేదాలు తప్పుకున్న సీనియర్ డైరెక్టర్ !రాజశేఖర్ తో విభేదాలు తప్పుకున్న సీనియర్ డైరెక్టర్ !jagan elections nimmagadda;dr rajasekhar;jeevitha rajaseskhar;neelakanta;cinema;telugu;producer;remake;director;wife;producer1;hero;traffic police;vFri, 29 Jan 2021 12:00:00 GMTసీనియర్ హీరో రాజశేఖర్ ఆ మధ్య కాలంలో కరోనా బారిన పడి చావు అంచులు వరకు వెళ్లి వచ్చిన సంగతి తెలిసిందే. తీవ్ర అస్వస్థతకు గురైన ఆయన అభిమానులు, కుటుంబ సభ్యుల ప్రార్థనలతో మళ్లీ మామూలు మనిషి అయి తిరిగి వచ్చారు. అయితే ఈయన నీలకంఠ అనే దర్శకుడితో ఒక సినిమా చేస్తున్నాడని చాలా రోజుల క్రితం ప్రచారం జరిగింది. మలయాళంలో సూపర్ హిట్ అయిన జోసెఫ్ అనే సినిమాని తెలుగులోకి అనువదిస్తున్నారు అనే ప్రచారం జోరుగా సాగింది. తాజాగా అందుతున్న సమాచారం మేరకు ఈ సినిమా నుంచి దర్శకుడు నీలకంఠ తప్పు కొన్నారట. 

రాజశేఖర్ తో ఆయనకు వచ్చిన కొన్ని క్రియేటివ్ డిఫరెన్సెస్ కారణంగా ఆయన ఈ ప్రాజెక్టు నుంచి తప్పుకున్నారని ప్రచారం జోరుగా సాగుతోంది. ఇక ఈ సినిమా హక్కులు కొన్న నిర్మాత ఎం ఎల్ వి సత్యనారాయణ ఈ సినిమాని తెరకెక్కించే సరైన దర్శకుడి కోసం వెతుకుతున్నారు అని అంటున్నారు. నిజానికి ఇప్పటికే నీలకంఠ కథ మొత్తం రెడీ చేశారట. కానీ ఏమైందో ఏమో రాజశేఖర్ తో వచ్చిన కొన్ని చిన్న చిన్న అపార్ధాలతో ఆయన ఈ సినిమా చేయలేను అని చెప్పేసి పక్కకి తప్పుకున్నాడు అని అంటున్నారు.

మలయాళంలో జోసెఫ్ పేరుతో రిలీజ్ అయిన ఈ సినిమా మాతృక అక్కడ సూపర్ హిట్ అయింది. భార్య అనుమానాస్పద మృతి కారణంగా సస్పెండ్ అయిన ఒక పోలీస్ అధికారి జీవిత కథ నేపథ్యంలో ఈ సినిమా సాగుతుంది. దీనికి తెలుగులో రాజశేఖర్ అయితేనే సరిపోతాడు అని భావించి ఆయన కోసం నిర్మాతరీమేక్ హక్కులు కొన్నారు. ఇప్పుడు దర్శకుడితో విభేదాలు రావడంతో ఆయన తప్పుకున్నాడు. మరి రాజశేఖర్ తో ఈ సినిమాని ఏ దర్శకుడు చేస్తాడో వేచి చూడాలి మరి.


పంచాయతీ ఎన్నికలపై విద్యార్థిని మరో పిటిషన్.. హైకోర్టు కీలక వ్యాఖ్యలు

జ‌గ‌నోరు అక్క‌డ మీ పార్టీ ఎమ్మెల్యే ఎవ‌రో మీకైనా తెలుసా...?

'ఆర్ఆర్ఆర్' నుండి 'ఒలీవియా మోరిస్' ఫస్ట్ లుక్ రిలీజ్ - అబ్బబ్బబ్బా అదుర్స్ అంతే ....!!

జ‌గ‌నోరు ఊహించ‌లేదు.. బాబోరు ఇలా చేస్తార‌ని..!!

జగడ్డ: మొబైల్ యాప్ తో భయపెడుతున్న నిమ్మగడ్డ..

జగడ్డ : సీమ మీద నిమ్మగడ్డ స్పెషల్ ఫోకస్.. నేడు రేపు అక్కడే..అదే అసలు రీజన్ !

భారీ అప్ డేట్ : ప్రభాస్ - నాగ అశ్విన్ మూవీ లో మ్యూజిక్ డైరెక్టర్ గా ఆయన ఫిక్స్ ...!!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chaganti]]>