PoliticsVUYYURU SUBHASHeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/politics/politics_analysis/jagan-ysrcpb6a0b1d3-57b3-4c30-91d5-4df88a60ab8a-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/politics/politics_analysis/jagan-ysrcpb6a0b1d3-57b3-4c30-91d5-4df88a60ab8a-415x250-IndiaHerald.jpgజ‌గ‌న్ సానుభూతి ప‌రులు అయినా కూడా క‌నీసం నియోజ‌క‌వ‌ర్గంలోనూ వారికి పార్టీలో గౌర‌వం లేదు. మంత్రి కొడాలి నానిని చంద్రబాబు, లోకేష్‌ను తిట్టేందుకే వాడుకుంటున్నారు. ఇక మాజీ మంత్రి దేవినేని ఉమాను ఓడించిన వ‌సంత కృష్ణ‌ప్ర‌సాద్‌కు అస‌లు గుర్తింపే లేకుండా పోయింది. ఇక గుంటూరు జిల్లాలో ముగ్గురు క‌మ్మ ఎమ్మెల్యేలు ఉన్నా వారిలో అన్నాబ‌త్తుని శివ‌కుమార్‌, బొల్లా బ్ర‌హ్మ‌నాయుడు ఓపెన్ గానే త‌మ అసంతృప్తి వ్య‌క్తం చేస్తున్నారు. ఇక పెద‌కూర‌పాడు ఎమ్మెల్యే నంబూరు శంక‌ర్రావు మాత్రం పెద్ద‌గా వివాదాల జోలికి పోరు. jagan ysrcp;krishna;vamsi;krishna river;andhra pradesh;devineni avinash;cabinet;mla;minister;letter;partyజ‌గ‌నోరిపై వైసీపీలో క‌మ్మోళ్ల కోపం మామూలుగా లేదే...!జ‌గ‌నోరిపై వైసీపీలో క‌మ్మోళ్ల కోపం మామూలుగా లేదే...!jagan ysrcp;krishna;vamsi;krishna river;andhra pradesh;devineni avinash;cabinet;mla;minister;letter;partyFri, 29 Jan 2021 10:40:00 GMTఏపీ సీఎం జ‌గ‌న్ గ‌త ఎన్నిక‌ల‌కు ముందు నుంచే క‌మ్మ సామాజిక వ‌ర్గాన్ని బాగా టార్గెట్ చేస్తూ వ‌చ్చారు. జ‌గ‌న్ ఈ వ‌ర్గాన్ని మిగిలిన వ‌ర్గాల‌కు దూరం చేసే విష‌యంలో చాలా వ‌ర‌కు స‌క్సెస్ అయ్యారు. అందుకే క‌మ్మ‌ల‌కు ప‌ట్టున్న కృష్ణా, గుంటూరు జిల్లాల్లో కూడా వైసీపీకి మెజార్టీ సీట్లు వ‌చ్చాయి. ఇక ఎన్నిక‌ల‌య్యాక కూడా జ‌గ‌న్ ప‌దే ప‌దే క‌మ్మ వ‌ర్గాన్ని పేరు పెట్టి విమ‌ర్శ‌లు చేస్తూ వ‌చ్చారు. ఇంత వ‌రకు బాగానే ఉన్నా చివ‌ర‌కు సొంత పార్టీలో ఉన్న క‌మ్మ‌ల‌కు కూడా జ‌గ‌న్ పెద్ద‌గా ప్ర‌యార్టీ ఇవ్వ‌డం లేద‌న్న‌దే ఇప్పుడు ప్ర‌ధానంగా జ‌రుగుతోన్న చ‌ర్చ‌.

క‌మ్మ వ‌ర్గం నుంచి జ‌గ‌న్ కొడాలి నానికి మాత్ర‌మే మంత్రి ప‌ద‌వి ఇచ్చారు. రెడ్ల‌కు నాలుగు.. కాపుల‌కు నాలుగు, ఎస్సీల‌కు ఐదు.. బీసీల‌కు ఎక్కువ మంత‌రి ప‌ద‌వులు ఇచ్చినా క‌మ్మ‌ల‌కు ఒక్క కేబినెట్ బెర్త్‌తో స‌రిపెట్టేశారు. గుంటూరు జిల్లాలో పార్టీ కోసం ఎన్నో త్యాగాలు చేసిన క‌మ్మ నేత‌, మాజీ ఎమ్మెల్యే మ‌ర్రి రాజ‌శేఖ‌ర్‌కు మంత్రి ప‌ద‌వి ఇస్తాన‌ని చెప్పిన జ‌గ‌న్ ఇప్ప‌టి వ‌ర‌కు క‌నీసం ఎమ్మెల్యే ప‌ద‌వి కూడా ఇవ్వ‌లేదు. దీంతో ఈ రెండు జిల్లాల క‌మ్మ‌ల్లో తీవ్ర సంతృప్తి ఉంది.

ఇక వంశీ లాంటి క‌మ్మ ఎమ్మెల్యేలు జ‌గ‌న్ సానుభూతి ప‌రులు అయినా కూడా క‌నీసం నియోజ‌క‌వ‌ర్గంలోనూ వారికి పార్టీలో గౌర‌వం లేదు. మంత్రి కొడాలి నానిని చంద్రబాబు, లోకేష్‌ను తిట్టేందుకే వాడుకుంటున్నారు. ఇక మాజీ మంత్రి దేవినేని ఉమాను ఓడించిన వ‌సంత కృష్ణ‌ప్ర‌సాద్‌కు అస‌లు గుర్తింపే లేకుండా పోయింది. ఇక గుంటూరు జిల్లాలో ముగ్గురు క‌మ్మ ఎమ్మెల్యేలు ఉన్నా వారిలో అన్నాబ‌త్తుని శివ‌కుమార్‌, బొల్లా బ్ర‌హ్మ‌నాయుడు ఓపెన్ గానే త‌మ అసంతృప్తి వ్య‌క్తం చేస్తున్నారు.

ఇక పెద‌కూర‌పాడు ఎమ్మెల్యే నంబూరు శంక‌ర్రావు మాత్రం పెద్ద‌గా వివాదాల జోలికి పోరు. త‌న మ‌న‌స్సులో మాట బ‌య‌ట‌ను పెట్ట‌రు. అటు ప్ర‌కాశం జిల్లాలో పార్టీ ఇన్‌చార్జ్‌లుగా ఉన్న రావి రామ‌నాథం బాబు, బాచిన కృష్ణ చైత‌న్య‌ను కూడా త‌ప్పిస్తార‌న్న వార్త‌ల‌తో వారు కూడా పైకి చెప్పుకోక‌పోయినా లోలోన అసంతృప్తితోనే ఉన్నారు. ఏదేమైనా సొంత పార్టీలో క‌మ్మోళ్లు కూడా జ‌గ‌న్‌పై గ‌రం గ‌రంగానే ఉన్నార‌న్న టాకే ఎక్కువుగా వినిపిస్తోంది.




జగడ్డ : మూడో కన్ను తెరచిన నిమ్మగడ్డ...మూడేది ఎవరికో...?

జగడ్డ: నిమ్మగడ్డతో మళ్లీ కయ్యానికి జగనోరు సిద్ధం..?

ప‌శ్చిమ ప‌ల్లె పోరులో జ‌గ‌నోరికి పిడి దిగిపోద్దా.... పంచాయ‌తీలు పాయే...!

జ‌గ‌డ్డ‌: జ‌గ‌నోరిపై కుత‌కుత‌లాడుతోన్న రాజ‌ధాని రెడ్లు...!

జగడ్డ : పేదల ఆశలతో ఆటలా..జగనోరు ??

జగడ్డ: నెల్లూరు జిల్లాలో అధికార పార్టీకి అభ్యర్థులు కరువు

జగడ్డ: జగనోరు ఇప్పటికైనా బుద్ది మార్చుకోండి.. ఎంపీ సెటైర్..




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - VUYYURU SUBHASH]]>