MoviesSS Marvelseditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/acharya3f7d49ee-f7ee-4ebb-b88f-ef7a761b9d3e-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/acharya3f7d49ee-f7ee-4ebb-b88f-ef7a761b9d3e-415x250-IndiaHerald.jpgటాలీవుడ్ ఇండస్ట్రీలో హీరోయిజాన్ని కొత్త పుంతలు తొక్కించిన మెగాస్టార్ చిరంజీవి, అలాగే సమాజానికి ఉపయోగపడే సందేశాన్ని కమర్షియల్ ఎలిమెంట్స్ జోడిస్తూ బ్లాక్ బస్టర్ హిట్స్ అందుకున్న స్టార్ డైరెక్టర్ కొరటాల శివ కాంబినేషన్‌లో వస్తోన్న భారీ చిత్రం "ఆచార్య"పై అన్ని వర్గాల్లో విపరీతమైన క్రేజ్ నెలకొన్న సంగతి తెలిసిందే. అయితే ఈ ‘ఆచార్య’ సినిమాను వేసవి కానుకగా మే 13న విడుదల చేస్తున్నట్టు చిత్ర నిర్మాతలు తెలిపారు.acharya;chiranjeevi;ram charan teja;shiva;koratala siva;nageshwara rao akkineni;ram pothineni;rohini;tollywood;cinema;telugu;jaan;blockbuster hit;director;lord siva;hero;khaidi.;nakshatram;ramzan;gang leader;lie;john;reddy;leader;khaidi newమెగాస్టార్ కు అన్ని విధాలుగా కలిసొచ్చిన తేదీనే 'ఆచార్య' రిలీజ్ డేట్ ఫిక్స్...మెగాస్టార్ కు అన్ని విధాలుగా కలిసొచ్చిన తేదీనే 'ఆచార్య' రిలీజ్ డేట్ ఫిక్స్...acharya;chiranjeevi;ram charan teja;shiva;koratala siva;nageshwara rao akkineni;ram pothineni;rohini;tollywood;cinema;telugu;jaan;blockbuster hit;director;lord siva;hero;khaidi.;nakshatram;ramzan;gang leader;lie;john;reddy;leader;khaidi newFri, 29 Jan 2021 23:35:00 GMTటాలీవుడ్ ఇండస్ట్రీలో హీరోయిజాన్ని కొత్త పుంతలు తొక్కించిన మెగాస్టార్ చిరంజీవి, అలాగే సమాజానికి ఉపయోగపడే సందేశాన్ని కమర్షియల్ ఎలిమెంట్స్ జోడిస్తూ బ్లాక్ బస్టర్ హిట్స్ అందుకున్న స్టార్ డైరెక్టర్ కొరటాల శివ కాంబినేషన్‌లో వస్తోన్న భారీ చిత్రం "ఆచార్య"పై అన్ని వర్గాల్లో విపరీతమైన క్రేజ్ నెలకొన్న సంగతి తెలిసిందే. అయితే ఈ ‘ఆచార్య’ సినిమాను వేసవి కానుకగా మే 13న విడుదల చేస్తున్నట్టు చిత్ర నిర్మాతలు నిరంజన్ రెడ్డి, రామ్ చరణ్ తాజాగా ప్రకటించిన విషయం తెలిసిందే. శుక్రవారం ‘ఆచార్య’ టీజర్‌ను విడుదల చేసిన గంటన్నర వ్యవధిలోనే చిత్రం విడుదల తేదీని కూడా ప్రకటించి అభిమానులకు సర్‌ప్రైజ్ ఇచ్చారు. అయితే ఇప్పుడు ప్రకటించిన ఈ విడుదల తేదీపై ఇప్పుడు ఆసక్తికర చర్చ జరుగుతోంది. ఇక ఆ తేదీ గురించి తెలుసుకున్నట్లయితే... మే నెల గతంలో మెగాస్టార్ చిరంజీవికి బాగా కలిసివచ్చిన నెలగా చెబుతున్నారు. ఎందుకంటే... చిరంజీవి తన సినిమా కెరీర్‌లో ఎవర్‌గ్రీన్ హిట్స్‌గా చెప్పుకునే ‘జగదేకవీరుడు అతిలోకసుందరి’ మరియు ‘గ్యాంగ్ లీడర్’ సినిమాలు మే నెలలోనే విడుదలయ్యాయి.




ఇక అలాగే ఈ మే నెలలో అన్నీ సూపర్ హిట్లే కాకుండా.. కొన్ని ఫ్లాపులు కూడా ఉన్నాయి. ‘ఖైదీ’ సినిమాతో స్టార్ హీరో హోదాను సంపాదించిన చిరంజీవి.. ఆ తరవాత చాలా తక్కువ సినిమాలను మే నెలలో ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చారు. వాటిలో చిరంజీవి 86వ చిత్రం ‘వేట’ 1986 మే 28న విడుదలైంది. కానీ, ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ అయ్యింది. ఆ తరవాత మళ్లీ 1990 మే 9న ‘జగదేకవీరుడు అతిలోకసుందరి’ విడుదలైంది. బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది. ‘వేట’, ‘జగదేకవీరుడు అతిలోకసుందరి’కి మధ్య 22 సినిమాలు వచ్చాయి. కానీ, ఏ సినిమా కూడా మే నెలలో విడుదల కాలేదు. ఇక ‘జగదేకవీరుడు అతిలోకసుందరి’ విడుదలైన తరవాత సంవత్సరమే అంటే 1991 మే 9న ‘గ్యాంగ్ లీడర్’ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా ఎంత పెద్ద విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇదో ట్రెండ్ సెట్టర్. ఇండస్ట్రీలో సరికొత్త రికార్డులను సృష్టించింది. ‘గ్యాంగ్ లీడర్’ తరవాత మళ్లీ మే నెలలో విడుదలైన సినిమా ‘మెకానిక్ అల్లుడు’. బి.గోపాల్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా 1993 మే 27న విడుదలైంది. చిరంజీవి, అక్కినేని నాగేశ్వరరావు కలిసి నటించిన ఈ సినిమా ఆశించిన స్థాయిలో ఆడలేదు. బాక్సాఫీస్ వద్ద మరొక డిజాస్టర్ గా మిగిలింది. ఇక ఈ సినిమా తరవాత చిరంజీవి సినిమా ఏదీ కూడా మే నెలలో రాలేదు. అలాంటిది ఇప్పుడు సుమారు 28 ఏళ్ల తర్వాత మళ్లీ ‘ఆచార్య’ రూపంలో చిరంజీవి సినిమా మే నెలలో వస్తోంది. మే 13 గురువారం వచ్చింది. ‘గ్యాంగ్ లీడర్’ కూడా గురువారం నాడే విడులైందట. అంతేకాదు, మే 13న రోహిణి నక్షత్రమని..‌ అది శుభ ఫలితాలనిచ్చే చాలా మంచి నక్షత్రంగా చెబుతున్నారు. ఇక ఇవన్నీ ‘ఆచార్య’కు బాగా కలిసొస్తాయని చర్చ నడుస్తుంది. అలాగే ఇక వీటికి తోడు మే 13న రంజాన్ కూడా వచ్చే అవకాశం ఉందంటున్నారు. మరి ఇన్ని ప్రత్యేకతలు ఉండబట్టే మెగాస్టార్ చిరంజీవి ‘ఆచార్య’ సినిమాకు మే నెలలో ముహూర్తం పెట్టారు.




చిరంజీవి పై విష ప్రయోగం చేసింది ఎవరు..? నిజంగానే జరిగిందా..?

ఆ సినిమా ప్లాప్ అవుతుందని ఎంత చెప్పిన చిరంజీవి వినకుండా తప్పు చేశాడా..?

బ్రేకింగ్ : 'కెజిఎఫ్ చాప్టర్ - 2' రిలీజ్ డేట్ ఫిక్స్ .... ఆరోజున పండుగకు సిద్ధం అవ్వండి ....!!

బ్రాహ్మణ ఘోష : బ్రాహ్మణుడి బాధలు ప్రభుత్వానికి పట్టవా..?

బ్రాహ్మణ ఘోష : భ్రాహ్మణులపై ప్రభుత్వాల వైఫల్యమే కారణమా..!!

కాపు వేద‌న‌: కాపులు ఈ ప‌నిచేస్తే రాజ్యాధికారం ప‌క్కానా ?

బ్రాహ్మణ ఘోష: జగనోరికి బ్రాహ్మణ గోష్ఠ తప్పదు...?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - SS Marvels]]>