MoviesNAGARJUNA NAKKAeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_gossips/she-went-into-depression-for-what-the-hero-did4e6f6693-f499-4842-8a63-2e8346c67e1e-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_gossips/she-went-into-depression-for-what-the-hero-did4e6f6693-f499-4842-8a63-2e8346c67e1e-415x250-IndiaHerald.jpgరణ్‌బీర్ కపూర్ లిస్ట్‌లో హీరోయిన్ల పేర్లు మారుతున్నాయి గానీ, అతని సింగిల్‌ స్టేటస్‌ మాత్రం మారడం లేదు. చాలా మంది హీరోయిన్లని పెళ్లివరకు తీసుకెళ్లి బ్రేకప్‌ చెప్పాడు రణ్‌బీర్. ఇప్పుడు నువ్వే నా సమస్తం అంటూ చుట్టూ తిరుగుతోన్న ఆలియాభట్‌కి కూడా హ్యాండ్‌ ఇస్తున్నాడట ఈ బ్రేకప్ స్టార్. రణ్‌బీర్ కపూర్‌, దీపిక పదుకొణే లవ్‌ స్టోరీ గురించి ప్రపంచం మొత్తానికి తెలుసు. 'బచ్‌నా ఏ హసీనా' సినిమా టైమ్‌లో వీళ్లిద్దరు ఒకరికొకరు దగ్గరయ్యారు. రెండేళ్లు కలిసి తిరిగారు. పెళ్లి కూడా చేసుకుంటారనే ప్రచారం జరిగింది. she went into depression for what the hero did;alia bhatt;avantikka;priya;avanthika;deepika;priyanka;tiru;cinema;marriage;hero;partyహీరో చేసిన పనికి ఆమె డిప్రెషన్ లోకి వెళ్లిపోయింది..!హీరో చేసిన పనికి ఆమె డిప్రెషన్ లోకి వెళ్లిపోయింది..!she went into depression for what the hero did;alia bhatt;avantikka;priya;avanthika;deepika;priyanka;tiru;cinema;marriage;hero;partyFri, 29 Jan 2021 16:00:00 GMT
రణ్‌బీర్ కపూర్‌, దీపిక పదుకొణే లవ్‌ స్టోరీ గురించి ప్రపంచం మొత్తానికి తెలుసు. 'బచ్‌నా ఏ హసీనా' సినిమా టైమ్‌లో వీళ్లిద్దరు ఒకరికొకరు దగ్గరయ్యారు. రెండేళ్లు కలిసి తిరిగారు. పెళ్లి కూడా చేసుకుంటారనే ప్రచారం జరిగింది. కానీ ఆ తర్వాత దీపికకి బ్రేకప్‌ చెప్పి మరో లవ్‌ స్టోరీ మొదలుపెట్టాడు రణ్‌బీర్. ఈ బ్రేకప్‌తో దీపిక పదుకొణే డిప్రెషన్‌లోకి వెళ్లింది.

రణ్‌బీర్‌ కపూర్‌, దీపికతో విడిపోయాక ప్రియాంక చోప్రాకి దగ్గరయ్యాడు. 'అంజానా అంజాని' సినిమా టైమ్‌లో ప్రియాంకని పడేసిన రణ్‌బీర్‌, ఈ రిలేషన్‌ని కూడా ఎక్కువ కాలం మెయింటైన్ చేయలేదు.  

ప్రియాంక చోప్రాకి కటీఫ్‌ చెప్పి కత్రీన కైఫ్‌తో వ్యవహారం నడిపాడు. నాలుగేళ్లపాటు కత్రీనాతో కలిసి టూర్లు, పార్టీలు అంటూ తెగ తిరిగాడు. రణ్‌బీర్, కత్రీనాకి ఎంగేజ్‌మెంట్ అయిందనీ, పెళ్లి కూడా చేసుకుంటారనే ప్రచారం జరిగింది. కానీ పెళ్లి వరకు తీసుకొచ్చిన క్యాట్స్‌కి బ్రేకప్‌ చెప్పి, మరో లవ్‌ స్టోరీ మొదలుపెట్టాడు.

కత్రీన కైఫ్‌తో విడిపోయాక కొన్నాళ్లు అమీషా పటేల్‌ చుట్టూ తిరిగాడు రణ్‌బీర్ కపూర్. అమిషాకి ప్రైవేట్‌ బర్త్‌డే పార్టీ కూడా ఇచ్చాడు. అయితే ఈ ప్రైవేట్‌ పార్టీల తర్వాత మళ్లీ వీళ్లిద్దరు కలిసి కనిపించలేదు.

రణ్‌బీర్‌ కపూర్‌ వీళ్లతో మాత్రమే కాదు నర్గీస్‌ ఫక్రీ, సోనమ్‌ కపూర్ లాంటి హీరోయిన్స్‌తోనూ ఎఫైర్స్‌ నడిపాడు. కింగ్‌ఫిషర్ క్యాలెండర్‌ గర్ల్ ఏంజెలా జాన్సన్‌తోనూ ట్రిప్పులేశాడు. అయితే సినిమాల్లోకి రాకముందే రణ్‌బీర్ అవంతిక మాలిక్‌తో ఎఫైర్ నడిపాడు. ఇప్పుడు ఆలియా భట్‌తో రిలేషన్‌లో ఉన్నాడు.

రణ్‌బీర్ కపూర్, ఆలియా భట్‌ పెళ్లి గురించి రెండేళ్ల నుంచి ప్రచారం జరుగుతోంది. కానీ ఇప్పటికీ పెళ్లి డేట్‌పై క్లారిటీ ఇవ్వలేదు రణ్‌బీర్ కపూర్. అయితే ఇప్పుడు ఆలియాకి కూడా రణ్‌బీర్ హ్యాండ్‌ ఇస్తున్నాడనే ప్రచారం జరుగుతోంది. అలవాటు ప్రకారం ఈ హీరోయిన్‌కి బ్రేకప్ చెబుతాడని అందుకే పెళ్లి గురించి మాట్లాడట్లేదని చెబుతున్నారు బాలీవుడ్‌ జనాలు.




కేసీఆర్ ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు పెంచడం కరెక్టేనా?

బ్రాహ్మణ ఘోష: జగనోరికి బ్రాహ్మణ గోష్ఠ తప్పదు...?

బ్రాహ్మణ ఘోష : బ్రాహ్మణులకు ప్రభుత్వం ఉపాధి కల్పించాలి....

‘30 రోజుల్లో ప్రేమించడం ఎలా..?’ ఎలా ఉందంటే..

బిగ్ బ్రేకింగ్ : 'ఆచార్య' టీజర్ రిలీజ్ - మాటల్లేవ్ మాట్లాడుకోవడాల్లేవ్ .....!!

బిగ్ అప్ డేట్ : 'సర్కారు వారి పాట' రిలీజ్ డేట్ అనౌన్స్ చేసిన సూపర్ స్టార్ మహేష్ ....!!

ప్రభాస్ 'సలార్' స్టోరీ లీక్..కేజీఎఫ్ కూడా పనికిరాదు..!!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - NAGARJUNA NAKKA]]>