PoliticsSpydereditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/jagan-nimmagadda-electiondffe668a-7992-4ddd-9844-5c0afc974724-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/jagan-nimmagadda-electiondffe668a-7992-4ddd-9844-5c0afc974724-415x250-IndiaHerald.jpgరాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ నిమ్మగడ్డ రమేశ్‌కుమార్‌ ఓటు విషయంలో ఆసక్తికర చర్చ నడుస్తోంది. హైదరాబాద్‌లో ఉన్న తన ఓటును తీసివేసి స్వగ్రామం గుంటూరు జిల్లా దుగ్గిరాలలో ఇవ్వాలని దరఖాస్తు చేస్తే.. రెవెన్యూ అధికారులు తిరస్కరించిన విషయం తెలిసిందే. ఆయనే స్వయంగా ఈ విషయాన్ని వెల్లడించారు. తనకు హైదరాబాద్‌లో ఉన్న ఓటును స్వాధీనం చేసి.. సొంత ఊరు గుంటూరు జిల్లా దుగ్గిరాలలో ఓటు కోసం దరఖాస్తు చేసుకున్నట్లు తెలిపారు. త‌న స్వ‌గ్రామంలో ఓటు హ‌క్కు ఉండాల‌ని కోరుకుంటున్న‌ట్లు పేర్కొన్నారు. గ్రామంలో ఇల్లు, పొలం, ఇతర ఆస్తులుnimmagadda;krishna river;2019;district;panchayati;village;court;application;chief commissioner of electionsజ‌గ‌డ్డ : నిమ్మ‌గ‌డ్డ‌కు కృష్ణా జిల్లాలోనే ఓటు ఉంటుందా..? అధికారులు జుట్టు పీక్కుంటున్నారుగాజ‌గ‌డ్డ : నిమ్మ‌గ‌డ్డ‌కు కృష్ణా జిల్లాలోనే ఓటు ఉంటుందా..? అధికారులు జుట్టు పీక్కుంటున్నారుగాnimmagadda;krishna river;2019;district;panchayati;village;court;application;chief commissioner of electionsFri, 29 Jan 2021 09:00:00 GMTఎన్నికల కమిషనర్‌ నిమ్మగడ్డ రమేశ్‌కుమార్‌ ఓటు విషయంలో ఆసక్తికర చర్చ నడుస్తోంది. హైదరాబాద్‌లో ఉన్న తన ఓటును తీసివేసి స్వగ్రామం గుంటూరు జిల్లా దుగ్గిరాలలో ఇవ్వాలని దరఖాస్తు చేస్తే.. రెవెన్యూ అధికారులు తిరస్కరించిన విషయం తెలిసిందే. ఆయనే స్వయంగా ఈ విషయాన్ని వెల్లడించారు. తనకు హైదరాబాద్‌లో ఉన్న ఓటును స్వాధీనం చేసి.. సొంత ఊరు గుంటూరు జిల్లా దుగ్గిరాలలో ఓటు కోసం దరఖాస్తు చేసుకున్నట్లు తెలిపారు. త‌న స్వ‌గ్రామంలో ఓటు హ‌క్కు ఉండాల‌ని కోరుకుంటున్న‌ట్లు పేర్కొన్నారు. గ్రామంలో ఇల్లు, పొలం, ఇతర ఆస్తులు ఉన్నాయని.. తాను ఉద్యోగరీత్యా ఎక్కడ ఉన్నా, సొంత గ్రామానికి తరచూ వెళ్లి వస్తుంటానని గుర్తు చేసుకున్నారు.


ఏ పౌరుడికైనా దేశంలో ఎక్కడో ఒకచోట ఓటు హక్కు కోరుకునే హక్కు ఉంటుంద‌ని, త‌న‌కు స్వ‌గ్రామంలో ఉండాల‌ని ఉంద‌ని అన్నారు. అందుకే హైదరాబాద్‌లోని తన ఓటును స్వాధీనం చేసిన సర్టిఫికెట్‌‌తో ఓటు హక్కు కల్పించాలని దుగ్గిరాల తహసీల్దారుకు దరఖాస్తు చేసుకున్నట్లు ఇటీవ‌ల ఆయ‌న మీడియాకు తెలిపారు. ఓటు హక్కు వస్తే పంచాయతీ ఎన్నికల్లో ఓటు వేయాలనీ అనుకున్నా.. దుగ్గిరాలలో ఉండటం లేదు కాబట్టి ఓటు హక్కు కల్పించడం లేదంటూ ఇప్పుడు నోటీసులు పంపించారు. అయితే అధికారుల చ‌ర్య‌తో తాను కొంత నిరాశ ప‌డ్డ మాట‌యితే వాస్త‌వ‌మే. అయితే తన దరఖాస్తును పునఃపరిశీలించాలని కలెక్టరును కోరిన‌ట్లు తెలిపారు.


అయితే ఇప్పుడు సాక్షాత్తూ  ఎన్నికల కమిషర్‌కే ఓటు లేకుండా చేస్తే, ఇక సామాన్యుడి గతేమిటన్న ప్రశ్న తలెత్తుతోంది. జిల్లా కలెక్టర్‌కు నిమ్మగడ్డ చేసిన అప్పీల్‌ పరిశీలనలో ఉంది. అక్కడా తిరస్కరిస్తే కోర్టుకు వెళ్తానని.. తన హక్కును దక్కించుకుంటానని ఆయన స్పష్టం చేశారు. ఆయన స్వగ్రామంలో మొదటి విడతలోనే ఎన్నికలు జరగనున్నాయి. మ‌రోవైపుఎన్నికల జాబితా సకాలంలో అందించడంలో పంచాయతీరాజ్ అధికారులు విఫలమయ్యారని అన్నారు. అందుకే తప్పనిసరి పరిస్థితుల్లో 2019 ఓటర్ల జాబితాతోనే ఎన్నికలు నిర్వహిస్తున్నామని చెప్పారు.ఎన్నికల కమిషనర్ చెప్పిన ప్రకారం రాష్ట్రంలో 2019 ఓటర్ల జాబితా ప్రకారమే పంచాయతీ ఎన్నికలు జరుగ‌నున్నాయి.


జ‌గ‌డ్డ‌: జ‌గ‌నోరిపై కుత‌కుత‌లాడుతోన్న రాజ‌ధాని రెడ్లు...!

జగడ్డ : పేదల ఆశలతో ఆటలా..జగనోరు ??

జగడ్డ: నెల్లూరు జిల్లాలో అధికార పార్టీకి అభ్యర్థులు కరువు

జగడ్డ: జగనోరు ఇప్పటికైనా బుద్ది మార్చుకోండి.. ఎంపీ సెటైర్..

జ‌గ‌డ్డ‌: జ‌గ‌న్‌ని కాపాడుతూ... మ‌నం ఇరుక్కుంటున్నామా..!

జ‌గ‌నోరు చివ‌రి నిముషంలో వెన‌క్కి త‌గ్గారా ? ఏంటా సంచ‌ల‌న నిర్ణ‌యం..!

జగ‌డ్డ: విజయనగరం - పంచాయతీ ఎన్నికల్లో ఈ జిల్లా స్పెషల్ తెలుసా..?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Spyder]]>