Moviesshamieditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/acharya-teaser-megastar-chiranjeevi-acharya-teaser-releasee996b43c-8792-4995-9391-95d6abf4d863-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/acharya-teaser-megastar-chiranjeevi-acharya-teaser-releasee996b43c-8792-4995-9391-95d6abf4d863-415x250-IndiaHerald.jpgమెగాస్టార్ చిరంజీవి, కొరటాల శివ కాంబినేషన్ లో భారీ అంచనాలతో వస్తున్న సినిమా ఆచార్య. నిరంజన్ రెడ్డి నిర్మిస్తున్న ఈ సినిమాకు మణిశర్మ మ్యూజిక్ అందిస్తున్నారు. కొరటాల శివ మార్క్ సోషల్ మెసేజ్ తో పాటుగా మెగా ఫ్యాన్స్ కోరుకునే అన్ని కమర్షియల్ అంశాలు సినిమాలో ఉన్నాయని చెప్పుకొచ్చారు. అయితే లేటెస్ట్ గా కొద్దిసేపటి క్రితం రిలీజైన ఆచార్య టీజర్ అది నిజమని ప్రూవ్ చేసింది. ఆచార్య టీజర్ ఓ ధర్మస్థలిని కాపాడే వ్యక్తి.. పాఠాలు చెప్పకపోయినా గుణపాఠాలు చెబుతాడు కాబట్టే అతన్ని అందరు ఆచార్య అంటారేమో అని చూపించారు.chiranjeevi-acharya-teaser;chiranjeevi;pooja hegde;shiva;kajal aggarwal;koratala siva;mani sharma;cinema;festival;konidela production;twitter;lord siva;heroine;research and analysis wing;reddyఆచార్య.. మెగా ఫ్యాన్స్ కు పూనకాలే.. ఫుల్ మీల్స్ పక్కా..!ఆచార్య.. మెగా ఫ్యాన్స్ కు పూనకాలే.. ఫుల్ మీల్స్ పక్కా..!chiranjeevi-acharya-teaser;chiranjeevi;pooja hegde;shiva;kajal aggarwal;koratala siva;mani sharma;cinema;festival;konidela production;twitter;lord siva;heroine;research and analysis wing;reddyFri, 29 Jan 2021 17:27:52 GMTమెగాస్టార్ చిరంజీవి, కొరటాల శివ కాంబినేషన్ లో భారీ అంచనాలతో వస్తున్న సినిమా ఆచార్య. నిరంజన్ రెడ్డి నిర్మిస్తున్న ఈ సినిమాకు మణిశర్మ మ్యూజిక్ అందిస్తున్నారు. కొరటాల శివ మార్క్ సోషల్ మెసేజ్ తో పాటుగా మెగా ఫ్యాన్స్ కోరుకునే అన్ని కమర్షియల్ అంశాలు సినిమాలో ఉన్నాయని చెప్పుకొచ్చారు. అయితే లేటెస్ట్ గా కొద్దిసేపటి క్రితం రిలీజైన ఆచార్య టీజర్ అది నిజమని ప్రూవ్ చేసింది. ఆచార్య టీజర్ ఓ ధర్మస్థలిని కాపాడే వ్యక్తి.. పాఠాలు చెప్పకపోయినా గుణపాఠాలు చెబుతాడు కాబట్టే అతన్ని అందరు ఆచార్య అంటారేమో అని చూపించారు.

ఇక సినిమా టీజర్ లో మెగాస్టార్ హీరోయిజం పీక్స్ లో చూపించాడు కొరటాల శివ. ఇదివరకు ఎప్పుడూ తన సినిమాలో హీరోలను చూపించనంత పవర్ ఫుల్ గా ఆచార్యలో మెగాస్టార్ చిరంజీవిని చూపిస్తున్నారని తెలుస్తుంది. ఇక చిరు టీజరే ఇలా ఉంటే సినిమాలో ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తున్న సిద్ధ అదేనండి రాం చరణ్ రోల్ ఎలా ఉంటుందో అర్ధం చేసుకోవచ్చు. ఆచర్యలో చిరు లుక్, స్టైల్, యాక్షన్, ఫైట్స్ ఇవన్ని మెగా అభిమానులకు పూనకాలు తెప్పించేలా ఉన్నాయి.

కచ్చితంగా ఆచార్య సినిమా మెగా ఫ్యాన్స్ పండుగ చేసుకునే ఫుల్ మీల్స్ మూవీగా ఉంటుందని చెబుతున్నారు. సినిమాను సమ్మర్ రిలీజ్ ప్లాన్ చేయగా మే 9న రిలీజ్ ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తుంది. కొణిదెల ప్రొడక్షన్స్ లో రాం చరణ్ కూడా ఈ సినిమాకు సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. సినిమాలో కాజల్ అగర్వాల్, పూజా హెగ్దే హీరోయిన్స్ గా నటిస్తున్నారు. చిరు ఆచార్య టీజర్ అరుపులు పెట్టించగా సినిమా అంతకుమించి అనిపించేలా ఉంటుందని అనిపిస్తుంది. మరి సినిమా ఎలా ఉంటుందో చూడాలంటే సినిమా వచ్చే దాకా వెయిట్ చేయాల్సిందే.      

" style="height: 450px;">
             






కేసీఆర్ ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు పెంచడం కరెక్టేనా?

బ్రాహ్మణ ఘోష: జగనోరికి బ్రాహ్మణ గోష్ఠ తప్పదు...?

బ్రాహ్మణ ఘోష : బ్రాహ్మణులకు ప్రభుత్వం ఉపాధి కల్పించాలి....

‘30 రోజుల్లో ప్రేమించడం ఎలా..?’ ఎలా ఉందంటే..

బిగ్ బ్రేకింగ్ : 'ఆచార్య' టీజర్ రిలీజ్ - మాటల్లేవ్ మాట్లాడుకోవడాల్లేవ్ .....!!

బిగ్ అప్ డేట్ : 'సర్కారు వారి పాట' రిలీజ్ డేట్ అనౌన్స్ చేసిన సూపర్ స్టార్ మహేష్ ....!!

ప్రభాస్ 'సలార్' స్టోరీ లీక్..కేజీఎఫ్ కూడా పనికిరాదు..!!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - shami]]>