MoviesVAMSIeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/movies/movies_latestnews/anchor-pradeep-detailsb42f314f-f06b-43b5-a3d4-bdb071f43a24-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/movies/movies_latestnews/anchor-pradeep-detailsb42f314f-f06b-43b5-a3d4-bdb071f43a24-415x250-IndiaHerald.jpgతాజాగా మిస్ట‌ర్ అండ్ మిసెస్ అనే సినిమాలో హీరోయిన్‌గా న‌టించింది జ్ఞానేశ్వరి. ఈ మూవీ ప్ర‌మోష‌న్ల‌లో భాగంగా మాట్లాడిన ఈమెకు ప్రదీప్ తో మీ పెళ్లి ఎందుకు కాలేదు అన్న ప్రశ్న ఎదురయింది. అప్పుడు ఈమె ఏమన్నారంటే...!! పెళ్లి చేసుకోవాల‌ని ఆ షో జ‌ర‌గ‌లేద‌ని క్లారిటీ ఇచ్చింది.. anchor pradeep details;prabhas;pradeep;suma;suma kanakala;cinema;marriage;winner;hero;reality show;silver;winner1;successయాంక‌ర్ ప్ర‌దీప్‌తో పెళ్లి ఆగిపోవ‌డానికి కార‌ణం చెప్పిన ఙ్ఞానేశ్వ‌రి...!యాంక‌ర్ ప్ర‌దీప్‌తో పెళ్లి ఆగిపోవ‌డానికి కార‌ణం చెప్పిన ఙ్ఞానేశ్వ‌రి...!anchor pradeep details;prabhas;pradeep;suma;suma kanakala;cinema;marriage;winner;hero;reality show;silver;winner1;successFri, 29 Jan 2021 13:00:00 GMTవెండి తెరపై ఇటు బుల్లితెరపై తన సత్తా చాటుతూ రాకెట్లా దూసుకు పోతున్నాడు ఈ యంగ్ అండ్ డైనమిక్ యాంకర్ కమ్ హీరో. బుల్లితెరపై సుమ తర్వాత ఆ స్థాయిలో పేరు ప్రఖ్యాతులు గాంచాడు ప్రదీప్. పక్కా టైమింగ్ తో పంచులు, అనర్గళంగా మాట్లాడగల వాక్చాతుర్యం, అందమైన మోము, నేచురల్ గా అనిపించే నటన, ఇవన్నీ ప్రదీప్ కు ప్లస్ పాయింట్ గా మారాయి. బుల్లి తెర పై సక్సెస్ ను అందుకున్న ప్రదీప్ ఇప్పుడు వెండితెరపై హీరోగా అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు రెడీ అయ్యారు.

ప్రదీప్ మాచినేని ప్రధాన పాత్రలో తెరకెక్కిన 30 రోజుల్లో ప్రేమించడం ఎలా చిత్రం ఈరోజు విడుదల అయింది. కాగా ఈ సినిమా ప్రదీప్ ను ఇండస్ట్రీలో హీరోగా నిలబెట్టేందుకు అవసరమయ్యే బూస్ట్ ఖచ్చితంగా ఇస్తుంది అంటున్నారు ఆయన అభిమానులు. ఇదిలా ఉంటే వెండితెరపై ప్రభాస్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ అయితే.... బుల్లితెరపై మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ ప్రదీప్ మాచినేని అని చెప్పొచ్చు. ఈయన పెళ్లిపై ఎప్పుడూ ఏదో ఒక న్యూస్ సోషల్ మీడియాలో హడావుడి చేస్తూనే ఉంటుంది. అయితే తాజాగా  ప్రదీప్ పెళ్లి వార్త ఓసారి హాట్ టాపిక్ గా మారింది.

2018లో స్టార్ మాటీవీ లో పెళ్లిచూపులు అనే పేరుతో ఒక రియాలిటీ షో ప్రసారమైన విషయం అందరికీ గుర్తుండే ఉంటుంది. ఈ ప్రోగ్రామ్ కి సుమ వ్యాఖ్యాతగా చేశారు. ఈ ప్రోగ్రాంలో పాల్గొన్న వారిలో విజేతగా నిలిచిన యువతితో ప్రదీప్ పెళ్లి అన్నది కాన్సెప్ట్. ఇది అందరూ నిజమని నమ్మారు. షో కూడా అదే తరహాలో కొనసాగింది. చివ‌రకు ఙ్ఞానేశ్వ‌రి విజేత‌గా నిలిచింది. ఇక బ‌య‌ట‌కు వ‌చ్చిన త‌రువాత ఈ ఇద్ద‌రి పెళ్లి జ‌రుగుతుంద‌ని అంద‌రూ భావించారు... కానీ అందరూ ఊహించిన విధంగా ప్రదీప్ కు జ్ఞానేశ్వరి తో పెళ్లి కాలేదు... కానీ విన్నర్ గా నిలిచిన జ్ఞానేశ్వరికి మాత్రం అవకాశాలు అంది వచ్చాయి.

తాజాగా మిస్ట‌ర్ అండ్ మిసెస్ అనే సినిమాలో హీరోయిన్‌గా న‌టించింది జ్ఞానేశ్వరి. ఈ మూవీ ప్ర‌మోష‌న్ల‌లో భాగంగా మాట్లాడిన ఈమెకు ప్రదీప్ తో మీ పెళ్లి ఎందుకు   కాలేదు అన్న ప్రశ్న ఎదురయింది. అప్పుడు ఈమె ఏమన్నారంటే...!! పెళ్లి చేసుకోవాల‌ని ఆ షో జ‌ర‌గ‌లేద‌ని క్లారిటీ ఇచ్చింది.. కేవ‌లం పెళ్లిచూపుల‌ని .. ఒక‌రికొక‌రు అర్థం చేసుకుంటే చేసుకోవ‌చ్చని అంతేకానీ పెళ్లి చేసుకోవాలని చెప్పలేదని  ఙ్ఞానేశ్వ‌రి తెలిపింది.  ప‌్ర‌దీప్‌తో మీరు ఇప్ప‌టికీ కాంటాక్ట్‌లో ఉన్నారా..? అన్న ప్ర‌శ్న‌కు.. ఇది తాను కెమెరా ముందు చెప్ప‌న‌ని ఙ్ఞానేశ్వ‌రి చెప్పడంతో విషయం వైరల్ గా మారింది. అంటే వీరిద్దరూ ఇంకా టచ్ లోనే ఉన్నారా అన్న కామెంట్స్ వినబడుతున్నాయి...


మ్యూచువల్ ఫండ్స్ లో డబ్బులు పెడుతున్నారా.. ఈ తప్పులు మాత్రం చేయకండి..?

జగడ్డ : సర్కార్ కి మరో మాస్టర్ స్ట్రోక్ ఇచ్చిన నిమ్మగడ్డ !

కాపు వేద‌న‌: వైసీపీలో కృష్ణా, గుంటూరు కాపులు నోరెత్తితే క‌ష్ట‌మేనా ?

జగడ్డ : ఏకంగా సజ్జలకే ఎసరు పెట్టిన నిమ్మగడ్డ ?

జగడ్డ : విశాఖలో ఆరు పంచాయతీల్లో ఎన్నికలకు బ్రేక్...?

రంగ‌రాజోరికి జ‌గ‌నోరి ఫైన‌ల్ బాల్‌ ఇదే ‌... సిక్స్ కొట్ట‌క‌పోతే అవుటే...!

జ‌గ‌నోరు అక్క‌డ మీ పార్టీ ఎమ్మెల్యే ఎవ‌రో మీకైనా తెలుసా...?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - VAMSI]]>