PoliticsSRISHIVAeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/rasamai-balakishane71f664a-220f-4ead-9946-f0ff2b31472b-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/rasamai-balakishane71f664a-220f-4ead-9946-f0ff2b31472b-415x250-IndiaHerald.jpgమానకొండూరు నియోజకవర్గ టీఆర్ఎస్ కార్యకర్తల విస్తృత సమావేశంలో పాల్గొన్న ఎమ్మెల్యే రసమయి బాలకిషన్.. మరోసారి హాట్ కామెంట్స్ చేశారు. దేశ విదేశాలకు వెళ్తే పాటలతో కోట్ల కోట్లు సంపాదిస్తానంటూ మరోసారి తన అసంతృప్తిని వ్యక్తం చేశారు. ఎమ్మెల్యేగా తాను హ్యాపీగా లేననే సంకేతమిచ్చారు. తన అసమ్మతిని చెబుతూనే.. టీఆర్ఎస్ పార్టీకి విధేయుడిగా ఉంటానని మాట్లాడారు ఎమ్మెల్యే రసమయి. తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్ మాటకు తోడుగా తాను ఆడిపాడానని తెలిపారు.rasamai balakishan;kcr;jeevitha rajaseskhar;telangana rashtra samithi trs;telangana;district;huzur nagar;mla;dogs;karimnagar;partyరసమయి మరో బాంబ్రసమయి మరో బాంబ్rasamai balakishan;kcr;jeevitha rajaseskhar;telangana rashtra samithi trs;telangana;district;huzur nagar;mla;dogs;karimnagar;partyFri, 29 Jan 2021 21:01:05 GMTకరీంనగర్ జిల్లా మానకొండూరు టీఆర్ఎస్ ఎమ్మెల్యే. ఉద్యమ గాయకుడు రసమయి బాలకిషన్ మరోసారి బాంబ్ పేల్చారు. ఇటీవలే మహబూబా బాద్ లో జరిగిన ఓ కార్యక్రమంలో మాట్లాడిన రసమయి.. తానో లిమిటెడ్ కంపెనీలో పని చేస్తున్నానని కామెంట్ చేశారు. రసమయి వ్యాఖ్యలు టీఆర్ఎస్ తో పాటు తెలంగాణ రాజకీయాల్లో సంచలనంగా మారాయి. గులాబీ పార్టీ పెద్దల తీరుపై అసహనంతోనే రసమయి అలా మాట్లాడారని చర్చ జరిగింది. తన వ్యాఖ్యలపై దుమారం జరుగుతున్నా స్పందించలేదు ఎమ్మెల్యే రసమయి. దీంతో కావాలనే ఎమ్మెల్యే మాట్లాడారని అంతా భావించారు.

       తాజాగా  తిమ్మాపూర్ మండలం కొత్తపల్లిలో మానకొండూరు నియోజకవర్గ టీఆర్ఎస్ కార్యకర్తల విస్తృత సమావేశంలో పాల్గొన్న  ఎమ్మెల్యే రసమయి బాలకిషన్.. మరోసారి హాట్ కామెంట్స్ చేశారు. దేశ విదేశాలకు వెళ్తే పాటలతో కోట్ల కోట్లు సంపాదిస్తానంటూ మరోసారి తన అసంతృప్తిని వ్యక్తం చేశారు. ఎమ్మెల్యేగా తాను హ్యాపీగా లేననే సంకేతమిచ్చారు. తన అసమ్మతిని చెబుతూనే.. టీఆర్ఎస్ పార్టీకి విధేయుడిగా ఉంటానని మాట్లాడారు ఎమ్మెల్యే రసమయి. తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్ మాటకు తోడుగా తాను ఆడిపాడానని తెలిపారు.

       ఇటీవల మహాబూబాబాద్ లో తాను చేసిన వ్యాఖ్యలను తప్పుగా అర్థం చేసుకున్నారన్నారు రసమయి. రసమయి అనే టోనికి కబ్జాలు పైరవీలు తెలవదని చెప్పారు. తన జీవితం లిమిటెడ్ లైఫ్ అని అంటే.. లిమిటెడ్ కంపెనీ లో పని చేస్తున్నానని వక్రీకరించడం సంచలనాలకు తెరతీసిందన్నారు. ఎమ్మెల్యే పదవిలో ఉన్నా...  కళాకారునిగా తనకు కొంత లిమిట్ ఉంటుందనే అర్థంలో అలా చెప్పానని తెలిపారు. మానకొండూరు ప్రజలకు  గౌరవాన్ని కల్పించే దిశగా పనిచేస్తా తప్ప... తలవంపులు తీసుకువచ్చే స్థితికి దిగజారనని తేల్చి చెప్పారు. ప్రజలకు, కార్యకర్తలకు కాపలా కుక్క లాగా ఉంటానన్నారు ఎమ్మెల్యే బాలకిషన్. నాబలం..బలగం మానకొండూర్ నియోజకవర్గ ప్రజలు మరియు టీఆర్ఎస్ పార్టీ శ్రేణులేనని చివరకు నా ప్రాణం పోయినా మీకు తలవంపులు తెచ్చే ప్రసక్తే లేదని రసమయి బాలకిషన్ స్పష్టం చేశారు.


చిరంజీవి పై విష ప్రయోగం చేసింది ఎవరు..? నిజంగానే జరిగిందా..?

బ్రాహ్మణ ఘోష : భ్రాహ్మణులపై ప్రభుత్వాల వైఫల్యమే కారణమా..!!

కాపు వేద‌న‌: కాపులు ఈ ప‌నిచేస్తే రాజ్యాధికారం ప‌క్కానా ?

బ్రాహ్మణ ఘోష: జగనోరికి బ్రాహ్మణ గోష్ఠ తప్పదు...?

బ్రాహ్మణ ఘోష : బ్రాహ్మణులకు ప్రభుత్వం ఉపాధి కల్పించాలి....

‘30 రోజుల్లో ప్రేమించడం ఎలా..?’ ఎలా ఉందంటే..

బిగ్ బ్రేకింగ్ : 'ఆచార్య' టీజర్ రిలీజ్ - మాటల్లేవ్ మాట్లాడుకోవడాల్లేవ్ .....!!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - SRISHIVA]]>