MoviesSatyaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/sanae938c280-a99d-47e4-9a35-d71f86258491-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/sanae938c280-a99d-47e4-9a35-d71f86258491-415x250-IndiaHerald.jpgసినిమా బాగుండాలే మంచి కధ ఉండాలి. అలాగే మంచి కధనం కూడా ఉండాలి. రెండు గంటల పాటు ఆడియన్స్ ని థియేటర్లో కూర్చోబెట్టడం అంటే అషామాషీ వ్యవహారం కాదు. అందునా ఈ రోజుల్లో అయితే ఎన్నో వ్యాపారాలు, వ్యాపారాలతో బిజీగా ఉన్న వారిని సినిమా హాలు వైపు రప్పించడమే అతి కష్టమైన టాస్క్ అవుతోంది. sana;chiranjeevi;kumaar;bharathiraja;prema;sukumar;tiru;tollywood;cinema;love;audience;director;hero;vaishnav tej;ee rojulloఉప్పెన డైరెక్టర్ పైన పడిన మెగా చూపు...?ఉప్పెన డైరెక్టర్ పైన పడిన మెగా చూపు...?sana;chiranjeevi;kumaar;bharathiraja;prema;sukumar;tiru;tollywood;cinema;love;audience;director;hero;vaishnav tej;ee rojulloFri, 29 Jan 2021 20:30:00 GMTసినిమా బాగుండాలే మంచి కధ ఉండాలి. అలాగే మంచి కధనం కూడా ఉండాలి. రెండు గంటల పాటు ఆడియన్స్ ని థియేటర్లో కూర్చోబెట్టడం అంటే అషామాషీ వ్యవహారం కాదు. అందునా ఈ రోజుల్లో అయితే ఎన్నో వ్యాపారాలు, వ్యాపారాలతో బిజీగా ఉన్న వారిని సినిమా హాలు వైపు రప్పించడమే అతి కష్టమైన టాస్క్ అవుతోంది.

ఈ నేపధ్యంలో ఎందరో కొత్త డైరెక్టర్లు పరిచయం అవుతున్నారు. కానీ వారు నిలదొక్కుకోలేకపోతున్నారు. ఇదిలా ఉంటే ఉప్పెన మూవీ ద్వారా దూసుకువచ్చీ బుచ్చిబాబు సాన తన టాలెంట్ ఏంటో తొలి సినిమాతోనే చూపించాడు. కొత్త హీరో హీరోయిన్లను సరిగ్గానే హ్యాండిల్ చేయడమే కాకుండా ఎప్పటికీ వాడిపోని ప్రేమ కధను ఎంచుకుని సినిమాను స్టార్ట్ చేశాడు.

ఉప్పెన మూవీ క్లైమాక్స్ కూడా చాలా సూపర్బ్ గా ఉంటుందని అంటున్నారు. ఇక ఈ సినిమాలో హీరో ఎవరో కాదు మెగా మేనల్లుడు వైష్ణవ్ తేజ్. దాంతో ఈ మూవీ  మీద మొదటి నుంచి ప్రత్యేక శ్రధ్ధ చూపించిన మెగాస్టార్ చిరంజీవి ఈ సినిమాను చూసి డైరెక్టర్ బుచ్చిబాబుని ఒక్క లెక్కన పొగిడేశారట. తమిళనాడు కు చెందిన డైరెక్టర్ భారతీరాజా మార్క్ తనలో ఉందని కూడా మెచ్చుకున్నారుట. ప్రేమ కధా చిత్రాలను తీయడంతో భారతీరాజా స్టైలే వేరు. మరి ఆయనలా తన మార్క్, షార్ప్ చూపించిన బుచ్చిబాబు సానా టాలీవుడ్ కి మరో అద్భుతమైన డైరెక్టర్ అవుతాడు అంటున్నారు. ఇక మెగాస్టార్ చూపు ఆయన మీద పడింది కాబట్టి తిరుగులేని స్టార్ డమ్ ని కూడా సంపాదించుకుంటాడు అంటున్నారు. ఇక ఈ బుచ్చిబాబు సానా శిష్యరికం ఎవరి దగ్గర చేశాడు అంటే టాప్ డైరెక్టర్ సుకుమార్ వద్ద అని చెప్పాలి. మరి సుకుమార్ నెమ్మదిగా వచ్చి ఇంత రేంజికి చేరుకున్నాడు. బుచ్చిబాబు కూడా అదే రేంజిలో టాలీవుడ్ ని ఏలుతాడు అంటున్నారు.






బ్రాహ్మణ ఘోష : భ్రాహ్మణులపై ప్రభుత్వాల వైఫల్యమే కారణమా..!!

కాపు వేద‌న‌: కాపులు ఈ ప‌నిచేస్తే రాజ్యాధికారం ప‌క్కానా ?

బ్రాహ్మణ ఘోష: జగనోరికి బ్రాహ్మణ గోష్ఠ తప్పదు...?

బ్రాహ్మణ ఘోష : బ్రాహ్మణులకు ప్రభుత్వం ఉపాధి కల్పించాలి....

‘30 రోజుల్లో ప్రేమించడం ఎలా..?’ ఎలా ఉందంటే..

బిగ్ బ్రేకింగ్ : 'ఆచార్య' టీజర్ రిలీజ్ - మాటల్లేవ్ మాట్లాడుకోవడాల్లేవ్ .....!!

బిగ్ అప్ డేట్ : 'సర్కారు వారి పాట' రిలీజ్ డేట్ అనౌన్స్ చేసిన సూపర్ స్టార్ మహేష్ ....!!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Satya]]>