PoliticsChakravarthi Kalyaneditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/madanapalle-murders-lo-asalu-facts-ideef84538b6-9138-48dd-a8e3-d950458f5670-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/madanapalle-murders-lo-asalu-facts-ideef84538b6-9138-48dd-a8e3-d950458f5670-415x250-IndiaHerald.jpgమదనపల్లె జంట హత్యల ఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ హత్య కేసుల విచారణలో దిమ్మతిరిగే వాస్తవాలు బయటపడుతున్నాయి. ఈ ఘటనలో ఇద్దరు యువతులను సొంత తల్లిదండ్రులే దారుణంగా చంపిన సంగతి తెలిసిందే. అయితే.. అంతా పెద్దమ్మాయి డైరెక్షన్లోనే..ఈ హత్యలు జరిగినట్టు తెలుస్తోంది. పెద్దమ్మాయి అలేఖ్య తల్లిదండ్రులను పూర్తిగా నమ్మించి ఈ హత్యలకు కారణమైనట్టు తెలుస్తోంది. పోలీసుల రిమాండ్ రిపోర్టు ప్రకారం.. అసలేం జరిగిందంటే.. రెండు వారాల క్రితం పెంపుడు కుక్కతో బయటకు వెళ్లిన చిన్నకూతురు సాయి దివ్య.madanapalle-murders;alekhya;korcha;police;aqua;murder.;neem;madanapalle;divya bhatnagarమదనపల్లె హత్యల్లో మైండ్‌ బ్లోయింగ్‌ ఫాక్ట్స్‌ : అసలు జరిగింది ఇదీ..!?మదనపల్లె హత్యల్లో మైండ్‌ బ్లోయింగ్‌ ఫాక్ట్స్‌ : అసలు జరిగింది ఇదీ..!?madanapalle-murders;alekhya;korcha;police;aqua;murder.;neem;madanapalle;divya bhatnagarFri, 29 Jan 2021 05:00:00 GMTమదనపల్లె జంట హత్యల ఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ హత్య కేసుల విచారణలో దిమ్మతిరిగే వాస్తవాలు బయటపడుతున్నాయి. ఈ ఘటనలో ఇద్దరు యువతులను సొంత తల్లిదండ్రులే దారుణంగా చంపిన సంగతి తెలిసిందే. అయితే.. అంతా పెద్దమ్మాయి డైరెక్షన్లోనే..ఈ హత్యలు జరిగినట్టు తెలుస్తోంది. పెద్దమ్మాయి అలేఖ్య  తల్లిదండ్రులను పూర్తిగా నమ్మించి ఈ హత్యలకు కారణమైనట్టు తెలుస్తోంది.


పోలీసుల రిమాండ్ రిపోర్టు ప్రకారం.. అసలేం జరిగిందంటే.. రెండు వారాల క్రితం పెంపుడు కుక్కతో బయటకు వెళ్లిన చిన్నకూతురు సాయి దివ్య.. బయట ఏదో ముగ్గు తొక్కినట్లు అనుమానపడింది. అప్పటి నుంచితాను చనిపోతానంటూ భయంతో ఏడుస్తూ ఉండేది. అంత బాధగా ఉంటే చనిపోవాలని...తాను మళ్లీ బతికిస్తానని అలేఖ్య రెచ్చగొట్టింది. ఈ నేపథ్యంలోనే ఈ నెల 23వ తేదీన భూత వైద్యుడితో తల్లిదండ్రులు పురుషోత్తం నాయుడు, పద్మజ దివ్యకు తాయెత్తులు కట్టించారు.


అయినా ఈ నెల 24న మధ్యాహ్నం దివ్య తాను చనిపోతానంటూ ఏడుస్తూ ఇంట్లో మేడపైన ఉన్న తన గదిలోకి వెళ్లింది. తల్లిదండ్రులు, అలేఖ్య మధ్యాహ్నం ఒంటి గంట సమయంలో గదిలోకి వెళ్లి దివ్యకు వేపాకులతో మంత్రాలు చేశారు. అయినా కూడా దివ్య ఇంకా గట్టిగా ఏడవడం ప్రారంభించడంతో ఇక లాభం లేదనుకుని తల్లిదండ్రులు డంబెల్‌ తలపై మోది చంపేశారు. తర్వాత శూలంతో పొడిచి.. ముఖాన్ని చెక్కేశారు.  
         

ఇది జరిగిన నాలుగు గంటల తర్వాత సాయంత్రం 5 గంటల సమయంలో దివ్యను చంపినట్లుగానే తనను కూడా చంపెయ్యాలని అలేఖ్య తల్లిదండ్రులను కోరింది.  తాను కూడా చనిపోయి చెల్లి దివ్యను తీసుకొస్తానని తల్లిదండ్రులను కోరింది. తాను పునర్జన్మలపై ప్రయోగాలు చేశానని.. కుక్కను ఇలాగే చంపేసి బతికించానని తల్లిదండ్రులకు అలేఖ్య నమ్మబలికింది.  తర్వాతపూజ గదిలోకి వెళ్లి గుండు కొట్టుకుని, బట్టలన్నీ విప్పేసి.. ఒక చీర వంటి బట్టను ధరించింది.                

అనంతరం నవ ధాన్యాలు పోసిన రాగి చెంబున నోట్లో పెట్టుకుని పూజ గదిలో కూర్చుంది. తర్వాత కొన్ని పూజలు చేసిన తర్వాత సాయంత్రం 5 గంటల సమయంలో అలేఖ్యను దివ్య మాదిరిగానే డంబెల్స్ తో కొట్టి తల్లిదండ్రులు చంపారు. ఇలా,చెల్లిని తల్లిదండ్రులతో కలిసి చంపిన అలేఖ్య..చనిపోయిన దివ్యను తీసుకొస్తానని తల్లిదండ్రుల చేతిలో హతమైంది.




హెరాల్డ్ ఎమ్మెల్యే ప్రోగ్రెస్: స్పీకర్‌కు బామ్మర్ది దెబ్బ వేస్తారా?

కుక్క కోసం నేషనల్ హాలీడే ప్రకటించిన దేశాధ్యక్షుడు.. ఎందుకంటే..!?

హమ్మయ్య .... మొత్తానికి జేజమ్మ దర్శనం ... ఇదే అభిమానుల ఆనందానికి నిదర్శనం .....??

పవన్, క్రిష్ సినిమాలో నిధి ఎలా ఫైనల్ అయ్యిందో తెలుసా?

ఇక నా పెళ్లి అప్పుడే..కుండబద్దలు కొట్టేసిన యాంకర్ ప్రదీప్

ఆ టీడీపీ ఫైర్‌బ్రాండ్‌ను జ‌గ‌న్ ఇలా టార్గెట్ చేశారా ?

క్షణం క్షణం సినిమా సమయంలో శ్రీదేవి జీవితంలో జరిగిన అతి పెద్ద సంఘటన




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chakravarthi Kalyan]]>