PoliticsM N Amaleswara raoeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_analysis/tdp21fd613c-4709-4b9a-a621-3ab8f3ad5c06-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_analysis/tdp21fd613c-4709-4b9a-a621-3ab8f3ad5c06-415x250-IndiaHerald.jpgఏపీలో పంచాయితీ పోరు ఎట్టకేలకు మొదలైన విషయం తెలిసిందే. పంచాయితీ పోరులో సత్తా చాటాలని అన్ని రాజకీయ పార్టీలు చూస్తున్నాయి. ముఖ్యంగా అధికార వైసీపీ, ప్రతిపక్ష టీడీపీలు హోరాహోరీగా తలపడనున్నాయి. అయితే అధికారంలో ఉండటం వల్ల వైసీపీదే పైచేయి అయ్యేలా కనిపిస్తోంది. కానీ కొన్నిచోట్ల టీడీపీ కూడా స్ట్రాంగ్‌గా ఉంది. పంచాయితీ ఎన్నికల్లోనే వైసీపీ ఎమ్మెల్యేలకు చెక్ పెట్టేలా టీడీపీ నేతలు వ్యూహాలు రచిస్తున్నారు. tdp;prasad;krishna river;2019;district;capital;assembly;mla;minister;cycle;cheque;krishna district;tdp;ycp;penamaluru;party;bode prasad;savariజగడ్డ: మాజీ మంత్రికి సైకిల్ నాయకుడు గట్టి దెబ్బ కొట్టేలా ఉన్నారే?జగడ్డ: మాజీ మంత్రికి సైకిల్ నాయకుడు గట్టి దెబ్బ కొట్టేలా ఉన్నారే?tdp;prasad;krishna river;2019;district;capital;assembly;mla;minister;cycle;cheque;krishna district;tdp;ycp;penamaluru;party;bode prasad;savariFri, 29 Jan 2021 02:00:00 GMTవైసీపీ, ప్రతిపక్ష టీడీపీలు హోరాహోరీగా తలపడనున్నాయి. అయితే అధికారంలో ఉండటం వల్ల వైసీపీదే పైచేయి అయ్యేలా కనిపిస్తోంది. కానీ కొన్నిచోట్ల టీడీపీ కూడా స్ట్రాంగ్‌గా ఉంది. పంచాయితీ ఎన్నికల్లోనే వైసీపీ ఎమ్మెల్యేలకు చెక్ పెట్టేలా టీడీపీ నేతలు వ్యూహాలు రచిస్తున్నారు.

ఈ క్రమంలోనే కృష్ణా జిల్లా పెనమలూరు నియోజకవర్గంలో టీడీపీ నేత బోడే ప్రసాద్, మాజీ మంత్రి, ఎమ్మెల్యే పార్థసారథికి చెక్ పెట్టడమే లక్ష్యంగా పనిచేస్తున్నారు. 2014 అసెంబ్లీ ఎన్నికల్లో పెనమలూరులో బోడే ప్రసాద్ భారీ మెజారిటీతో గెలిచి ఎమ్మెల్యే అయ్యారు. అయితే 2019 ఎన్నికల్లో మాత్రం ఊహించని విధంగా బోడే, పార్థసారథి చేతిలో ఓటమి పాలయ్యారు.

పైగా వైసీపీ అధికారంలోకి రావడంతో సారథి పెనమలూరులో ఆధిపత్యం చెలాయిస్తున్నారు. పంచాయితీ ఎన్నికల్లో వైసీపీకి మెజారిటీ స్థానాలు దక్కేలా చేయాలని చూస్తున్నారు. ప్రభుత్వ పథకాలు ఎమ్మెల్యేకు ప్లస్ అవుతున్నాయి. కానీ నియోజకవర్గంలో పథకాలు తప్పా, వేరే కార్యక్రమాలు ఏమి జరగడం లేదు. గతంలో బోడే ప్రసాద్ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు నియోజకవర్గంలో మంచిగా అభివృద్ధి జరిగింది.

ఆ అభివృద్ధిని గుర్తు చేస్తూనే సారథికి చెక్ పెట్టాలని ప్రసాద్ చూస్తున్నారు. ఇప్పటికే ప్రసాద్ నియోజకవర్గంలో గట్టిగా కష్టపడుతున్నారు. ఓడిపోయిన దగ్గర నుంచి పార్టీ బలోపేతానికి కృషి చేస్తున్నారు. నియోజకవర్గంలో సమస్యలపై పోరాటం చేస్తున్నారు. పైగా రాజధాని అమరావతికి పెనమలూరు దగ్గరగా ఉంటుంది. ఇది కూడా బోడేకు ప్లస్ అవుతుంది. దీని బట్టి చూస్తే మెజారిటీ పంచాయితీల్లో సైకిల్ సవారీ జరిగేలా ఉంది. కాకపోతే అధికార వైసీపీ ఏదైనా చేయొచ్చు. సైకిల్ ప్రభావం ఉన్న పంచాయితీలని అధికార బలంతో మార్చే అవకాశం కూడా లేకపోలేదు. మరి చూడాలి మాజీ మంత్రికి సైకిల్ నాయకుడు చెక్ పెట్టగలరో లేదో.




కుక్క కోసం నేషనల్ హాలీడే ప్రకటించిన దేశాధ్యక్షుడు.. ఎందుకంటే..!?

హమ్మయ్య .... మొత్తానికి జేజమ్మ దర్శనం ... ఇదే అభిమానుల ఆనందానికి నిదర్శనం .....??

పవన్, క్రిష్ సినిమాలో నిధి ఎలా ఫైనల్ అయ్యిందో తెలుసా?

ఇక నా పెళ్లి అప్పుడే..కుండబద్దలు కొట్టేసిన యాంకర్ ప్రదీప్

ఆ టీడీపీ ఫైర్‌బ్రాండ్‌ను జ‌గ‌న్ ఇలా టార్గెట్ చేశారా ?

క్షణం క్షణం సినిమా సమయంలో శ్రీదేవి జీవితంలో జరిగిన అతి పెద్ద సంఘటన

హీరో అల్లరి నరేష్ భార్య ఇప్పుడు ఏం చేస్తుందో తెలుసా..??




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - M N Amaleswara rao]]>