PoliticsMADDIBOINA AJAY KUMAReditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/vijaya-shanthib07d554a-952a-44b5-a08e-582587d1e9e0-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/vijaya-shanthib07d554a-952a-44b5-a08e-582587d1e9e0-415x250-IndiaHerald.jpgతెలంగాణ మంత్రి కేటీఆర్ నిన్న విద్యుత్ కార్మిక సంఘం సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా. కేటీఆర్ మాట్లాడుతూ...ఇప్పటికే ఒక లక్షా ముప్పై వేల ఉద్యోగాలు భర్తీ చేశామని..మరో 50 వేల ఉద్యోగాలు త్వరలోనే భర్తీ చేస్తామని హామీ ఇచ్చారు. గత ఎన్నికల మ్యానిఫెస్టోలో ఉన్న అన్ని హామీలను ప్రభుత్వం నెరవేర్చుతోందని..ఎన్నికల మ్యానిఫెస్టోలో ఉన్న మరిన్నిvijaya shanthi;ktr;amala akkineni;nagarjuna akkineni;vijayashanti;ramu;tiru;vidya;vyjayanthi;bharatiya janata party;telangana;congress;chief minister;electricity;minister;central governmentనిరుద్యోగభృతి ప్రకటన పై రాములమ్మ సంచలన వ్యాఖ్యలు...75 వేలు ఇవ్వండినిరుద్యోగభృతి ప్రకటన పై రాములమ్మ సంచలన వ్యాఖ్యలు...75 వేలు ఇవ్వండిvijaya shanthi;ktr;amala akkineni;nagarjuna akkineni;vijayashanti;ramu;tiru;vidya;vyjayanthi;bharatiya janata party;telangana;congress;chief minister;electricity;minister;central governmentFri, 29 Jan 2021 13:37:50 GMTతెలంగాణ మంత్రి కేటీఆర్ నిన్న  విద్యుత్ కార్మిక సంఘం సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా. కేటీఆర్ మాట్లాడుతూ...ఇప్పటికే ఒక లక్షా ముప్పై వేల ఉద్యోగాలు భర్తీ చేశామని..మరో 50 వేల ఉద్యోగాలు త్వరలోనే భర్తీ చేస్తామని హామీ ఇచ్చారు. గత ఎన్నికల మ్యానిఫెస్టోలో ఉన్న అన్ని హామీలను ప్రభుత్వం నెరవేర్చుతోందని..ఎన్నికల మ్యానిఫెస్టోలో ఉన్న మరిన్ని హామీలను కూడా త్వరలోనే అమలు చేస్తామని కేటీఆర్ అన్నారు. అంతే కాకుండా త్వరలోనే నిరుద్యోగ భృతిపై కేటీఆర్ సానుకూలంగా స్పందించారు. త్వరలోనే ప్రకటిస్తామని అన్నారు. ఇక తాజాగా కేటీఆర్ చేసిన నిరుద్యోగ భృతి ప్రకటన పై బీజేపీ నేత విజయ శాంతి స్పందించారు. "నిరుద్యోగుల భృతి పై ఈ రోజు మున్సిపల్ శాఖా మంత్రి కేటీఆర్ గారు స్పందిస్తూ త్వరలో స్పష్టత వస్తుందని తెలియజేశారు. ముఖ్యమంత్రి లేదా ఆర్థికమంత్రి ప్రకటించకపోయినా... ప్రస్తుత టీఆరెస్ ప్రభుత్వ పరిస్థితుల దృష్ట్యా ఆ ప్రకటనకు విలువ ఉంటుంది. అయితే, నిరుద్యోగులకిచ్చిన హామీ ప్రకారం ఇప్పటికే ఒకొక్కరికీ సుమారుగా రూ.75 వేలు ఈ ప్రభుత్వం బాకీ ఉన్నట్టు తేలింది. మొదట దానిని చెల్లించి, తర్వాత మిగతా ముచ్చట్లు చెబితే మంచిది. అది విడిచి, ఏదో గారడీ కార్యక్రమం మళ్లా మొదలుపెడితే నిరుద్యోగుల తిరుగుబాటు, ఉద్యమాలను ఎదుర్కునేందుకు తెలంగాణ సర్కారు సిద్ధపడాల్సి రావచ్చు. దుబ్బాక, జీహెచ్ఎంసీలలో బీజేపీ గెలుపు ఫలితాలతోనే ఇంత కదలిక కనబడుతున్నదంటే... రానున్న నాగార్జున సాగర్ ఉపఎన్నిక, కార్పోరేషన్లు, ఎమ్మెల్సీ ఎన్నికలలో గట్టిగా కర్రు కాల్చి ఈ కారు సర్కారుకు ఇంకొంత వాత పెడితే మరికొంత చలనం కలిగే అవకాశం ఉండచ్చు." అంటూ విజయబశాంతి పేర్కొన్నారు. ఇదిలా ఉండగా విజయశాంతి ఇటీవలే కాంగ్రెస్ పార్టీని వీడి బీజేపీలోకి చేరింది. కాంగ్రెస్ లో ఉన్నటినుండే వైజయంతి టిఆర్ఎస్ పై విమర్శలు గుప్పించేది. ఇక ప్రస్తుతం కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీలోకి చేరడంతో విమర్శల పదును మరింత పెంచింది.


కూతురు గురించి అలా మాట్లాడి షాక్ ఇచ్చిన కమలహాసన్...?

'నారప్ప' షాకింగ్ అప్ డేట్ : ఇది అసలు ఊహించనే లేదే.... !!

ప్ర‌కాశంలో జ‌గ‌నోరి మామకు మామూలు క‌ష్టాలు కాదుగా...?

జగడ్డ: నిమ్మగడ్డ సారూ..."టెంపరరీ మైగ్రేటెడ్‌" క్లాజ్ కింద ఓటు వేస్తారా...?

జగడ్డ : విశాఖలో ఏకగ్రీవాలు చెల్లవు...?

జగడ్డ : బాబోరి పార్టీ మీద నిమ్మగడ్డ యాక్షన్...?

యాంక‌ర్ ప్ర‌దీప్‌తో పెళ్లి ఆగిపోవ‌డానికి కార‌ణం చెప్పిన ఙ్ఞానేశ్వ‌రి...!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - MADDIBOINA AJAY KUMAR]]>