PoliticsChakravarthi Kalyaneditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/jagan-nimmagadda-electionb8851945-749d-42ba-970d-3562281f0be2-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/jagan-nimmagadda-electionb8851945-749d-42ba-970d-3562281f0be2-415x250-IndiaHerald.jpgఏపీలో పంచాయతీ ఎన్నికల సందడి మొదలైంది. తొలిదశ కూడా ప్రారంభమైంది. అయినా సరే.. జగన్ సర్కారు ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డపై కోపం తగ్గలేదు. కయ్యానికి ఇంకా కాలుదువ్వుతూనే ఉందనిపిస్తోంది. ఎందుకంటే.. పంచాయితీరాజ్ శాఖ ముఖ్యకార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది, కమిషనర్ గిరిజా శంకర్ లపై ఎస్ఈసీ మొన్న ఇచ్చిన అభిశంసన ప్రోసీడింగ్స్ ను వెనక్కు పంపాల్సిందిగా కేంద్రానికి జగన్ సర్కారు లేఖ రాసింది. ఈ మేరకు కేంద్ర సిబ్బంది వ్యవహారాల శాఖ కార్యదర్శికి ఏపీ సీఎస్ ఆదిత్యనాధ్ దాస్ లేఖ రాశారు. ఈ లేఖలో నిమ్మగడ్డ తీరుపై కేంద్రానికిjagan-nimmagadda-election;shankar;jagan;andhra pradesh;bhuma akhila priya;panchayati;letter;central governmentజగడ్డ: నిమ్మగడ్డతో మళ్లీ కయ్యానికి జగనోరు సిద్ధం..?జగడ్డ: నిమ్మగడ్డతో మళ్లీ కయ్యానికి జగనోరు సిద్ధం..?jagan-nimmagadda-election;shankar;jagan;andhra pradesh;bhuma akhila priya;panchayati;letter;central governmentFri, 29 Jan 2021 10:00:00 GMTపంచాయతీ ఎన్నికల సందడి మొదలైంది. తొలిదశ కూడా ప్రారంభమైంది. అయినా సరే.. జగన్ సర్కారు ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డపై కోపం తగ్గలేదు. కయ్యానికి ఇంకా కాలుదువ్వుతూనే ఉందనిపిస్తోంది. ఎందుకంటే.. పంచాయితీరాజ్ శాఖ ముఖ్యకార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది, కమిషనర్ గిరిజా శంకర్ లపై ఎస్ఈసీ మొన్న ఇచ్చిన అభిశంసన ప్రోసీడింగ్స్ ను వెనక్కు పంపాల్సిందిగా కేంద్రానికి జగన్ సర్కారు లేఖ రాసింది. ఈ మేరకు కేంద్ర సిబ్బంది వ్యవహారాల శాఖ కార్యదర్శికి ఏపీ సీఎస్ ఆదిత్యనాధ్ దాస్ లేఖ రాశారు.

ఈ లేఖలో నిమ్మగడ్డ తీరుపై కేంద్రానికి చాలా ఫిర్యాదులు చేశారు. ఇద్దరు ఉన్నతాధికారులపై డీవోపీటీకి ఎస్ఈసీ అవమానకర రీతిలో ఫిర్యాదు చేశారని సీఎస్ లేఖలో రాశారు. పంచాయితీ ఎన్నికల్లో ఓటర్ల జాబితాను సవరించకపోటాన్ని కారణంగా చూపిస్తూ సెన్సూర్ ప్రోసీడింగ్స్ జారీ చేశారని...
అఖిల భారత సర్వీసు అధికారుల నుంచి వివరణ కూడా కోరకుండా వారిపై సెన్సూర్ ప్రోసీడింగ్స్ జారీ చేయటం రాష్ట్ర ప్రభుత్వ అధికార పరిధిలోకి అతిక్రమించటమేనని సీఎస్‌ లేఖలో రాశారు.

సెన్సూర్ అంశం తక్కువస్థాయి ఉల్లంఘన కిందకు వస్తుందని... ఈ అంశం రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోకి వస్తుందని.. ఇద్దరు ఉన్నతాధికారులకూ తప్పనిసరి ఉద్యోగవిరమణ చేసేలా చూడాలంటూ సిబ్బంది వ్యవహారాల శాఖకు లేఖ రాయటం తీవ్ర ఆక్షేపణీయమని సీఎస్‌ ఆదిత్యానాథ్ దాస్ రాశారు. ఎస్ఈసీ అధికార పరిధిని మించి సెన్సూర్ ప్రోసీడింగ్స్ ను జారీ చేయటం సరికాదని.. స్వల్ప స్థాయి ఉల్లంఘనల్ని సర్వీసు రికార్డ్సుల్లో నమోదు చేయాల్సిందిగా ఎస్ఈసీ డీఓపీటీకి లేఖరాయటం రాష్ట్ర ప్రభుత్వ అధికార పరిధిలోకి చొరబడటమేనని సీఎస్ తన లేఖలో పేర్కొన్నారు.

అంతే కాదు.. నిమ్మగడ్డ ఇచ్చిన ఈ ప్రోసీడింగ్స్ ను ఏపీ ప్రభుత్వం తిరస్కరించిందని..
ఎస్ఈసీ పంపిన ఈ సెన్సూర్ ప్రోసీడింగ్స్ ను పరిగణనలోకి తీసుకోవద్దని సీఎస్‌ కేంద్రానికి విజ్ఞప్తి చేశారు. అంతే కాదు.. రాష్ట్ర ప్రభుత్వ అధికార పరిధిలోకి చొరబడటం సరికాదన్న విషయాన్ని ఎస్ఈసీకి తెలియచేయాలని కోరుతున్నానంటూ డీఓపీటీకి ఏపీ సీఎస్  అదిత్యనాధ్ దాస్ లేఖ రాశారు. ఈ వ్యవహారం పరిశీలిస్తే.. జగన్ సర్కారు కయ్యానికి సిద్ధం అన్నట్టే కనిపిస్తోంది కదా.




బొప్పాయి గింజల్లో దాగి ఉన్న ఆరోగ్య ప్రయోజనాలు, తెలిస్తే షాక్ అవుతారు...!

జగడ్డ : పేదల ఆశలతో ఆటలా..జగనోరు ??

జగడ్డ: నెల్లూరు జిల్లాలో అధికార పార్టీకి అభ్యర్థులు కరువు

జగడ్డ: జగనోరు ఇప్పటికైనా బుద్ది మార్చుకోండి.. ఎంపీ సెటైర్..

జ‌గ‌డ్డ‌: జ‌గ‌న్‌ని కాపాడుతూ... మ‌నం ఇరుక్కుంటున్నామా..!

జ‌గ‌డ్డ : నిమ్మ‌గ‌డ్డ‌కు కృష్ణా జిల్లాలోనే ఓటు ఉంటుందా..? అధికారులు జుట్టు పీక్కుంటున్నారుగా

జ‌గ‌నోరు చివ‌రి నిముషంలో వెన‌క్కి త‌గ్గారా ? ఏంటా సంచ‌ల‌న నిర్ణ‌యం..!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chakravarthi Kalyan]]>