MoviesAnilkumareditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/prabhasadbad7bc-4eb3-4cbc-a2a3-19348f38fc04-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/prabhasadbad7bc-4eb3-4cbc-a2a3-19348f38fc04-415x250-IndiaHerald.jpgపాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం రాధాకృష్ణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న రాధే శ్యామ్ అనే సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే..ఈ సినిమా ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది.. 1920 కాలంలో ఇటలీ నేపథ్యంలో సాగే ఈ సినిమాలో ప్రభాస్ సరసన పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తోంది..ఇక ఈ సినిమా తర్వాత ప్రభాస్ వరుస ప్రాజెక్టులను లైన్లో పెట్టాడు.. ఈ సినిమా అనంతరం కేజీఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్ తో ఓ సినిమా చేస్తున్నాడు ప్రభాస్... 'కె.జి.ఎఫ్‌' సినిమాతో దర్శకుడు ప్రశాంత్‌ నీల్‌, నిర్మాత విజయ్‌ కిరంగందూర్‌ జాతీయ స్థాయిలో గుర్తింprabhas;prabhas;pooja hegde;prasanth;prashanth neel;shyam;yash;india;italy;cinema;hollywood;producer;episode;industry;director;producer1;heroine;kgf;prasanth neel;indian;vemuri radhakrishna;prashant kishorప్రభాస్ 'సలార్' స్టోరీ లీక్..కేజీఎఫ్ కూడా పనికిరాదు..!!ప్రభాస్ 'సలార్' స్టోరీ లీక్..కేజీఎఫ్ కూడా పనికిరాదు..!!prabhas;prabhas;pooja hegde;prasanth;prashanth neel;shyam;yash;india;italy;cinema;hollywood;producer;episode;industry;director;producer1;heroine;kgf;prasanth neel;indian;vemuri radhakrishna;prashant kishorFri, 29 Jan 2021 15:00:00 GMTఇండియన్ స్టార్ ప్రభాస్  ప్రస్తుతం రాధాకృష్ణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న రాధే శ్యామ్ అనే సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే..ఈ సినిమా ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది.. 1920 కాలంలో ఇటలీ నేపథ్యంలో సాగే ఈ సినిమాలో ప్రభాస్ సరసన పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తోంది..ఇక ఈ సినిమా తర్వాత ప్రభాస్ వరుస ప్రాజెక్టులను లైన్లో పెట్టాడు.. ఈ సినిమా అనంతరం కేజీఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్ తో ఓ సినిమా చేస్తున్నాడు ప్రభాస్... 'కె.జి.ఎఫ్‌' సినిమాతో దర్శకుడు ప్రశాంత్‌ నీల్‌, నిర్మాత విజయ్‌ కిరంగందూర్‌ జాతీయ స్థాయిలో గుర్తింపుని సొంతం చేసుకున్నారు.
ఈ ముగ్గురి కలయికలో రూపొందనున్న మరో పాన్‌ ఇండియా చిత్రమే... 'సలార్‌'.

సినిమాను ప్రభాస్ ఫ్యాన్స్ కోరుకునే దాని కంటే భారీ స్థాయిలో ప్రశాంత్ నీల్ తెరకెక్కించబోతున్నాడు. సలార్ బొగ్గు గనుల బ్యాక్ డ్రాప్ తో తెరకెక్కిస్తున్నట్టు తెలుస్తుంది.కోల్ మైన్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతున్న సలార్ సినిమాలో ఆరు యాక్షన్ ఎపిసోడ్స్ ఉంటాయని సమాచారం. అంతేకాదు ఒక్కో యాక్షన్ సీన్ హాలీవుడ్ సినిమాలని మించి ఉంటాయని చెప్పుకుంటున్నారు. ఒక యాక్షన్ సీన్ మాత్రం దాదాపు 15 నుంచి 20 నిముషాలు ఉంటుందన్న ప్రచారం జరుగుతోంది. ఇంత పెద్ద యాక్షన్స్ ఎపిసోడ్ అంటే సలార్ ఏ రేంజ్ లో రూపొందబోతుందో ప్రభాస్ ని దర్శకుడు ప్రశాంత్ ని ఎలా చూపించబోతున్నాడో ఊహించడానికి కూడా అంతు పట్టడం లేదని ఇండస్ట్రీ వర్గాలలో వినిపిస్తున్న మాట.

యష్ నే కె.జి.ఎఫ్ లో హై ఓల్టేజ్ లో చూపించాడంటే ప్రభాస్ ని సలార్ లో చూపించే స్థాయి మాత్రం చరిత్రలో మిగిలిపోతుందని అంటున్నారు విశ్లేషకులు.. ఇక సినిమాలో ప్రభాస్ కి జోడిగా శ్రుతిహాసన్ హీరోయిన్ గా నటిస్తోంది.. తాజాగా ఈ హీరోయిన్ పుట్టినరోజు సందర్భంగా ఈ మూవీ టీమ్ విష్ చేస్తూ అధికారికంగా ప్రకటించారు..మరికొద్ది రోజుల్లో మూవీ టీమ్ తో జాయిన్ కానుంది శ్రుతిహాసన్.. ఇక ఈ సినిమాని వీలయినంత తక్కువ సమయంలోనే పూర్తి చేయాలని చూస్తున్నాడు ప్రశాంత్ నీల్..!!


చంద్రబాబు చంద్రముఖిగా మారారా!

వరుణ్ తేజ్ పెళ్లి గురించి నాగబాబు ఏంటి ఇలా చెప్పాడు...?

అనసూయతో కార్తికేయ స్పెషల్ ఐటం.. జబర్దస్త్ భామ జోరు బాగుందే..!

కాపు వేద‌న‌: ప‌్ర‌కాశం వైసీపీ నేత‌ల క‌న్నీళ్లు... ఆ కులంలో జ‌గ‌న్‌కు ఎదురు దెబ్బే...?

'నారప్ప' షాకింగ్ అప్ డేట్ : ఇది అసలు ఊహించనే లేదే.... !!

ప్ర‌కాశంలో జ‌గ‌నోరి మామకు మామూలు క‌ష్టాలు కాదుగా...?

జగడ్డ: నిమ్మగడ్డ సారూ..."టెంపరరీ మైగ్రేటెడ్‌" క్లాజ్ కింద ఓటు వేస్తారా...?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Anilkumar]]>