PoliticsSatyaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/jagan-nimmagadda-elections513b0d34-8707-4622-93d2-b1355e7249f7-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/jagan-nimmagadda-elections513b0d34-8707-4622-93d2-b1355e7249f7-415x250-IndiaHerald.jpgరాజ్యాంగం ప్రకారం కచ్చితంగా నడచుకుంటే ఎవరి పప్పులూ ఉడికే సీన్ ఎపుడూ ఎక్కడా ఉండదు, చూసీ చూడనట్లుగా ఉంటేనే ఎన్ని అయిన ఆటలు సాగుతాయి. విషయానికి వస్తే మూడు దశాబ్దాల క్రితం టీ ఎన్ శేషన్ అన్న ఎన్నికల అధికారి స్ట్రిక్ట్ గా అమలు చేస్తే తప్ప ఎన్నికల సంఘానికి ఇన్ని అధికారాలు ఉన్నాయా అన్న సంగతి దేశంలో ఎవరికీ తెలిసింది కాదు, ఇపుడు కూడా ఏపీలో నిమ్మగడ్డ రమేష్ కుమార్ తాను పూర్తి కచ్చితంగా ఉండబోతున్నారు. jagan-nimmagadda-elections;amala akkineni;kumaar;rayalaseema;local language;t n sheshan;nijam;partyజగడ్డ : మూడో కన్ను తెరచిన నిమ్మగడ్డ...మూడేది ఎవరికో...?జగడ్డ : మూడో కన్ను తెరచిన నిమ్మగడ్డ...మూడేది ఎవరికో...?jagan-nimmagadda-elections;amala akkineni;kumaar;rayalaseema;local language;t n sheshan;nijam;partyFri, 29 Jan 2021 10:30:00 GMTశేషన్ అన్న ఎన్నికల అధికారి స్ట్రిక్ట్ గా అమలు చేస్తే తప్ప ఎన్నికల సంఘానికి ఇన్ని అధికారాలు ఉన్నాయా అన్న సంగతి దేశంలో  ఎవరికీ తెలిసింది కాదు, ఇపుడు కూడా ఏపీలో నిమ్మగడ్డ రమేష్ కుమార్ తాను పూర్తి కచ్చితంగా ఉండబోతున్నారు.

అంతే కాదు, ఎన్నికలలో అక్రమాల మీద పూర్తి సీరియస్ గా ఉంటానని కుండబద్దలు కొడుతున్నారు. దాంతో ఇపుడు ఏపీలో అధికార పార్టీ నాయకులకు చమటలే పడుతున్నాయి. ఎందుకంటే విపక్షాలకు లోకల్ బాడీ ఎన్నికలో చేయడానికి పెద్దగా అవకాశాలు ఉండవు. అన్ని విధాలుగా చితికిపోయిన వారువీలు అయితే  ఎన్నికలలో పోటీ చేయడానికే చూసుకుంటారు.

ఎన్నికల సంఘం కచ్చితంగా ఉంటే అధికారంలో ఉన్న వారికే ఇబ్బందులు వస్తాయి. ఇపుడు అదను చూసి మరీ నిమ్మగ‌డ్డ రమేష్ కుమార్ రెండు రోజుల రాయలసీమ టూర్ పెట్టుకున్నారు. ఆయన ఏకంగా అక్కడ మకాం చేయబోతున్నారు. మొత్తం సీమ జిల్లాల్లో కలియదిరిగి పరిస్థితిని స్వయంగా ఆయన తెలుసుకోవాలనుకుంటున్నారు. ఈ పరిణామం అధికార పార్టీకి ఇబ్బందికరమే అంటున్నారు.

నిజంగా  చూస్తే సీమలో వైసీపీకి గట్టి బలం ఉంది. దానికి తోడు గత ఎన్నికల్లో అన్ని సీట్లూ గెలుచుకుంది. ఇక గత ఏడాది ఎంపీటీసీ జెడ్పీటీసీలలో జరిగిన ఏకగ్రీవాల్లో కూడా ఎక్కువ ఇక్కడే ఉన్నాయి. దాంతో నాడు విపక్షాలు ఎన్నికల సంఘానికి దీని మీద ఫిర్యాదులు చేశాయి కూడా అయితే ఈ లోగా ఎన్నికలు వాయిదా పడ్డాయి.

ఇపుడు చూసుకుంటే మళ్లీ పంచాయతీల్లో ఏకగ్రీవాల మీద చర్చ వస్తోంది. దాంతో సీమ మీదనే నిమ్మగడ్డ ప్రత్యేకంగా దృష్టి పెట్టారని అంటున్నారు. అక్కడే ఆయన ఏకగ్రీవాల గురించి తెలుసుకోవాలనుకుంటున్నారుట. అలాగే సజావుగా ఎన్నికలు జరిగే పరిస్థితులు కల్పించడానికే ఆయన ఈ టూర్ వేశారని అంటున్నారు. మొత్తానికి చూస్తే నిమ్మగడ్డ టూర్ ఇపుడు అతి పెద్ద చర్చగా ఉంది.




జ‌గ‌నోరిపై వైసీపీలో క‌మ్మోళ్ల కోపం మామూలుగా లేదే...!

జగడ్డ: నిమ్మగడ్డతో మళ్లీ కయ్యానికి జగనోరు సిద్ధం..?

ప‌శ్చిమ ప‌ల్లె పోరులో జ‌గ‌నోరికి పిడి దిగిపోద్దా.... పంచాయ‌తీలు పాయే...!

జ‌గ‌డ్డ‌: జ‌గ‌నోరిపై కుత‌కుత‌లాడుతోన్న రాజ‌ధాని రెడ్లు...!

జగడ్డ : పేదల ఆశలతో ఆటలా..జగనోరు ??

జగడ్డ: నెల్లూరు జిల్లాలో అధికార పార్టీకి అభ్యర్థులు కరువు

జగడ్డ: జగనోరు ఇప్పటికైనా బుద్ది మార్చుకోండి.. ఎంపీ సెటైర్..




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Satya]]>