PoliticsChakravarthi Kalyaneditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/jagancf8f113d-d686-46a0-b5a2-e04d5084484a-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/jagancf8f113d-d686-46a0-b5a2-e04d5084484a-415x250-IndiaHerald.jpgఏపీలో కొందరు అధికారుల వైఖరి వివాదస్పదం అవుతోంది. సర్వీసు రూల్స్ కూడా పట్టించుకోకుండా పని చేస్తూ కోర్టుల చేతిలో మొట్టికాయలు వేయించుకుంటున్నారు. ఇటీవలే ఏపీ డీజీపీని హైకోర్టు పిలిపించుకుని అక్షింతలు వేసింది. మరో కేసులో హైకోర్టు.. కొందరు అధికారులు చట్టం కంటే తాము ఎక్కువగా భావిస్తున్నారని కామెంట్ చేసింది. ఇక తాజా విషయానికి వస్తే.. ఓ అటెండర్ తన సర్వీసు సౌకర్యాల గురించి గతంలో హైకోర్టు ఇచ్చిన తీర్పును పై అధికారులు ఏమాత్రం పట్టించుకోలేదు. దీంతో అతడు మరోసారి కోర్టు ధిక్కరణ పిటిషన్ వేసి కోర్టును ఆశ్రయించాడjagan;gautham new;gautham;jagan;andhra pradesh;court;dogsజగన్ పాలన ఇలా?..ఆ అధికారులను అరెస్టు చేసి తీసుకురమ్మన్న కోర్టు ?జగన్ పాలన ఇలా?..ఆ అధికారులను అరెస్టు చేసి తీసుకురమ్మన్న కోర్టు ?jagan;gautham new;gautham;jagan;andhra pradesh;court;dogsFri, 29 Jan 2021 06:00:00 GMTఏపీ డీజీపీని హైకోర్టు పిలిపించుకుని అక్షింతలు వేసింది. మరో కేసులో హైకోర్టు.. కొందరు అధికారులు చట్టం కంటే తాము ఎక్కువగా భావిస్తున్నారని కామెంట్ చేసింది. ఇక తాజా విషయానికి వస్తే.. ఓ అటెండర్ తన సర్వీసు సౌకర్యాల గురించి గతంలో హైకోర్టు ఇచ్చిన తీర్పును పై అధికారులు ఏమాత్రం పట్టించుకోలేదు. దీంతో అతడు మరోసారి కోర్టు ధిక్కరణ పిటిషన్ వేసి కోర్టును ఆశ్రయించాడు.

అధికారుల తీరుపై మండిపడిన హైకోర్టు.. తక్షణం అందుకు బాధ్యులైన అధికారులపై నాన్ బెయిలబుల్ వారంట్ జారీ చేసి.. అరెస్టు చేసి తన ముందు ప్రవేశ పెట్టాలని ఆదేశించింది. దాంతో అప్పటికప్పుడు వారు కోర్టు ముందు ప్రత్యక్షమయ్యారు. వారిపై తీవ్రంగా ఆగ్రహించిన కోర్టు.. కుక్క చీవాట్లు పెట్టింది. అంతే కాకుండా.. తనను పిటిషన్ విత్‌ డ్రా చేసుకోమని బెదిరిస్తున్నారని సదరు అటెండర్ వాదించగా.. హైకోర్టు అధికారులపై మండిపడింది. మరోసారి ఇలాంటి కంప్లయింట్ వస్తే బావుండదని వార్నింగ్ ఇచ్చేసింది.

జగన్ సర్కారులో ఇలా అధికారులు ఎక్కవగా విమర్శల పాలవుతున్నారు. డీజీపీ గౌతం సవాంగ్‌ వంటి వారువ్యక్తిగతంగా మంచి పేరు ఉన్నా ఇటీవల ఆయన తరచూ హైకోర్టు మెట్లు ఎక్కుతున్నారు.. కిందిస్థాయి సిబ్బంది చేసే తప్పుల కారణంగా ఆయన పరువు గంగలో కలుస్తోంది. ఇప్పటికే రెండు, మూడు సార్లు కోర్టు మెట్లెక్కిన ఆయన మొన్న మరోసారి హైకోర్టు ముందు హాజరయ్యారు. న్యాయస్థానం ఆదేశాలిచ్చినా ఉన్నతాధికారులు పట్టించుకోవడం లేదని.. రామారావు అనే ఉద్యోగి కోర్టు ధిక్కరణ పిటిషన్ దాఖలు చేశారు. పిటిషన్‌పై విచారణ చేపట్టిన న్యాయస్థానం డీజీపీ గౌతమ్ సవాంగ్, హోం శాఖ కార్యదర్శి, ఐజీ మహేష్‌చంద్ర లడ్డా, ఏలూరు డీఐజీని కోర్టుకు హాజరుకావాలని ఉత్తర్వుల జారీ చేసింది. 


దొండకాయ తినడం వలన ఎన్ని ప్రయోజనాలో తెలుసా..!?

కుక్క కోసం నేషనల్ హాలీడే ప్రకటించిన దేశాధ్యక్షుడు.. ఎందుకంటే..!?

హమ్మయ్య .... మొత్తానికి జేజమ్మ దర్శనం ... ఇదే అభిమానుల ఆనందానికి నిదర్శనం .....??

పవన్, క్రిష్ సినిమాలో నిధి ఎలా ఫైనల్ అయ్యిందో తెలుసా?

ఇక నా పెళ్లి అప్పుడే..కుండబద్దలు కొట్టేసిన యాంకర్ ప్రదీప్

ఆ టీడీపీ ఫైర్‌బ్రాండ్‌ను జ‌గ‌న్ ఇలా టార్గెట్ చేశారా ?

క్షణం క్షణం సినిమా సమయంలో శ్రీదేవి జీవితంలో జరిగిన అతి పెద్ద సంఘటన




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chakravarthi Kalyan]]>