PoliticsVAMSIeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/jagan-nimmagadda-elections79c6fd81-84f3-49c2-94cd-b9b26f371d4f-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/jagan-nimmagadda-elections79c6fd81-84f3-49c2-94cd-b9b26f371d4f-415x250-IndiaHerald.jpgచంద్రబాబు విడుదల చేసిన మేనిఫెస్టోకు ఎస్ఈసీని కేంద్రంగా చూపి ఆరోపణలు చేస్తున్నారు. రాజకీయాలతో సంబంధం లేని గ్రామ పంచాయతీ ఎన్నికలకు మ్యానిఫెస్టోను ఎటువంటి అనుమతులు లేకుండా ఎలా విడుదల చేస్తారంటూ ప్రశ్నించారు. jagan-nimmagadda-elections;amala akkineni;kumaar;raj;shankar;jagan;ram madhav;district;police;panchayati;tdp;central government;ycp;research and analysis wing;v;party;gopalakrishna dwivediజగడ్డ: జగనోరు రివర్స్ ప్లాన్...టీడీపీ గుర్తును రద్దు చేయనున్నారా...?జగడ్డ: జగనోరు రివర్స్ ప్లాన్...టీడీపీ గుర్తును రద్దు చేయనున్నారా...?jagan-nimmagadda-elections;amala akkineni;kumaar;raj;shankar;jagan;ram madhav;district;police;panchayati;tdp;central government;ycp;research and analysis wing;v;party;gopalakrishna dwivediFri, 29 Jan 2021 09:00:00 GMTపంచాయతీ ఎన్నికల వివాదం ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది. అధికార పార్టీ అవును అంటే, ఎస్ ఈ సి నిమ్మగడ్డ రమేష్ కాదు అంటూ, ఇలా ఇరువురి మధ్య ఎన్నికల పంచాయతీ పీక్స్ కు చేరింది. గత కొద్ది కాలంగా నిమ్మగడ్డ రమేష్ వింత వైఖరిపై మండిపడుతున్నారు వై ఎస్ ఆర్ సి పి నేతలు. నిమ్మగడ్డ వ్యవహారం చూస్తుంటే ఏపీలో  టిడిపిని పునర్నిర్మించేందుకు కసరత్తులు చేస్తున్నారు అంటూ అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో నిమ్మగడ్డ రమేష్ కుమార్ అధికారులపై తీసుకున్న చర్యలను అమలు చేసేందుకు ప్రభుత్వం నిరాకరించడం చర్చనీయాంశంగా మారింది.

పంచాయతీ రాజ్ శాఖ ముఖ్యకార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేదీ, పంచాయతీ రాజ్ శాఖ కమిషనర్ గిరిజా శంకర్ పై అభిశంసన సిఫార్సులను ప్రభుత్వం తిరిగి పంపడం వైరల్ గా మారింది. నిమ్మగడ్డ ఇష్టానుసారం కలెక్టర్లు, ఎస్పీలు పోలీసులను బదిలీ చేయడం పట్ల అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు అధికార పార్టీ నేతలు. తమ స్వార్థం కోసం అకారణంగా ఇంత పెద్ద నిర్ణయాలు తీసుకోవడం సరికాదంటూ దుయ్యబట్టారు. అలాగే చంద్రబాబు విడుదల చేసిన మేనిఫెస్టోకు ఎస్ఈసీని కేంద్రంగా చూపి ఆరోపణలు చేస్తున్నారు. రాజకీయాలతో సంబంధం లేని గ్రామ పంచాయతీ ఎన్నికలకు మ్యానిఫెస్టో  ను ఎటువంటి అనుమతులు లేకుండా ఎలా విడుదల చేస్తారంటూ ప్రశ్నించారు.

నిమ్మగడ్డ ధర్మాన్ని పాటించే వ్యక్తి అయితే తక్షణమే ఈ అంశం పై చర్య తీసుకోవాలని డిమాండ్ చేశారు అంబటి రాంబాబు. ఇది ఎస్ఈసికి ఓ శీల పరీక్షని... ఇప్పుడు ఆయన తన శీలాన్ని నిరూపించుకునే సమయం వచ్చిందన్నారు. ఈ శీల పరీక్షకు సిద్ధం కావాలంటూ సవాల్ విసిరారు. వాస్తవానికి ఎస్ఈసీ నిమ్మగడ్డ ఏనాడో చంద్రన్నకు దాసోహం అయ్యారని.... ఇవన్నీ ఇరువురు కలిసి పన్నుతున్న పన్నాగాలని ఆరోపణలు చేశారు. ఇక చంద్రబాబు నిమ్మగడ్డల బాంధవ్యం సామాన్య మానవుడు భరించలేనిదంటూ ఎద్దేవా చేశారు. ఇప్పుడు చంద్రబాబు చేసిన పనికి టిడిపి ఎన్నికల గుర్తును రద్దు చేయాలంటూ వైసిపి నాయకులు ఎన్నికల అధికారి నిలదీస్తున్నారు. 

వీరి బంధాన్ని సరిగ్గా చెప్పాలంటే... చంద్రబాబు ఆత్మ చంద్రముఖిలా మారి నిమ్మగడ్డ రమేష్ లో ప్రవేశించిందని, అందుకే కలెక్టర్ల నుంచి, ఎస్పీల వరకు, జిల్లా అధికారుల వరకు,  అందరి మొహాల్లో మొహం పెట్టి లక లక అంటున్నారని తనదైన శైలిలో ప్రత్యర్థులపై పంచులు విసిరారు అంబటి రాంబాబు. జగన్ సర్కార్ పాటిస్తున్న సమర్థవంతమైన పాలనను చూసి ఓర్వలేని వారందరూ మూకుమ్మడిగా చేరి.... ప్రజల కోటను దాటి జగన్ ప్రభుత్వాన్ని పడగొట్టడం అంత సులువు కాదన్నారు. 


జ‌గ‌డ్డ‌: జ‌గ‌నోరిపై కుత‌కుత‌లాడుతోన్న రాజ‌ధాని రెడ్లు...!

జగడ్డ : పేదల ఆశలతో ఆటలా..జగనోరు ??

జగడ్డ: నెల్లూరు జిల్లాలో అధికార పార్టీకి అభ్యర్థులు కరువు

జగడ్డ: జగనోరు ఇప్పటికైనా బుద్ది మార్చుకోండి.. ఎంపీ సెటైర్..

జ‌గ‌డ్డ‌: జ‌గ‌న్‌ని కాపాడుతూ... మ‌నం ఇరుక్కుంటున్నామా..!

జ‌గ‌డ్డ : నిమ్మ‌గ‌డ్డ‌కు కృష్ణా జిల్లాలోనే ఓటు ఉంటుందా..? అధికారులు జుట్టు పీక్కుంటున్నారుగా

జ‌గ‌నోరు చివ‌రి నిముషంలో వెన‌క్కి త‌గ్గారా ? ఏంటా సంచ‌ల‌న నిర్ణ‌యం..!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - VAMSI]]>