MoviesMamatha Reddyeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/prabhas004dc367-335d-4d5c-b63e-586fc2236d60-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/prabhas004dc367-335d-4d5c-b63e-586fc2236d60-415x250-IndiaHerald.jpgయంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ "సలార్" సినిమాలో హీరోగా నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాకి కేజిఎఫ్ ఫేమ్ ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహిస్తున్నారు. అయితే ఈ భారీ పాన్ ఇండియా సినిమాకి సంబంధించి కొన్ని సన్నివేశాల చిత్రీకరణను రామగుండంలోని సింగరేణి ఓపెన్ కాస్ట్ లో జరపనున్నారు. prabhas;prabhas;shruti haasan;krishnam raju;prasanth;prashanth neel;hyderabad;india;godavari river;bari;cinema;police;kgf;prasanth neel;prashant kishorగోదావరిఖనిలో రెబల్ స్టార్ ప్రభాస్ ఏం చేస్తున్నాడు..బారి ర్యాలితో ఈ హంగామా ఏంటి..?గోదావరిఖనిలో రెబల్ స్టార్ ప్రభాస్ ఏం చేస్తున్నాడు..బారి ర్యాలితో ఈ హంగామా ఏంటి..?prabhas;prabhas;shruti haasan;krishnam raju;prasanth;prashanth neel;hyderabad;india;godavari river;bari;cinema;police;kgf;prasanth neel;prashant kishorFri, 29 Jan 2021 20:19:31 GMTరెబల్ స్టార్ ప్రభాస్ "సలార్" సినిమాలో హీరోగా నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాకి కేజిఎఫ్ ఫేమ్ ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహిస్తున్నారు. అయితే ఈ భారీ పాన్ ఇండియా సినిమాకి సంబంధించి కొన్ని సన్నివేశాల చిత్రీకరణను రామగుండంలోని సింగరేణి ఓపెన్ కాస్ట్ లో జరపనున్నారు. ఇటీవలే సినిమా సెట్ నిర్మాణ పనులు పూర్తి కావడం తో ప్రభాస్ గురువారం రాత్రి రామగుండం ప్రాంతానికి చేరుకున్నారు. సలార్ సినిమా లోని భారీ యాక్షన్ సీక్వెన్స్‌ను రామగుండం ప్రాంతంలోనే పది రోజుల పాటు చిత్రీకరించనున్నారు.

నిన్న రాత్రి రామగుండం ప్రాంతానికి చేరుకున్న ప్రభాస్.. సీపీ సత్యనారాయణ ను కలిశారు. అయితే ప్రభాస్ ని ఆహ్వానించిన సీపీ సత్యనారాయణ తమ పోలీసు సిబ్బందిని పరిచయం చేశారు. ఈ సందర్భంగా పోలీసులు అందరూ కూడా ప్రభాస్ తో సెల్ఫీ ఫోటోలు దిగారు. ఐతే ప్రభాస్ సీపీ కార్యాలయానికి వచ్చారు అని తెలిసుకున్న అభిమానులు అక్కడికి భారీ ఎత్తున పోటెత్తారు. అనంతరం సి పి కార్యాలయం నుంచి బయలుదేరిన ప్రభాస్ నేరుగా గోదావరిఖని లోని షూటింగ్ స్పాట్ కి చేరుకున్నారు. ప్రభాస్ ని పోలీసులు కాన్వాయ్ తో షూటింగ్ స్పాట్ కి జాగ్రత్తగా చేర్చారు. అలాగే షూటింగ్ స్పాట్ లో ప్రభాస్ కి పోలీసులు కట్టుదిట్టమైన భద్రతను కల్పించారు.

అయితే ప్రభాస్ గోదావరి ఖని కి చేరుకున్నారని తెలుసుకున్న అభిమానులు అక్కడికి కూడా భారీ ఎత్తున తరలివచ్చారు. ఆ ప్రాంతంలో ప్రభాస్ ఫ్లెక్సీలను వందల సంఖ్యలో ఏర్పాటు చేశారు. ఇకపోతే ఈ సినిమాకి సంబంధించిన షూటింగ్ మొదటిగా హైదరాబాద్ లో ప్రారంభం అయ్యింది. భారీ అంచనాలు నెలకొన్న సలార్ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ కూడా విడుదలై అంచనాలను తారాస్థాయికి తీసుకెళ్లింది. ఈ సినిమాలో ప్రభాస్ సరసన శృతిహాసన్ నటించనున్నారు. మరి ప్రశాంత్ నీల్, ప్రభాస్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న ఈ యాక్షన్ డ్రామా ప్రేక్షకులను ఎంతగా అలరిస్తుందో చూడాలి.


రసమయి మరో బాంబ్

బ్రాహ్మణ ఘోష : భ్రాహ్మణులపై ప్రభుత్వాల వైఫల్యమే కారణమా..!!

కాపు వేద‌న‌: కాపులు ఈ ప‌నిచేస్తే రాజ్యాధికారం ప‌క్కానా ?

బ్రాహ్మణ ఘోష: జగనోరికి బ్రాహ్మణ గోష్ఠ తప్పదు...?

బ్రాహ్మణ ఘోష : బ్రాహ్మణులకు ప్రభుత్వం ఉపాధి కల్పించాలి....

‘30 రోజుల్లో ప్రేమించడం ఎలా..?’ ఎలా ఉందంటే..

బిగ్ బ్రేకింగ్ : 'ఆచార్య' టీజర్ రిలీజ్ - మాటల్లేవ్ మాట్లాడుకోవడాల్లేవ్ .....!!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Mamatha Reddy]]>