MoviesSatyaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/balayya589d0ab8-a37b-4b52-801a-4a2473e4ae4f-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/balayya589d0ab8-a37b-4b52-801a-4a2473e4ae4f-415x250-IndiaHerald.jpgటాలీవుడ్ ఇపుడు జోరు పెంచింది. కరోనా పీడ కల ఇపుడే చెదిరి కొత్త కళలను టాలీవుడ్ అద్దుకుంటోంది. ఇక టాలీవుడ్ కి ఈ సంక్రాంతి బాగా కలసివచ్చింది. కాసులు కూడా బాగానే రాలాయి. దాంతో వరసబెట్టి క్యూ కట్టి మరీ సినిమాలు రెడీ అవుతున్నాయి. థియేటర్ల ఆక్యుపెన్సీ కి కూడా ఫిఫ్టీ పెర్సెంట్ షరతు తీసేయడంతో పెద్ద సినిమాలే వచ్చేస్తున్నాయి. balayya;balakrishna;boyapati srinu;kranthi;kranti;pawan kalyan;sekhar;dussehra;makar sakranti;kamma;tollywood;cinema;sankranthi;love;vijayadashami;nandamuri taraka rama rao;narappa;love storyబాలయ్య...బోయపాటి.. సౌండ్ లేదేంటి...?బాలయ్య...బోయపాటి.. సౌండ్ లేదేంటి...?balayya;balakrishna;boyapati srinu;kranthi;kranti;pawan kalyan;sekhar;dussehra;makar sakranti;kamma;tollywood;cinema;sankranthi;love;vijayadashami;nandamuri taraka rama rao;narappa;love storyFri, 29 Jan 2021 12:00:00 GMTటాలీవుడ్ ఇపుడు జోరు పెంచింది. కరోనా పీడ కల ఇపుడే చెదిరి కొత్త కళలను టాలీవుడ్ అద్దుకుంటోంది. ఇక టాలీవుడ్ కి ఈ సంక్రాంతి బాగా కలసివచ్చింది. కాసులు కూడా బాగానే రాలాయి. దాంతో వరసబెట్టి  క్యూ కట్టి మరీ సినిమాలు రెడీ అవుతున్నాయి. థియేటర్ల ఆక్యుపెన్సీ కి కూడా ఫిఫ్టీ పెర్సెంట్ షరతు తీసేయడంతో పెద్ద సినిమాలే వచ్చేస్తున్నాయి.

మోస్ట్ అవైటింగ్ మూవీస్ అన్నీ కూడా సమ్మర్ దసరా స్లాట్స్ బుక్ చేసేసుకుంటున్నాయి. ఎన్నడూ లేని విధంగా సినిమా షూటింగ్ దశలో ఉండగానే రిలీజ్ డేట్ ప్రకటించేస్తున్నారు. దానికి కారణం ఇతర సినిమాలతో క్లాష్ తో పాటు థియేటర్లు కూడా సర్దుబాటు కావు అన్న ముందు చూపు. వీలైతే సోలోగా రావాలన్నది ఒక ఆలోచన. లేకపోయినా కనీసం వన్ వీక్ అయినా దున్నేసేలా పక్కా ప్లాన్ పెట్టుకుని సినిమాలు రిలీజ్ చేస్తున్నారు.

మరి ఇవన్నీ ఇలా ఉంటే నందమూరి ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న మూవీ బోయపాటి బాలయ్యలది. పైగా ఇద్దరికీ హ్యాట్రిక్ మూవీ. ఈ మూవీ విషయంలో ఇప్పటిదాకా ఏ రకమైన అప్ డేట్ లేకపోవడంతో ఫ్యాన్స్ కంగారు పడుతున్నారు. ఆ మధ్యన వినిపించిన మాటలను బట్టి చూస్తే ఏప్రిల్ లో సినిమా రిలీజ్ ఉంటుందని. అంటే ఉగాదికి రిలీజ్ చేస్తారని భావించారు.

కానీ ఇపుడు చూస్తే ఏప్రిల్ లో ఖాళీ లేకుండా కొత్త మూవీస్ రిలీజ్ తో కిటకిటలాడుతోంది. ఏప్రిల్ 9న పవర్ స్టార్ వకీల్ సాబ్ తో వస్తున్నాడు. 17న శేఖర్ కమ్ముల  లవ్ స్టోరీ రెడీ టూ రిలీజ్ అంటున్నారు. మిగిలిన సినిమాలు కూడా చాలా ఏప్రిల్ చివరి దాకా ఉన్నాయి. మరి బాలయ్య బోయపాటి కనుక వస్తే గిస్తే మే లో రావాలి. కానీ మేలో కూడా చాలా పెద్ద సినిమాలే పడుతున్నాయి. ఆచార్య మూవీతో పాటు రాధేశ్యామ్, నారప్ప వంటికి క్యూ కట్టేసాయి అంటున్నారు. అన్ని సినిమాలు రిలీజ్ డేట్లు ప్రకటిస్తూంటే బాలయ్య బోయపాటి మాత్రం సౌండ్ చేయకపోవడం పట్ల ఫ్యాన్స్ అసహనం వ్యక్తం చేస్తున్నారు. మరి ఇప్పటికైనా రిలీజ్ డేట్ కొడతారా.




పంచాయతీ ఎన్నికలపై విద్యార్థిని మరో పిటిషన్.. హైకోర్టు కీలక వ్యాఖ్యలు

జ‌గ‌నోరు అక్క‌డ మీ పార్టీ ఎమ్మెల్యే ఎవ‌రో మీకైనా తెలుసా...?

'ఆర్ఆర్ఆర్' నుండి 'ఒలీవియా మోరిస్' ఫస్ట్ లుక్ రిలీజ్ - అబ్బబ్బబ్బా అదుర్స్ అంతే ....!!

జ‌గ‌నోరు ఊహించ‌లేదు.. బాబోరు ఇలా చేస్తార‌ని..!!

జగడ్డ: మొబైల్ యాప్ తో భయపెడుతున్న నిమ్మగడ్డ..

జగడ్డ : సీమ మీద నిమ్మగడ్డ స్పెషల్ ఫోకస్.. నేడు రేపు అక్కడే..అదే అసలు రీజన్ !

భారీ అప్ డేట్ : ప్రభాస్ - నాగ అశ్విన్ మూవీ లో మ్యూజిక్ డైరెక్టర్ గా ఆయన ఫిక్స్ ...!!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Satya]]>