PoliticsGiddaluri Srinivasa Raoeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/74/jagan-nimmagadda-electionse1d87386-bb01-43a8-bb27-c9050259a851-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/74/jagan-nimmagadda-electionse1d87386-bb01-43a8-bb27-c9050259a851-415x250-IndiaHerald.jpgనిమ్మగడ్డ రమేష్ కుమార్ హయాంలో ఎన్నికలు అంటేనే.. అధికార పక్షం హడలిపోతోంది. ఆయన పదవీకాలం పూర్తయిన తర్వాతే స్థానిక ఎన్నికలకు వెళ్లాలని ఇప్పటి వరకూ అనుకున్నా అది కుదరకపోయే సరికి తప్పనిసరి పరిస్థితుల్లో పంచాయతీ పోరుకి సిద్ధమైంది వైసీపీ. అయితే ఆదినుంచీ అందరిలో ఒకటే అనుమానం. అసలు నిమ్మగడ్డ హయాంలో వైసీపీ ఎందుకు ఎన్నికలకు భయపడుతోంది? ఎన్నికలు ఎప్పుడొచ్చినా గెలుపు మాదేనని చెప్పుకుంటున్న అధికార పార్టీ నిమ్మగడ్డని చూసి ఎందుకు వెనకడుగు వేస్తోంది? దీనికి కారణం ఆయన చండశాసనుడు కావడమే. తాజాగా రాయలసీమ జిల్లాల పర్jagan-nimmagadda-elections;kumaar;tara;jagan;district;kadapa;police;rayalaseema;panchayati;letter;gift;local language;central government;ycp;partyజగడ్డ: మరో బాంబు పేల్చిన నిమ్మగడ్డజగడ్డ: మరో బాంబు పేల్చిన నిమ్మగడ్డjagan-nimmagadda-elections;kumaar;tara;jagan;district;kadapa;police;rayalaseema;panchayati;letter;gift;local language;central government;ycp;partyFri, 29 Jan 2021 07:00:00 GMTకుమార్ హయాంలో ఎన్నికలు అంటేనే.. అధికార పక్షం హడలిపోతోంది. ఆయన పదవీకాలం పూర్తయిన తర్వాతే స్థానిక ఎన్నికలకు వెళ్లాలని ఇప్పటి వరకూ అనుకున్నా అది కుదరకపోయే సరికి తప్పనిసరి పరిస్థితుల్లో పంచాయతీ పోరుకి సిద్ధమైంది వైసీపీ. అయితే ఆదినుంచీ అందరిలో ఒకటే అనుమానం. అసలు నిమ్మగడ్డ హయాంలో వైసీపీ ఎందుకు ఎన్నికలకు భయపడుతోంది? ఎన్నికలు ఎప్పుడొచ్చినా గెలుపు మాదేనని చెప్పుకుంటున్న అధికార పార్టీ నిమ్మగడ్డని చూసి ఎందుకు వెనకడుగు వేస్తోంది? దీనికి కారణం ఆయన చండశాసనుడు కావడమే. తాజాగా రాయలసీమ జిల్లాల పర్యటన పెట్టుకున్న ఎస్ఈసీ అధికారపక్షం గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తున్నారు.

కరోనాకు ముందు జరిగిన ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల నామినేషన్ల పక్రియలో సీఎం జగన్ సొంత జిల్లా కడప సహా.. రాయలసీమలో ఏకగ్రీవాలు ఎక్కువగా జరిగాయి. అయితే ఇవన్నీ బలవంతపు ఏకగ్రీవాలంటూ ప్రతిపక్షాలు ఆరోపించాయి. ఎన్నికలు వాయిదా వేసేవేళ.. కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ కూడా ఇదే అనుమానాన్ని వ్యక్తం చేశారు. కేంద్ర హోంశాఖకు ఆయన రాసిన లెటర్ లో కూడా ఏకగ్రీవాల ప్రస్తావన ఉంది. తాజాగా ఏకగ్రీవాలయ్యే పంచాయతీలకు ప్రభుత్వం నజరానా పెంచడంపై కూడా నిమ్మగడ్డ గరంగరంగా ఉన్నారు. ప్రభుత్వం తరపున భారీ ప్రకటనలు ఇచ్చి, ప్రలోభాలకు గురి చేస్తున్నారంటూ మండిపడుతున్నారు. ఈ నేపథ్యంలో అసలు ఏకగ్రీవాల సంగతేంటో తేల్చుకుందామని ఆయన సీమకు బయలుదేరారు.

పంచాయతీ ఎన్నికల నిర్వహణకు అధికారులు చేస్తున్న ఏర్పాట్లను పరిశీలించి, సమీక్షించేందుకోసం అంటూ ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఈరోజు నుంచి జిల్లాల్లో పర్యటిస్తున్నారు. ముందుగా జగన్ ఇలాకాలోనే ఆయన అడుగు పెట్టబోతున్నారు. శుక్ర, శనివారాల్లో రాయలసీమ జిల్లాల్లో నిమ్మగడ్డ పర్యటిస్తారు. ఈరోజు అనంతపురం, కర్నూలు జిల్లాల్లో నిమ్మగడ్డ పర్యటించి స్థానిక పరిస్థితులు అంచనా వేస్తారు. 30న కడప జిల్లాలో ఎన్నికల ఏర్పాట్లను స్వయంగా పరిశీలించి కలెక్టరు, డీఐజీ, ఎస్పీ, ఇతర ప్రభుత్వశాఖల అధికారులతో సమావేశమవుతారు. నిమ్మగడ్డ పర్యటనతో ఒకరకంగా అధికార పక్షంలో వణుకు మొదలైంది. ఏకగ్రీవాలపై ఎక్కడైనా ఫిర్యాదులందితే.. వాటిపై ప్రత్యేక దృష్టిపెట్టేందుకు ఆయన ప్రయత్నిస్తున్నారు. ఈ నేపథ్యంలో పోలీసుల బలగాలను ఉపయోగించి గ్రామాల్లో గొడవలు జరక్కుండా చూడాలనుకుంటున్నారు. ఏకగ్రీవాల విషయంలో ఏమాత్రం తేడా వచ్చినా.. అక్కడ ఎన్నికలను రద్దు చేసేందుకు సైతం ఎస్ఈసీ వెనకాడరు. దీంతో అధికార పార్టీలో అంతర్మథనం మొదలైంది. 


జ‌గ‌నోరు చివ‌రి నిముషంలో వెన‌క్కి త‌గ్గారా ? ఏంటా సంచ‌ల‌న నిర్ణ‌యం..!

జగ‌డ్డ: విజయనగరం - పంచాయతీ ఎన్నికల్లో ఈ జిల్లా స్పెషల్ తెలుసా..?

రాజమౌళి నిక్ నేమ్ జక్కన్న కాదు మరేమిటో తెలుసా ?

హెరాల్డ్ ఎడిటోరియల్: అసాంఘిక శక్తుల అరాచక దందాల నుండి, అభాగ్యులకు రక్షణ కరువేనా?

హెరాల్డ్ సెటైర్ : పంచాయితి ఎన్నికలకు మ్యానిఫెస్టోనా ? ఏమైందయ్యా బాబు ?

జగడ్డ : నిమ్మగడ్డను వదలని జగనోరు.. కేంద్రానికి లేఖ !

జగడ్డ : నేడే పంచాయతీ పోరు షురూ.. తొలిదశ ఎక్కడెక్కడో తెలుసా..?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Giddaluri Srinivasa Rao]]>