HealthDivyaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/health/movies_news/jalubu-daggu-gonthu-noppifb8f0491-b51e-483b-82c4-c20d323ff5d3-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/health/movies_news/jalubu-daggu-gonthu-noppifb8f0491-b51e-483b-82c4-c20d323ff5d3-415x250-IndiaHerald.jpgమనలో చాలా మందికి ఇమ్యూనిటీ పవర్ తక్కువగా ఉండడం వల్ల తరచూ ఇలాంటి జబ్బులకు గురవుతూ ఉంటారు. మరీ ముఖ్యంగా శీతాకాలం, వర్షాకాలం వస్తే చాలు చాలా మంది పిల్లలతో పాటు పెద్దలు కూడా జలుబు,దగ్గు,గొంతునొప్పి వంటి సమస్యలతో బాధపడుతుంటారు.కొంతమంది టాబ్లెట్ వేసుకుంటే ఇలాంటి సమస్యల నుంచి బయటపడతారు, మరి కొంతమందేమో ఎన్ని టాబ్లెట్లు, టానిక్ లు వాడినప్పటికీ త్వరగా ఉపశమనం కలగదు. అయితే ఇలాంటి ఇంగ్లీష్ మందులు వాడడం వల్ల త్వరగా ఉపశమనం కలిగినప్పటికీ అది దీర్ఘకాలిక సమస్యగా మారే అవకాశం ఉంది. అయితే ఇప్పుడు చెప్పబోయే కొన్ని ఇjalubu daggu gonthu noppi;thulasi;mandula;tulasi;aqua;gas stoveజలుబు, దగ్గు,గొంతు నొప్పి సమస్యలతో బాధపడుతున్నారా? అయితే ఇలా చేయండి..జలుబు, దగ్గు,గొంతు నొప్పి సమస్యలతో బాధపడుతున్నారా? అయితే ఇలా చేయండి..jalubu daggu gonthu noppi;thulasi;mandula;tulasi;aqua;gas stoveFri, 29 Jan 2021 16:39:00 GMTమనలో చాలా మందికి ఇమ్యూనిటీ పవర్ తక్కువగా ఉండడం వల్ల తరచూ ఇలాంటి జబ్బులకు గురవుతూ ఉంటారు. మరీ ముఖ్యంగా శీతాకాలం, వర్షాకాలం వస్తే చాలు చాలా మంది పిల్లలతో పాటు పెద్దలు కూడా జలుబు,దగ్గు,గొంతునొప్పి వంటి సమస్యలతో బాధపడుతుంటారు.కొంతమంది టాబ్లెట్ వేసుకుంటే ఇలాంటి సమస్యల నుంచి బయటపడతారు, మరి కొంతమందేమో ఎన్ని టాబ్లెట్లు, టానిక్ లు వాడినప్పటికీ త్వరగా ఉపశమనం కలగదు. అయితే ఇలాంటి ఇంగ్లీష్ మందులు వాడడం వల్ల త్వరగా ఉపశమనం కలిగినప్పటికీ అది దీర్ఘకాలిక సమస్యగా మారే అవకాశం ఉంది.  అయితే ఇప్పుడు చెప్పబోయే కొన్ని ఇంటి చిట్కాలను పాటించి, ఈ సమస్యల నుంచి బయటపడవచ్చు.


ఇప్పుడు చెప్పబోయే చిట్కా ఇంట్లో ఉండే సహజసిద్ధమైన పదార్థాలతో తయారు చేసుకోవచ్చు. ఇలా  వీటిని ఉపయోగించి తయారు చేసిన  కషాయాన్ని తాగడం వల్ల ఒక్కరోజులోనే మంచి రిలీఫ్ వస్తుంది.  అయితే ఇప్పుడు ఆ కషాయాన్ని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం.

కషాయానికి కావలసిన పదార్థాలు:
తులసి ఆకులు 10
మిరియాలు 10
అల్లం ఒక ఇంచ్
పటిక బెల్లం ఒకటిన్నర టేబుల్ స్పూన్

తయారీ విధానం:
కషాయాన్ని తయారు చేసుకోవడం కోసం ముందుగా పైన చెప్పిన పదార్థాలన్నింటిని సేకరించాలి.  ఇందుకోసం అల్లం ను తీసుకొని పైన తొక్క తీసి,రోటిలో వేసి మెత్తగా దంచండి.  తరువాత ఇందులో మిరియాలను కూడా  వేసి మెత్తగా దంచాలి. ఆ తరువాత తులసి ఆకులు వేసి మూడింటిని మెత్తగా నూరుకోవాలి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని ఒక గిన్నెలోకి తీసుకొని,అందులో ఒక గ్లాసు నీటిని పోసి స్టవ్  మీద పెట్టి బాగా మరిగించాలి.ఇలా మరుగుతున్న నీరు అరగ్లాసు అయ్యేవరకు అలాగే స్టవ్  మీద ఉంచాలి. ఆ తర్వాత స్టౌ ఆఫ్ చేసి, ఇందులో పటిక బెల్లాన్ని వేయండి. ఇప్పుడు ఈ నీటిని ఫిల్టర్ సహాయంతో వడకట్టుకోవాలి.

 ఎలా వాడాలి?
తయారుచేసి పెట్టుకున్న కషాయాన్ని చల్లారిన తర్వాత గోరువెచ్చగా ఉన్నప్పుడు 1 టీ గ్లాస్ మోతాదులో దీనిని తాగాలి. అయితే ఈ కషాయం తాగితే తర్వాత ఒక గంట వరకు ఏమీ తీసుకోకూడదు.

 ఇక ఈ కషాయం తాగడం వల్ల జలుబు, గొంతునొప్పి, తలనొప్పి,జలుబు వల్ల వచ్చే అన్ని రకాల ఇన్ఫెక్షన్లతో పాటు దగ్గు వంటి సమస్యల నుండి బయటపడవచ్చు.








బ్రాహ్మణ ఘోష... వాళ్ళ కన్నీరు కనపడటం లేదా అన్నా...?

బ్రాహ్మణ ఘోష: జగనోరికి బ్రాహ్మణ గోష్ఠ తప్పదు...?

బ్రాహ్మణ ఘోష : బ్రాహ్మణులకు ప్రభుత్వం ఉపాధి కల్పించాలి....

‘30 రోజుల్లో ప్రేమించడం ఎలా..?’ ఎలా ఉందంటే..

బిగ్ బ్రేకింగ్ : 'ఆచార్య' టీజర్ రిలీజ్ - మాటల్లేవ్ మాట్లాడుకోవడాల్లేవ్ .....!!

బిగ్ అప్ డేట్ : 'సర్కారు వారి పాట' రిలీజ్ డేట్ అనౌన్స్ చేసిన సూపర్ స్టార్ మహేష్ ....!!

ప్రభాస్ 'సలార్' స్టోరీ లీక్..కేజీఎఫ్ కూడా పనికిరాదు..!!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>