Politicsyekalavyaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/inter-exams3384cfc9-708d-456e-a923-d91a445c170a-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/inter-exams3384cfc9-708d-456e-a923-d91a445c170a-415x250-IndiaHerald.jpgఇంటర్‌ పరీక్షల షెడ్యూల్‌ విడుదలైంది. కరోనా నేపథ్యంలో గతేడాది కళాశాలన్నీ మూతపడినా ఆన్‌క్లాసుల సాయంతో విద్యార్థులు ఎలాగోలా నెట్టుకొచ్చారు. ఈ క్రమంలోనే విద్యాసంవత్సరం పూర్తి కానున్న నేపథ్యంలో పరీక్షలు నిర్వహించేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. ఈ క్రమంలోనే ఇంటర్ ప్రథమ, ద్వితీయ సంవత్సర పరీక్షల షెడ్యూల్‌‌ను విడుదల చేసింది. ఈ షెడ్యూల్ ప్రకారం మే లో ఈ పరీక్షలు జరగనున్నాయి. అంటే కేవలం మరో 4 నెలలు మాత్రమే..inter exams;hyderabad;festival;jaan;english;ramzan;april;johnటీఎస్ ఇంటర్ పరీక్షల షెడ్యూల్.. ఆ రెండు పరీక్షలకు అంత గ్యాప్ ఎందుకంటే..!టీఎస్ ఇంటర్ పరీక్షల షెడ్యూల్.. ఆ రెండు పరీక్షలకు అంత గ్యాప్ ఎందుకంటే..!inter exams;hyderabad;festival;jaan;english;ramzan;april;johnFri, 29 Jan 2021 11:05:54 GMTహైదరాబాద్: ఇంటర్‌ పరీక్షల షెడ్యూల్‌ విడుదలైంది. కరోనా నేపథ్యంలో గతేడాది కళాశాలన్నీ మూతపడినా ఆన్‌క్లాసుల సాయంతో విద్యార్థులు ఎలాగోలా నెట్టుకొచ్చారు. ఈ క్రమంలోనే విద్యాసంవత్సరం పూర్తి కానున్న నేపథ్యంలో పరీక్షలు నిర్వహించేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. ఈ క్రమంలోనే ఇంటర్ ప్రథమ, ద్వితీయ సంవత్సర పరీక్షల షెడ్యూల్‌‌ను విడుదల చేసింది. ఈ షెడ్యూల్ ప్రకారం మే లో ఈ పరీక్షలు జరగనున్నాయి. అంటే కేవలం మరో 4 నెలలు మాత్రమే సమయం ఉందన్నమాట. మే1వ తేదీ నుంచి 20వ తేదీ వరకు ఈ పరీక్షలు జరగనున్నట్లు ఇంటర్‌ బోర్డు వెల్లడించింది. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పరీక్షలు నిర్వహించనున్నామని తెలిపింది. అయితే ఈ పరీక్షలకు నెల రోజుల ముందుగానే ఏప్రిల్‌ 7 నుంచి 20 వరకు ప్రాక్టికల్‌ ఎగ్జామ్స్ నిర్వహించనున్నట్లు పేర్కొంది.
 ఇంటర్ బోర్డు విడుదల చేసిన షెడ్యూల్ ఇదే..

ఇంటర్‌ మొదటి సంవత్సరం షెడ్యూల్‌..          
మే-1 సెకండ్‌ లాంగ్వేజ్‌                     
మే-3  ఇంగ్లిష్‌                         
మే-5  మ్యాథమెటిక్స్‌-1ఏ, బాటనీ, సివిక్స్‌, సైకాలజీ             
మే-7 మ్యాథమెటిక్స్‌-1బీ, జువాలజీ, హిస్టరీ                
మే-10  ఫిజిక్స్‌, ఎకనామిక్స్‌,  క్లాసికల్‌ లాంగ్వేజ్‌            
మే-12  కెమిస్ర్టీ, కామర్స్‌, సోషియాలజీ, ఫైన్‌ ఆర్ట్స్‌-మ్యూజిక్‌        
మే-17 జియాలజీ, హోంసైన్స్‌, పబ్లిక్‌ అడ్మినిస్ర్టేషన్‌,              
లాజిక్‌, బ్రిడ్జికోర్సు మ్యాథమెటిక్స్‌(బైపీసీ)                
మే-19  మోడ్రన్‌ లాంగ్వేజ్‌,  జియాగ్రఫీ                  

ఇంటర్‌ రెండో సంవత్సరం షెడ్యూల్‌..
మే-2 సెకండ్‌ లాంగ్వేజ్‌
మే-4  ఇంగ్లిష్‌
మే-6 మ్యాథమెటిక్స్‌-2ఏ, బాటనీ, సివిక్స్‌, సైకాలజీ
మే-8 మ్యాథమెటిక్స్‌-2బీ, జువాలజీ, హిస్టరీ
మే-11  ఫిజిక్స్‌, ఎకనామిక్స్‌, క్లాసికల్‌ లాంగ్వేజ్‌
మే-13  కెమిస్ర్టీ, కామర్స్‌, సోషియాలజీ, ఫైన్‌ ఆర్ట్స్‌-మ్యూజిక్‌
మే-18 జియాలజీ, హోంసైన్స్‌,  పబ్లిక్‌ అడ్మినిస్ర్టేషన్‌,
లాజిక్‌, బ్రిడ్జి కోర్సు మ్యాథమెటిక్స్‌(బైపీసీ)
మే-20  మోడ్రన్‌ లాంగ్వేజ్‌, జియాగ్రఫీ

ఇదిలా ఉంటే ఇంటర్ బోర్డు విడుదల చేసిన షెడ్యూల్‌ ప్రకారం.. తొలి రోజు ఇంటర్ ఫస్టియర్ ఎగ్జామ్, రెండో రోజు సెకండియర్ ఎగ్జామ్, మళ్లీ మూడో రోజు ఫస్టియర్ ఎగ్జామ్ ఉండేలా షెడ్యూల్‌ను డిజైన్ చేశారు. ఎక్కడా ఒక్కరోజు కూడా ఖాళీ లేకుండా జాగ్రత్త పడ్డారు. అయితే 13వ తేదీ తరువాత మాత్రం ఈ ఏకంగా మూడు రోజుల పాటు పరీక్షలకు సెలవు ప్రకటించారు. దీంతో జివాలజీ హోం సైన్స్, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, లాజిక్, బ్రిడ్జ్ కోర్సు మేథమేటిక్స్(బైపీసీ) విద్యార్థులకు ఇది చక్కటి అవకాశంగా మారనుంది.

ఈ సెలవులకు కారణం.. మధ్యలో రంజాన్ పండుగ రావడమేనని ఇంటర్ బోర్డు అధికారి ఒకరు తెలిపారు. రంజాన్ తరవాత శనివారం ఖాళీ ఉన్నప్పటికీ.. ఆ మరుసటి రోజునే ఆదివారం ఉండడంతో ద్వితీయ సంవత్సరం పరీక్షకు అంతరాయం ఏర్పడే అవకాశం ఉందట. అందువల్లనే తదుపరి పరీక్షను ఏకంగా 17వ తేదీన నిర్వహించేందుకు నిర్ణయించినట్లు ఆ అధికారి తెలియజేశారు.





జ‌గ‌నోరు ఊహించ‌లేదు.. బాబోరు ఇలా చేస్తార‌ని..!!

జగడ్డ: మొబైల్ యాప్ తో భయపెడుతున్న నిమ్మగడ్డ..

జగడ్డ : సీమ మీద నిమ్మగడ్డ స్పెషల్ ఫోకస్.. నేడు రేపు అక్కడే..అదే అసలు రీజన్ !

భారీ అప్ డేట్ : ప్రభాస్ - నాగ అశ్విన్ మూవీ లో మ్యూజిక్ డైరెక్టర్ గా ఆయన ఫిక్స్ ...!!

జ‌గ‌నోరిపై వైసీపీలో క‌మ్మోళ్ల కోపం మామూలుగా లేదే...!

జగడ్డ : మూడో కన్ను తెరచిన నిమ్మగడ్డ...మూడేది ఎవరికో...?

జగడ్డ: నిమ్మగడ్డతో మళ్లీ కయ్యానికి జగనోరు సిద్ధం..?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - yekalavya]]>