PoliticsVUYYURU SUBHASHeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_analysis/jagadda-this-is-jagannoris-warning-to-saireddy0a9aaa93-8cb2-4b95-ae18-7a1d1e58618b-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_analysis/jagadda-this-is-jagannoris-warning-to-saireddy0a9aaa93-8cb2-4b95-ae18-7a1d1e58618b-415x250-IndiaHerald.jpgసాయి రెడ్డి పెత్త‌నంపై ఏకంగా ఇద్ద‌రు మంత్రులు, ప‌ది మంది ఎమ్మెల్యేల వ‌ర‌కు మండి ప‌డుతున్నార‌ట‌. అస‌లు ఉత్త‌రాంధ్ర‌లో పార్టీ ఎమ్మెల్యేలు అంద‌రిని ఆయ‌న డ‌మ్మీల‌ను చేసి ప‌డేశార‌ని అంటున్నారు. ఇక గ‌త ఎన్నిక‌ల్లో ఉత్త‌రాంధ్ర‌లోని మూడు జిల్లాల్లో ఫ్యాన్‌ను గిర్రున తిప్ప‌డంలో సాయి రెడ్డి కొంత వ‌ర‌కు చ‌క్రం తిప్పారు. అందుకే జ‌గ‌న్ ఆయ‌న అక్క‌డ ఎంత పెత్త‌నం చేసినా మాట్లాడ‌డం లేదు. అయితే ఈ సారి పంచాయ‌తీతో పాటు ఇత‌ర స్థానిక ఎన్నిక‌ల్లో అక్క‌డ వైసీపీకి మెజార్టీ స్థానాలు రాక‌పోతే ఊరుకోన‌ని సాయి రెడ్డికే sai reddy jagan;cheque;letter;local language;reddy;party;mantraజ‌గ‌డ్డ‌: సాయిరెడ్డికి జ‌గ‌నోరి వార్నింగ్ ఇదే.. తేడా వ‌స్తే అంతేగా అంతేగా...!జ‌గ‌డ్డ‌: సాయిరెడ్డికి జ‌గ‌నోరి వార్నింగ్ ఇదే.. తేడా వ‌స్తే అంతేగా అంతేగా...!sai reddy jagan;cheque;letter;local language;reddy;party;mantraThu, 28 Jan 2021 14:00:00 GMTగ‌త ఎన్నిక‌ల‌కు ముందు నుంచి కీలక‌మైన ఉత్త‌రాంధ్ర జిల్లాల్లో పార్టీ బాధ్య‌త‌లు అన్ని ఆ పార్టీ కీల‌క నేత‌, రాజ్య‌స‌భ స‌భ్యుడు విజ‌య‌సాయి రెడ్డే చూసేవారు. టిక్కెట్ల కేటాయింపు నుంచి ఇత‌ర‌త్రా వ్య‌వ‌హారాల వ‌ర‌కు అన్ని సాయి రెడ్డి క‌నుస‌న్న‌ల్లోనే జ‌రిగేవి. ఇక ఎన్నిక‌ల్లో గెలిచాక సైతం ఎవ‌రెవ‌రికి ఏయే ప‌ద‌వులు ఇవ్వాలి ?  ఉత్త‌రాంధ్ర‌లో పార్టీ , ప్ర‌భుత్వం ఎలా న‌డ‌వాలి ? అన్న‌ది కూడా సాయి రెడ్డి క‌నుస‌న్న‌ల్లోనే జ‌రిగేవి. చివ‌ర‌కు అక్క‌డ గెలిచిన ఎమ్మెల్యేలు, ఎంపీలు.. మంత్రుల‌ను కూడా సాయిరెడ్డి డ‌మ్మీల‌ను చేసేసి ఒంటి చేత్తో చ‌క్రం తిప్పేసేవారు. దీంతో పార్టీ నేత‌ల్లోనే సాయి రెడ్డి తీరుపై తీవ్ర ఆగ్ర‌హావేశాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి.

ఉత్త‌రాంధ్ర మంత్రులు సైతం విజ‌య సాయి రెడ్డి ఇక్క‌డ హ‌డావిడి చేస్తుండ‌డంతో త‌మ‌ను ప‌ట్టించుకునే వారే లేర‌ని ఆవేద‌న‌తో ఉన్నారు. దీనికి తోడు ఉత్త‌రాంధ్ర జిల్లాల్లో వైసీపీలో తీవ్ర‌మైన వ‌ర్గ పోరు న‌డుస్తోంది. సాయి రెడ్డి పెత్త‌నంపై ఏకంగా ఇద్ద‌రు మంత్రులు, ప‌ది మంది ఎమ్మెల్యేల వ‌ర‌కు మండి ప‌డుతున్నార‌ట‌. అస‌లు ఉత్త‌రాంధ్ర‌లో పార్టీ ఎమ్మెల్యేలు అంద‌రిని ఆయ‌న డ‌మ్మీల‌ను చేసి ప‌డేశార‌ని అంటున్నారు. ఇక గ‌త ఎన్నిక‌ల్లో ఉత్త‌రాంధ్ర‌లోని మూడు జిల్లాల్లో ఫ్యాన్‌ను గిర్రున తిప్ప‌డంలో సాయి రెడ్డి కొంత వ‌ర‌కు చ‌క్రం తిప్పారు.

అందుకే జ‌గ‌న్ ఆయ‌న అక్క‌డ ఎంత పెత్త‌నం చేసినా మాట్లాడ‌డం లేదు. అయితే ఈ సారి పంచాయ‌తీతో పాటు ఇత‌ర స్థానిక ఎన్నిక‌ల్లో అక్క‌డ వైసీపీకి మెజార్టీ స్థానాలు రాక‌పోతే ఊరుకోన‌ని సాయి రెడ్డికే నేరుగా వార్నింగ్ ఇచ్చారంటున్నారు. పైగా అక్క‌డ రాజ‌ధాని ఏర్పాటు ప్ర‌క‌ట‌న అంశం కూడా మ‌న‌కు సానుకూలం అవుతుంద‌ని.. ఇవ‌న్నీ ప్ల‌స్ చేసుకుని ఉత్త‌రాంధ్ర‌లో స్థానిక ఎన్నిక‌ల్లో స‌త్తా చాటితేనే మ‌న‌కు అక్క‌డ ప‌టిష్ట‌మైన పునాది ఏర్ప‌డుతుంద‌ని జ‌గ‌న్ సూచ‌న‌లు చేశార‌ట‌. అయితే సాయి రెడ్డి పెత్త‌నాన్ని స‌హించ లేని వారు మాత్రం ఇక్క‌డ దెబ్బ ప‌డితే అయినా సాయి రెడ్డి పెత్త‌నానికి చెక్ ప‌డుతుంద‌న్న ఆశ‌తో ఉన్నారు. 


జగడ్డ: పోలీసుల వ్యవహారం జగనోరికి చుక్కలు చూపిస్తుందా...?

జగడ్డ : ఆ వర్గం జగనోరికి షాక్ ఇవ్వనుందా..?

జ‌గ‌డ్డ‌: జ‌గ‌నోరు దెబ్బ‌కు ఆ వైసీపీ ఎమ్మెల్యే ఫ్యూచ‌ర్ క్లోజ్‌...!

జగడ్డ: అడ్రస్ లేని వైసిపి సోషల్ మీడియా - ఇంత అసంతృప్తా ?

జగడ్డ : నాటి ప్రభావం నేటి ఎన్నికలపై.. జగనోరి మౌనం చేదు అనుభవం..?

జగడ్డ : ఆ లెక్కన చూస్తే.. జగనోరి పథకాలతో లబ్ధి పొందినోళ్లు.. బిజెపికి ఓటేయ్యాలేమో..?

జగడ్డ: బాబోరు ముందే సెలబ్రేట్ చేస్తున్నారా ?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - VUYYURU SUBHASH]]>