PoliticsSatvikaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/jagan-nimmagadda-electionsfc5782bd-a5aa-45bb-b76d-bd71ec19c5c7-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/jagan-nimmagadda-electionsfc5782bd-a5aa-45bb-b76d-bd71ec19c5c7-415x250-IndiaHerald.jpgఆంధ్రప్రదేశ్ పంచాయతీ ఎన్నికల ఏకగ్రీవం కోసం ప్రభుత్వం భారీగా ప్రకటనలు ఇవ్వటం పై పెద్ద కుట్ర ఉందని బీజేపీ-జనసేన నేతలు ఆరోపించారు..పార్టీని బలోపేతం చేసుకునేందుకు బలవంతంగా ఏకగ్రీవాలు చేసే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. కాగా, నిన్న ఈ విషయం పై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు, జనసేన రాజకీయవ్యవహారాల కమిటీ చైర్మన్‌ నాదెండ్ల మనోహర్‌ మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా 'పంచాయతీ ఎన్నికల్లో భారీగా లబ్ధి పొందేందుకు రాష్ట్ర ప్రభుత్వం చరిత్రలో ఎన్నడూలేని విధంగా ప్రకటనలు ఇస్తోందని అన్నారjagan-nimmagadda-elections;view;tiru;bharatiya janata party;jagan;andhra pradesh;janasena;tirupati;media;panchayati;chief minister;husband;army;janasena party;mantraజగడ్డ: ఏకగ్రీవ ఎన్నికల వెనుక కుట్ర కోణం ?జగడ్డ: ఏకగ్రీవ ఎన్నికల వెనుక కుట్ర కోణం ?jagan-nimmagadda-elections;view;tiru;bharatiya janata party;jagan;andhra pradesh;janasena;tirupati;media;panchayati;chief minister;husband;army;janasena party;mantraThu, 28 Jan 2021 11:18:49 GMTఆంధ్రప్రదేశ్ పంచాయతీ ఎన్నికల ఏకగ్రీవం కోసం ప్రభుత్వం భారీగా ప్రకటనలు ఇవ్వటం పై పెద్ద కుట్ర ఉందని బీజేపీ-జనసేన నేతలు ఆరోపించారు..పార్టీని బలోపేతం చేసుకునేందుకు బలవంతంగా ఏకగ్రీవాలు చేసే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. కాగా, నిన్న ఈ విషయం పై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు, జనసేన రాజకీయవ్యవహారాల కమిటీ చైర్మన్‌ నాదెండ్ల మనోహర్‌ మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా 'పంచాయతీ ఎన్నికల్లో భారీగా లబ్ధి పొందేందుకు రాష్ట్ర ప్రభుత్వం చరిత్రలో ఎన్నడూలేని విధంగా ప్రకటనలు ఇస్తోందని అన్నారు.. ఈ కుట్రలను ఎన్నికల కమిషన్‌ అడ్డుకోవాలి. దీనిపై ప్రభుత్వ చర్యలు, మంత్రుల ప్రకటనలను సుమోటోగా స్వీకరించి ఎస్‌ఈసీ చర్య తీసుకోవాలి. అభ్యర్థులపై అధికార ఎమ్మెల్యేలు, మంత్రుల బెదిరింపులు సరికాదు.


బెదిరించి చేస్తే ప్రజలు ఊరుకోరు.. తగిన బుద్ది చెప్తారు అంటూ వారు అన్నారు. ఇలా బెదిరించడం చూస్తుంటే రేపు నామినేషన్లు వెయ్యనివ్వకుండా చేస్తారని అర్థమవుతుంది అంటూ వ్యాఖ్యానించారు.29న నామినేషన్లు మొదలయ్యేరోజు ప్రభుత్వం అసలు రంగు బయటకి వస్తుందంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏకగ్రీవాలకోసం యంత్రాంగం ద్వారా ఒత్తిడి తెచ్చే ప్రయత్నం జరుగుతోందని అనుమానం వ్యక్తం చేశారు. ఇలాంటి కుట్రలను అడ్డుకోవడానికి ఆన్‌లైన్‌ ద్వారా నామినేషన్ల స్వీకారానికి ఎస్‌ఈసీ అవకాశం కల్పించాలని కోరారు.



ఇకపోతే జగన్ అన్నీ ముక్కు సూటిగా చేస్తారు. ముఖ్యంగా చెప్పాలంటే తను చెప్పిందే జరగాలని అనుకుంటారు అని ఆరోపించారు. అంతేకాదు రాజ్యాంగాన్ని ఏ మాత్రం గౌరవించడానికి ఇష్టపడని ఏకైక ముఖ్యమంత్రి దేశంలో జగన్ ఒక్కరే అంటూ ఎద్దేవా చేశారు..అన్ని పంచాయతీల్లోనూ బీజేపీ,జన సేన ఉమ్మడి అభ్యర్థులు రంగంలో ఉంటారని స్పష్టం చేశారు. తిరుపతి ఎన్నికల విషయంలో బీజేపీ-జనసేన మధ్య ఎలాంటి బేధాలు లేవని తేల్చిచెప్పారు.. అనంతరం ఇరు పార్టీల ముఖ్యనేతలతో వీర్రాజు, మనోహర్‌ సమావేశమై పంచాయతీ ఎన్నికల్లో వ్యూహంపై చర్చించారు.ఈరోజు బీజేపీ, జనసేన నేతలు గురువారం గవర్నర్‌ను కలవనున్నారు..





బీఎస్‌ యెడియూరప్పను సుప్రీంకోర్టు ఏమని ప్రశ్నించిందో తెలుసా...?

జగడ్డ: పవన్ పరువు నిలబడేనా ?

జగడ్డ: చంద్రబాబు, నిమ్మగడ్డ ఒకటేనా?

జగడ్డ: ఈ ఎన్నికలు నిమ్మగడ్డకు కత్తిమీద సాములాంటివి...?

జగడ్డ : నమ్ముకున్నోరిని జగనోరు ముంచేనా తేల్చేనా ?

జగడ్డ : గ్రౌండ్ రియాలిటీ ఇదే... పంచ్ పడేదెవరికంటే...?

జగడ్డ: తెదేపా సోషల్ మీడియా ముందు ఓడిన వైకాపా సోషల్ మీడియా ?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Satvika]]>