MoviesSeetha Sailajaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/money-money813994ce-73d4-4578-9b0a-2c04f3588b18-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/money-money813994ce-73d4-4578-9b0a-2c04f3588b18-415x250-IndiaHerald.jpg కరోనా పరిస్థితులు తరువాత దేశంలో ఆర్దికాసమానతలు మరింత దిగజారాయని పేదలు మరింత దరిద్రంలోకి వెళ్ళిపోతే దేశంలోని 100 మంది కుభేరుల సంపద కేవలం ఒకేఒక సంవత్సరంలో 13 లక్షల కోట్లు పెరిగిపోయిందని ఆక్స్‌ఫామ్ నివేదిక తెలియ చేస్తోంది. ప్రస్తుతం కొనసాగుతున్న పేదరిక పరిస్థితులు వల్ల చాలామంది నిరుద్యోగులుగా మారడమే కాకుండా ప్రాథమిక అవసరాలైన ఆరోగ్య సంరక్షణ, పారిశుద్ధ్యాన్ని పొందటానికి కష్టపడుతున్నారు అంటూ ఈ నివేదిక అనేక ఆసక్తికర విషయాలను తెలియ చేసింది.లాక్‌ డౌన్ వేళ భారత్‌ లో బిలీనియర్ల సంఖ్య 35 శాతం పెరిగితే ఇmoney money;sampada;india;2020;un employment;marchడబ్బే డబ్బు : హాట్ న్యూస్ గా మారిన ముకేష్ అంబాని సెకను సంపాదన !డబ్బే డబ్బు : హాట్ న్యూస్ గా మారిన ముకేష్ అంబాని సెకను సంపాదన !money money;sampada;india;2020;un employment;marchThu, 28 Jan 2021 12:00:00 GMTకరోనా పరిస్థితులు తరువాత దేశంలో ఆర్దికాసమానతలు మరింత దిగజారాయని పేదలు మరింత దరిద్రంలోకి వెళ్ళిపోతే దేశంలోని 100 మంది కుభేరుల సంపద కేవలం ఒకేఒక సంవత్సరంలో 13 లక్షల కోట్లు పెరిగిపోయిందని ఆక్స్‌ఫామ్ నివేదిక తెలియ చేస్తోంది. ప్రస్తుతం కొనసాగుతున్న పేదరిక పరిస్థితులు వల్ల చాలామంది నిరుద్యోగులుగా మారడమే కాకుండా ప్రాథమిక అవసరాలైన ఆరోగ్య సంరక్షణ, పారిశుద్ధ్యాన్ని పొందటానికి కష్టపడుతున్నారు అంటూ ఈ నివేదిక అనేక ఆసక్తికర విషయాలను తెలియ చేసింది.


లాక్‌ డౌన్ వేళ భారత్‌ లో బిలీనియర్ల సంఖ్య 35 శాతం పెరిగితే ఇదే సమయంలో దేశంలో 84 శాతం కుటుంబాలు వివిధరకాల ఆదాయ నష్టాలను చవిచూశాయని ఆ నివేదిక వాస్తవాలను బయటపెట్టింది. ఒక్క ఏప్రిల్‌లోనే ప్రతి గంటకు 1.7 లక్షల మంది ఉద్యోగాలు కోల్పోయారని అయితే మార్చి 2020 నుంచి దేశంలోని టాప్ 100 బిలీనియర్ల ఆదాయం పెరిగిందని వీరి సంవత్సర ఆదాయం 13 లక్షల కోట్లు దేశంలోని అత్యంత పేద పజలు అయిన 13.8 కోట్ల పేదలకు పంచిపెడితే వారికి తలసరిన 94.045 రూపాయల వంతు చొప్పున వస్తాయని ఆ నివేదిక అభిప్రాయపడింది.



అంతేకాదు కరోనా లాక్ డౌన్ సమయంలో ఒక గంటలో అంబానీకి లభించిన ఆదాయం నైపుణ్యం లేని కార్మికుడి సంపాదించాలంటే 10,000 ఏళ్లు పడుతుంది..వారు మూడేళ్లలో సంపాధించేంది అంబానీ ఒక సెకెండులో సంపాదిస్తారు అంటూ ఈ నివేదిక బయటపెట్టిన అంశాలు చూస్తుంటే భారతదేశంలో అత్యంత ధనవంతుల సంఖ్య ఎలా పెరుగుతోంది అన్నది అర్ధం అవుతోంది.



అదేవిధంగా ఆరోగ్య సంరక్షణలో అసమానతలను కూడా ఈ నివేదిక ఎత్తి చూపింది. ఈ ఆర్ధిక అసమానతులు తొలగాలి అంటే 50 లక్షలకుపైగా సంపాదించే వారిపై రెండు శాతం సర్‌చార్జి విధించాలని, మహమ్మారి సమయంలో లాభాలు ఆర్జించిన సంస్థలపై తాత్కాలిక పన్నును ప్రవేశపెట్టాలని ఈ నివేదిక అభిప్రాయపడుతోంది. అయితే ఇలాంటి సాహసాలు చేయగల అవకాశాలు మన ప్రభుత్వాలకు ఉన్నాయా అన్నదే సమాధానం లేని ప్రశ్నగా మారింది..  




హాస్టల్స్ లో ఉండాలంటే.. ఆ లెటర్ తప్పనిసరి..

జగడ్డ: ఏకగ్రీవ ఎన్నికల వెనుక కుట్ర కోణం ?

జగడ్డ: పవన్ పరువు నిలబడేనా ?

జగడ్డ: చంద్రబాబు, నిమ్మగడ్డ ఒకటేనా?

జగడ్డ: ఈ ఎన్నికలు నిమ్మగడ్డకు కత్తిమీద సాములాంటివి...?

జగడ్డ : నమ్ముకున్నోరిని జగనోరు ముంచేనా తేల్చేనా ?

జగడ్డ : గ్రౌండ్ రియాలిటీ ఇదే... పంచ్ పడేదెవరికంటే...?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Seetha Sailaja]]>