MoviesVAMSIeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/mahesh-fans5d7410e2-7735-4d2d-a4ee-c9565f57881b-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/mahesh-fans5d7410e2-7735-4d2d-a4ee-c9565f57881b-415x250-IndiaHerald.jpgతెలుగు ప్రేక్షకులను తన హుందాతనంతో కట్టిపడేసిన కన్నడ నటి అర్చనకు మన టాలీవుడ్ హీరో అంటే మహా ఇష్టమని ఓ షోలో చెప్పుకొచ్చారు. ఇంతకీ ఆ హీరో ఎవరనుకుంటున్నారా. ? అమ్మాయిల కలల రాకుమారుడు సూపర్ స్టార్ మహేష్ బాబు. మహేష్ యాక్టింగ్ అంటే తనకు చాలా ఇష్టం అని చెప్పారు అర్చన. mahesh fans;mahesh;soundarya;anasuya bharadwaj;archana;deepa;tara;tollywood;cinema;rajani kanth;television;kannada;hero;maha;anasuya 1;fidaaకార్తీక దీపం సౌంద‌ర్య‌కు ఆ స్టార్ హీరో అంటే చాలా ఇష్ట‌మ‌ట‌...?కార్తీక దీపం సౌంద‌ర్య‌కు ఆ స్టార్ హీరో అంటే చాలా ఇష్ట‌మ‌ట‌...?mahesh fans;mahesh;soundarya;anasuya bharadwaj;archana;deepa;tara;tollywood;cinema;rajani kanth;television;kannada;hero;maha;anasuya 1;fidaaThu, 28 Jan 2021 13:00:00 GMTదీప క్యారెక్టర్ ను ఎంత ప్రేమిస్తారో.. దీప అత్తగా నటించిన సౌందర్య పాత్రను అదే స్థాయిలో అభిమానిస్తారు. బుల్లితెర ప్రేక్షకుల మనసు దోచుకున్న కార్తీకదీపం సీరియల్లో దీప కష్టాలు, కన్నీళ్లకు కరిగిపోయారు ప్రేక్షకులు.. సౌందర్య గాంభీర్యానికి, ఆమె ఆహార్యానికి కూడా అంతే ఫిదా అయ్యారు. ఈమె నటనకు ప్రేక్షకులు జోహార్లు పలుకుతున్నారు. సౌందర్య అసలు పేరు అర్చనా అనంత్‌. ఆమె పుట్టింది బెంగళూర్‌లో, కన్నడ కుటుంబానికి చెందిన అర్చన.. తెలుగు  కూడా బాగా మాట్లాడుతారు.

ఈమెకు ఒక కొడుకు కూడా ఉన్నాడు. ఇక ఈమె చదువు విషయానికొస్తే...గ్రాడ్యుయేషన్ చేసి బ్యూటీషియన్ కోర్స్ పూర్తి చేశారట. ఈ క్ర‌మంలో త‌న పాత్ర‌ల‌కు తానే ఫ్యాష‌న్ డిజైనింగ్ చేసుకుంటున్న‌ట్లు స‌మాచారం. అయితే తెలుగు ప్రేక్షకులను తన హుందాతనంతో కట్టిపడేసిన కన్నడ నటి అర్చనకు మన టాలీవుడ్ హీరో అంటే మహా ఇష్టమని ఓ షోలో చెప్పుకొచ్చారు. ఇంతకీ ఆ హీరో ఎవరనుకుంటున్నారా. ? అమ్మాయిల కలల రాకుమారుడు సూపర్ స్టార్ మహేష్ బాబు. మహేష్ యాక్టింగ్ అంటే తనకు చాలా ఇష్టం అని చెప్పారు అర్చన. అయితే బుల్లితెరపై గొప్ప గుర్తింపు తెచ్చుకున్న ఈ నటి ఇప్పుడు వెండితెరపై కూడా తన సత్తా చాటాలని ఆశ పడుతున్నారట. అందుకు ప్రయత్నాలు కూడా మొదలు పెట్టినట్లు తెలుస్తోంది.

ఏ పాత్రలోనైనా అలవోకగా నటించగల ఈమెకు సినిమా ఆఫర్ దొరకడం కష్టం కాదంటున్నారు ఈమె టాలెంట్ తెలిసినవారు.  మరి నటి అర్చన సినీ కల ఎప్పుడు నెరవేరుతుందో చూడాలి. ప్రస్తుతం మా టీవీ లో కేరాఫ్ అనసూయ సీరియల్ లో కూడా కీలక పాత్ర పోషిస్తున్నారు అర్చన. ఇద్దరు పెళ్లీడుకొచ్చిన ఆడపిల్లలకు తల్లిగా నటిస్తున్నారు. వయసుకు మించిన పాత్రల్లో తనదైన శైలిలో ఒదిగి పోతున్నారు అర్చన. మరి ఈమె నటనను చూసిన నిర్మాతలు మరియు డైరెక్టర్స్ చిన్న అవకాశమైనా ఇవ్వకపోతారా అని ఎదురుచూస్తున్నారు.


జగడ్డ : ఆ వర్గం జగనోరికి షాక్ ఇవ్వనుందా..?

జ‌గ‌డ్డ‌: జ‌గ‌నోరు దెబ్బ‌కు ఆ వైసీపీ ఎమ్మెల్యే ఫ్యూచ‌ర్ క్లోజ్‌...!

జగడ్డ: అడ్రస్ లేని వైసిపి సోషల్ మీడియా - ఇంత అసంతృప్తా ?

జగడ్డ : నాటి ప్రభావం నేటి ఎన్నికలపై.. జగనోరి మౌనం చేదు అనుభవం..?

జగడ్డ : ఆ లెక్కన చూస్తే.. జగనోరి పథకాలతో లబ్ధి పొందినోళ్లు.. బిజెపికి ఓటేయ్యాలేమో..?

జగడ్డ: బాబోరు ముందే సెలబ్రేట్ చేస్తున్నారా ?

హెరాల్డ్ ఎడిటోరియల్: గాడ్-ఫాదర్ దే పంచాయతీ ఎన్నికలలో విజయం?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - VAMSI]]>