PoliticsN.ANJIeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/suicide898e8723-5a50-40f7-af43-721d51c46c60-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/suicide898e8723-5a50-40f7-af43-721d51c46c60-415x250-IndiaHerald.jpgగృహహింస, ప్రేమ, వరకట్న వేధింపులు, లైంగికదాడులు నిత్యం ఏదో ఒక చోట నుంచి వినాల్సి వస్తోంది. కన్న వాళ్ళను కాదనుకొని, తాళి కట్టిన భర్తే సర్వస్వం అనుకోని మెట్టినింటికి వస్తుంది. కానీ ఆమె ఆశలకు నీరుగారుస్తూ చివరకు వేధింపులతోనే భర్త వారిపైకి యమపాశం వదులుతున్నాడు. వరకట్న దాహాగ్నిలో అబలలు ఆహుతులవుతూనే ఉన్నారు. తాజాగా కరీంనగర్ జిల్లాలో నవ వధువు వరకట్న పిశాచానికి బలైంది. వరకట్న వేధింపులతో యువతి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండలం తాడికలో చోటుచేసుకుంది.suicide;kavitha;kiran;krishna;nithya new;prema;district;huzur nagar;police;suryapeta;love;november;husband;murder.;local language;research and analysis wing;karimnagar;lie;uriపెళ్లైన రెండు నెలలకే నవ వధువు ఆత్మహత్య.. ఎందుకంటే..!?పెళ్లైన రెండు నెలలకే నవ వధువు ఆత్మహత్య.. ఎందుకంటే..!?suicide;kavitha;kiran;krishna;nithya new;prema;district;huzur nagar;police;suryapeta;love;november;husband;murder.;local language;research and analysis wing;karimnagar;lie;uriThu, 28 Jan 2021 08:00:00 GMTప్రేమ, వరకట్న వేధింపులు, లైంగికదాడులు నిత్యం ఏదో ఒక చోట నుంచి వినాల్సి వస్తోంది. కన్న వాళ్ళను కాదనుకొని, తాళి కట్టిన భర్తే సర్వస్వం అనుకోని మెట్టినింటికి వస్తుంది. కానీ ఆమె ఆశలకు నీరుగారుస్తూ చివరకు వేధింపులతోనే భర్త వారిపైకి యమపాశం వదులుతున్నాడు.  వరకట్న దాహాగ్నిలో అబలలు ఆహుతులవుతూనే ఉన్నారు. తాజాగా కరీంనగర్ జిల్లాలో నవ వధువు వరకట్న పిశాచానికి బలైంది. వరకట్న వేధింపులతో యువతి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండలం తాడికలో చోటుచేసుకుంది.

ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే.. సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ మండలం శ్రీనివాసపురానికి చెందిన వాకదాని వెంకట కృష్ణ రెండేళ్లు గా తాడికల్ లో ఉంటూ ఊరురా తిరిగి ఫర్నిచర్ అమ్ముకుంటూ జీవనం సాగిస్తున్నాడు. గత నవంబర్ లో సూర్యాపేట జిల్లా చిలుకూరు మండలం సీతారాంపూర్ కు చెందిన కవిత (19)తో అతనికి వివాహం జరిగింది. పెళ్లైన దగ్గర నుంచే వెంకట కృష్ణ వరకట్న పిశాచం మెలకొంది. అప్పటినుంచే అదనపు కట్నం తేవాలని కవితను మానసికంగా హింసించేవాడు. అతని వేధింపుల్ని తట్టుకుంది. అప్పుడప్పుడూ ఆమెను శారీరకంగా కూడా హింసించేవాడు.

ఈ తరుణంలో అతని వేధింపులు భరించలేకే ఆమె మంగళవారం ఉరి వేసుకొని ప్రాణాలు తీసుకుందని పోలీసులు తెలిపారు. స్పాట్ కు చేరుకున్న పోలీసులు తహసీల్దార్ శ్రీనివాసరావు సమక్షంలో శవ పంచనామా నిర్వహించారు. మృతురాలి తల్లి శైలజ ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేపట్టినట్లు సీఐ కిరణ్ తెలిపారు. అదనపు కట్నం కోసం తమ బిడ్డను వెంకటకృష్ణనే చంపేసి.. ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్నారని మృతురాలి తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. కన్న బిడ్డ చనిపోయిందని ఆ తల్లిదండ్రుల బాధ వర్ణనాతీతం. ఆ తల్లిదండ్రులు బాధను చూసిన స్థానికులు కూడా విషాదంలో మునిగారు.


తెలంగాణ రాకపోయి ఉంటే.. విస్కీలో సోడా కలిపే అవకాశం వచ్చేది కాదు..?

జ‌గ‌డ్డ : ఓట్లు కాదు.. పంచాయ‌తీల‌నే కొనే‌స్తార‌ట‌..

హెరాల్డ్ సెటైర్ : చంద్రబాబు మొదలుపెట్టిన కొత్త తరహా రాజకీయం ?

జగడ్డ: జగనోరికి షాకిచ్చిన జర్నలిస్ట్ లు..

జ‌గ‌డ్డ : జ‌గ‌న్ స్కెచ్‌లు ఫెయిల్‌...బాబోరికి క‌లిసి రానుందా..?

జగడ్డ: జగన్ మరోసారి నిమ్మగడ్డ చేతికి చిక్కినట్టేనా..?

జగడ్డ: నిమ్మగడ్డ ఆ అధికారిని అందుకే టార్గెట్‌ చేశారా..?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - N.ANJI]]>