Politicsyekalavyaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/some-say-that-the-flag-hoisted-at-red-fort-is-a-khalistan-flag4f10e896-92ad-446e-832d-b597c4de33b4-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/some-say-that-the-flag-hoisted-at-red-fort-is-a-khalistan-flag4f10e896-92ad-446e-832d-b597c4de33b4-415x250-IndiaHerald.jpgకేంద్రం తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా గణతంత్ర దినోత్సవం రోజున రైతులు పెద్ద ఎత్తున ఆందోళనలు చేపట్టిన విషయం తెలిసిందే. ఈ ఆందోళనల్లో భాగంగా ఢిల్లీలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. ఆందోళనకారులు, పోలీసుల మధ్య పెద్ద ఎత్తున ఘర్షణలు చోటు చేసుకున్నాయి. ఢిల్లీ లోపనికి ప్రవేశించకుండా ఏర్పాటు చేసిన బారికేడ్లు, కంటైనర్లు, బస్సులను ధ్వంసం చేస్తూ, పోలీసులపై దాడులకు దిగుతూ నిరసనకారులు ఢిల్లీలోకి..red fort;delhi;india;hosta;police;bus;job;prize;gift;central government;india gate;punjab;sara shrawanఎర్రకోటపై ఎగిరింది ఖలిస్తాన్ జెండానా..?ఎర్రకోటపై ఎగిరింది ఖలిస్తాన్ జెండానా..?red fort;delhi;india;hosta;police;bus;job;prize;gift;central government;india gate;punjab;sara shrawanThu, 28 Jan 2021 12:12:49 GMTన్యూఢిల్లీ: కేంద్రం తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా గణతంత్ర దినోత్సవం రోజున రైతులు పెద్ద ఎత్తున ఆందోళనలు చేపట్టిన విషయం తెలిసిందే. ఈ ఆందోళనల్లో భాగంగా ఢిల్లీలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. ఆందోళనకారులు, పోలీసుల మధ్య పెద్ద ఎత్తున ఘర్షణలు చోటు చేసుకున్నాయి. ఢిల్లీ లోపనికి ప్రవేశించకుండా ఏర్పాటు చేసిన బారికేడ్లు, కంటైనర్లు, బస్సులను ధ్వంసం చేస్తూ, పోలీసులపై దాడులకు దిగుతూ నిరసనకారులు ఢిల్లీలోకి చొచ్చుకొచ్చారు. ఈ క్రమంలోనే వారిలోని కొందరు ఢిల్లీలోని ప్రతిష్ఠాత్మకమైన ఎర్రకోటపై ఓ జెండా ఎగురవేశారు. ఈ జెండా శిక్కుల జెండాగా ప్రచారం జరిగింది. అయితే ప్రస్తుతం ఈ జెండాకు సంబంధించిన ఓ వార్త విపరీతంగా వైరల్ అవుతోంది. ఈ జెండా శిక్కుల జెండా కాదని, ఇది శిక్కుల్లో ఓ వర్గానికి చెందిన ఖలిస్తాన్ జెండా అనేది ఆ వార్త సారాంశం.

పంజాబ్ ప్రాంతాన్ని ఖలిస్తాన్ పేరిట ప్రత్యేక దేశంగా ఏర్పాటు చేయడమే లక్ష్యంగా ప్రత్యేక శిక్కు సంస్థ.. ఎస్‌ఎఫ్‌జే(శిఖ్స్ వర్ జస్టిస్) పని చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ సంస్థే రైతు ఉద్యమం పేరిట జరుగుతున్న ఆందోళనలకు నిధులు సమకూరుస్తోందని ఎన్‌ఐఏ అధికారులు చెబుతున్నారు. ఎస్ఎఫ్‌జేతో సంబంధం ఉన్న వ్యక్తులపై ఎన్ఐఏ ఇప్పటికే దర్యాప్తు చేపట్టింది.

ఇండియాగేట్, ఎర్రకోటపై ఖలిస్తాన్ జెండా ఎగురవేయాలని ఎస్‌ఎఫ్‌జే సంస్థ ఆ మధ్య ఓ ప్రకటన కూడా విడుదల చేసినట్లు తెలుస్తోంది. జెండా ఎగురవేసిన వారికి రూ.2 కోట్లకు పైగా బహుమతి ఇస్తామని ఆ ప్రకటనలో వెల్లడించిందట. ఆ ప్రకటనతో కొందరు ఆందోళనకారులు మంగళవారం ఇండియా గేట్ వైపు దూసుకెళ్లారు. కుదరకపోవడంతో ఎర్రకోట వైపు వెళ్లి.. జెండా ఎగురవేశారు. దీంతో ఎర్రకోటపై ఖలిస్తాన్ జెండా ఎగురవేశారనే వార్త సంచలనం సృష్టించింది. అయితే అది ఖలిస్తాన్ జెండా కాదని.. దానికి అనుకూలంగా ఉన్న శిక్కు మత సంస్థకు చెందిన జెండా అంటూ కొన్ని సంఘాలు ప్రకటనలు చేస్తున్నాయి. అయితే ఒకవేళ అది ఖలిస్తాన్ జెండానే అయితే దేశ సార్వభౌమత్వానికే అది సవాల్ విసిరినట్లని, దీనిపై విచారణ జరిపి కేంద్రం చర్యలు తీసుకోవాలని కొందరు డిమాండ్ చేస్తున్నారు.

ఎర్రకోట వద్ద జరిగిన హింస వెనుక ఖలిస్తాన్ ఉగ్రవాదుల హస్తం ఉందని పోలీసులు చెబుతున్నారు. ఈ కేసును ఎన్ఐఏకు అప్పగించే అవకాశం కూడా ఉన్నట్లు తెలుస్తోంది.




జగనోరి వైఖరి రాజ్యాంగ సంక్షోభానికి దారి తీస్తుందా..!!

జగడ్డ: ఏకగ్రీవ ఎన్నికల వెనుక కుట్ర కోణం ?

జగడ్డ: పవన్ పరువు నిలబడేనా ?

జగడ్డ: చంద్రబాబు, నిమ్మగడ్డ ఒకటేనా?

జగడ్డ: ఈ ఎన్నికలు నిమ్మగడ్డకు కత్తిమీద సాములాంటివి...?

జగడ్డ : నమ్ముకున్నోరిని జగనోరు ముంచేనా తేల్చేనా ?

జగడ్డ : గ్రౌండ్ రియాలిటీ ఇదే... పంచ్ పడేదెవరికంటే...?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - yekalavya]]>