PoliticsGullapally Venkatesheditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/venkatramireddy-chairman-of-the-government-employees-union-made-key-remarks4465cb46-9044-436b-8f65-0af89ab30b47-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/venkatramireddy-chairman-of-the-government-employees-union-made-key-remarks4465cb46-9044-436b-8f65-0af89ab30b47-415x250-IndiaHerald.jpgప్రభుత్వ ఉద్యోగుల సమైక్య అధ్యక్షులు వెంకట్రామిరెడ్డి ఈ మధ్య కాలంలో కాస్త సంచలనం అయ్యారు. ఏపీ ఎన్నికల కమీషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ విషయంలో ఆయన చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో సంచలనం అయ్యాయి. ఇక తాజాగా ఆయన మరోసారి కీలక వ్యాఖ్యలు చేసారు. ఏపీ జేఏసీ అమరావతి చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు తనపై చేసిన ఆరోపణలు బాధ కల్గించాయని ఆయన ఆవేదన వ్యక్తం చేసారు. ఏ రోజు కూడా తాను సచివాలయానికి వచ్చిన ఏ ఉద్యోగ సంఘ నాయకుడితో కూడా ఆమర్యాదకరంగా ప్రవర్తించలేదు అని అన్నారు. సచివాలయ గోడలపై క్యాలెండర్లు అంటించవద్దన్నానvenkatrami reddy;ganga;kumaar;ganges;amaravati;andhra pradesh;media;local language;jacనేను అంతే అన్నా... నేను ఏం చేయలేదు: వెంకట్రామిరెడ్డి ఆవేదననేను అంతే అన్నా... నేను ఏం చేయలేదు: వెంకట్రామిరెడ్డి ఆవేదనvenkatrami reddy;ganga;kumaar;ganges;amaravati;andhra pradesh;media;local language;jacThu, 28 Jan 2021 11:04:03 GMTఏపీ ఎన్నికల కమీషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ విషయంలో ఆయన చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో సంచలనం అయ్యాయి. ఇక తాజాగా ఆయన మరోసారి కీలక వ్యాఖ్యలు చేసారు. ఏపీ జేఏసీ అమరావతి చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు తనపై చేసిన ఆరోపణలు బాధ కల్గించాయని ఆయన ఆవేదన వ్యక్తం చేసారు. ఏ రోజు కూడా తాను సచివాలయానికి వచ్చిన ఏ ఉద్యోగ సంఘ నాయకుడితో కూడా ఆమర్యాదకరంగా ప్రవర్తించలేదు అని అన్నారు.

సచివాలయ గోడలపై క్యాలెండర్లు అంటించవద్దన్నాను అని తెలిపారు. దాన్ని అపార్థం చేసుకుని ఇప్పుడు బహిరంగంగా మీడియా ముందుకొచ్చి ఆరోపణలు చేయడం ఆయన విజ్ఞతకే వదిలేస్తున్నా అని అన్నారు. ఉద్యోగ సంఘాలు కరోనా వ్యాక్సిన్ ఇస్తోన్న సమయంలో స్థానిక ఎన్నికలు నిర్వహిస్తే భారమనే ఎన్నికలను వాయిదా వేయాలని కోరాం అని ఆయన వ్యాఖ్యానించారు. తొలుత అందరూ ఎన్నికల కమిషన్ నిర్ణయాన్ని బహిరంగంగానే వ్యతిరేకించాయి అని అన్నారు. ఇపుడు కోర్టు తీర్పు ఎన్నికల కమిషన్ కు అనుకూలంగా రావడంతో కమిషన్ నిర్ణయాన్ని వ్యతిరేకించలేదని మాట మార్చాయి అని ఆయన ఆరోపించారు.

దీంతో ఇతర సంఘాలపై నింద మోపి వాటి బలాన్ని తగ్గించాలని చూస్తున్నారు అని ఆయన మండిపడ్డారు. ఇలాంటి ఆరోపణలతో సంఘాలు బలపడటమో, బహీనపడటమో జరగదు కానీ ఉద్యోగుల పరువు పోతుందని వెంకట్రామిరెడ్డి ఆవేదన వ్యక్తం చేసారు. పోరాడి ఫలితం సాధించలేకపోయామని ఉద్యోగులు నిరాశలో ఉన్నారు అని అన్నారు. అయితే ఇటువంటి సమయంలో ఉద్యోగ సంఘాలు రోడ్డున పడి ఆరోపణలు చేసుకుంటే ఉద్యోగుల విశ్వాసాన్ని కోల్పోతాం అని ఆయన వ్యాఖ్యానించారు. ఈ విషయంలో సంయమనంతో వ్యహరించాలని, ఎలాంటి ప్రత్యారోపణలు చేయొద్దని తమ ప్రభుత్వ ఎంప్లాయిస్ ఫెడరేషన్ నేతలను కోరుతున్నా అని ఆయన విజ్ఞప్తి చేసారు.


డీజీపీ సవాంగ్ నిజాయితీపరుడు, సమర్ధుడు...!!!

జగడ్డ: ఏకగ్రీవ ఎన్నికల వెనుక కుట్ర కోణం ?

జగడ్డ: పవన్ పరువు నిలబడేనా ?

జగడ్డ: చంద్రబాబు, నిమ్మగడ్డ ఒకటేనా?

జగడ్డ: ఈ ఎన్నికలు నిమ్మగడ్డకు కత్తిమీద సాములాంటివి...?

జగడ్డ : నమ్ముకున్నోరిని జగనోరు ముంచేనా తేల్చేనా ?

జగడ్డ : గ్రౌండ్ రియాలిటీ ఇదే... పంచ్ పడేదెవరికంటే...?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Gullapally Venkatesh]]>