PoliticsChagantieditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/ycp-leaders-wrong-decitions-big-headache-to-jagan-df859c92-76fc-46b2-bf06-aba143a33712-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/ycp-leaders-wrong-decitions-big-headache-to-jagan-df859c92-76fc-46b2-bf06-aba143a33712-415x250-IndiaHerald.jpgఒక రకంగా రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ అలాగే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మధ్య ఇంకా కోల్డ్ వార్ కొనసాగుతూనే ఉంది. రాష్ట్ర పంచాయతీరాజ్ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది అలాగే పంచాయతీరాజ్ కమిషనర్ గిరిజా శంకర్ లను అభిశంసించాలని నిమ్మగడ్డ రమేష్ కుమార్ ప్రభుత్వానికి సిఫార్సు చేసిన సంగతి తెలిసిందే. తన ఆదేశాలకు అనుగుణంగా రాష్ట్ర ఓటర్ల జాబితాను రూపొందించడంలో వీరు విఫలం అయ్యారని అందుకే ఆ విషయంలో అభిశంసించాలని నిమ్మగడ్డ పేర్కొన్నారు. అయితే ప్రభుత్వం మాత్రం నిమ్మగడ్డ రమేష్ కుమార్ చర్యలు నిబంjagan elections nimmagadda;kumaar;shankar;jagan;andhra pradesh;war;mahaజగడ్డ : ఆ మరక పోగొట్టుకునేందుకు జగనోరి విశ్వప్రయత్నాలుజగడ్డ : ఆ మరక పోగొట్టుకునేందుకు జగనోరి విశ్వప్రయత్నాలుjagan elections nimmagadda;kumaar;shankar;jagan;andhra pradesh;war;mahaThu, 28 Jan 2021 15:00:00 GMTఒక రకంగా రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ అలాగే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మధ్య ఇంకా కోల్డ్ వార్ కొనసాగుతూనే ఉంది. రాష్ట్ర పంచాయతీరాజ్ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది అలాగే పంచాయతీరాజ్ కమిషనర్ గిరిజా శంకర్ లను అభిశంసించాలని నిమ్మగడ్డ రమేష్ కుమార్ ప్రభుత్వానికి సిఫార్సు చేసిన సంగతి తెలిసిందే. తన ఆదేశాలకు అనుగుణంగా రాష్ట్ర ఓటర్ల జాబితాను రూపొందించడంలో వీరు విఫలం అయ్యారని అందుకే ఆ విషయంలో అభిశంసించాలని నిమ్మగడ్డ పేర్కొన్నారు. 

అయితే ప్రభుత్వం మాత్రం నిమ్మగడ్డ రమేష్ కుమార్ చర్యలు నిబంధనలకు విరుద్ధంగా ఉన్నాయని కక్షపూరితంగా ఉన్నాయని పేర్కొంటూ ఆయన చేసిన సిఫార్సులు వెనక్కు పంపింది. అయితే ఒక రకంగా ఇది ధిక్కరణ కిందకే వస్తుంది. కానీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ టార్గెట్ చేసిన అధికారులకు భరోసా ఇచ్చేందుకు మాత్రమే ప్రభుత్వం ఈ ప్రయత్నం చేస్తుందనే వాదన వినిపిస్తోంది. ఇప్పటికే వారికి ఎన్నికల ప్రక్రియ పూర్తి కాగానే రాష్ట్రంలో ముఖ్యమైన పోస్టులలో నియమిస్తామని హామీ లభించిందని అంటున్నారు. నిమ్మగడ్డ రమేష్ కుమార్ అభిశంశనలు వెనక్కు పంపడం ద్వారా ఉద్యోగులకు భరోసా ఇచ్చినట్లు సంకేతాలు పంపడానికి ప్రభుత్వం ప్రయత్నిస్తోంది.

 నిమ్మగడ్డ ఎవరినైతే బదిలీ చేయమని కోరారో వారందరికీ ఎన్నికల ప్రక్రియ పూర్తయిన వెంటనే ముఖ్య పదవులు ఇస్తారని ప్రచారం ప్రభుత్వ వర్గాల్లో జోరుగా సాగుతోంది. అందుకు జగన్ ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో ఇరుక్కున్న ఐఏఎస్ అధికారిణి శ్రీలక్ష్మి తెలంగాణలో ఉన్నా ఏపీకి రప్పించి మరీ మున్సిపల్ శాఖ లో కీలక పదవి కట్టబెట్టిన వైనాన్ని గుర్తు చేస్తున్నారు. ఎన్నికల ప్రక్రియ మహా అయితే మూడు నెలలు ఉంటుంది కానీ తమ ప్రభుత్వం మరో మూడేళ్ల పాటు పాలనలో ఉంటుందనే భరోసా ఇప్పటికే ఉద్యోగులకు ప్రభుత్వం పంపినట్లు అయిందని అంటున్నారు విశ్లేషకులు. జగన్ చర్యల వల్ల ఉద్యోగులు ఇబ్బంది పడుతున్నారు అనే మరక పోగొట్టుకునేందుకే ఇలా రిస్క్ చేస్తున్నారని చెబుతున్నారు. 




బ్యాట్ బాల్ తో రొమాన్స్ చేస్తున్న తాప్సి.!

జగడ్డ: రోడ్లు లేకపోతే ఎలా నడవాలి సారూ... మాకు ఇదేం ఘోష... ఎమ్మెల్యేలు అడగలేరా...?

బిగ్‌బాస్ సీజన్ 5లో పాల్గొనేందుకు ఈ నటీనటులు సిద్దమట ...!!

KGF బంగారు గనుల్లో.. సలార్ బొగ్గు గనుల్లో.. మిగతా అంతా సేమ్ టూ సేమ్..!

జ‌గ‌డ్డ‌: జ‌గ‌నోరు చేసిన ప‌నికి వైసీపీ వాళ్లు కుమ్ముకుంటున్నారుగా...!

జగడ్డ : పథకాలతో పైసలిచ్చారు సరే.. కానీ అది మర్చిపోయారా సీఎం గారూ..?

జగడ్డ: పల్నాడులో జగనోరికి అడ్డే లేదట...నిజమేనా...?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chaganti]]>