PoliticsGiddaluri Srinivasa Raoeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/74/behind-reason-for-unanimous-electione5d206b4-d833-4acf-848b-e017eb7d3ae1-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/74/behind-reason-for-unanimous-electione5d206b4-d833-4acf-848b-e017eb7d3ae1-415x250-IndiaHerald.jpgపంచాయతీలన్నీ ఏకగ్రీవం కావాలి.. అందరూ ఒకేతాటిపైకి వచ్చి మీ సర్పంచిని ఏకగ్రీవంగా ఎన్నుకోండి, ఎన్నికలకు పోకండి అంటూ గత కొన్నిరోజులుగా అధికార పక్ష నాయకులు చెబుతూ వస్తున్నారు. అనంతరం ప్రభుత్వం తరపున ఏకగ్రీవ పంచాయతీలకు ఇచ్చే నగదు ప్రోత్సాహకాలను పెంచుతూ ప్రకటన వచ్చేసింది. దీనిపై సీరియస్ అయిన ఎన్నికల కమిషన్ సమాచార శాఖ వివరణ కోరింది. jagan-nimmagadda-elections;peddireddy ramachandra reddy;assembly;minister;tdp;gift;ycp;ishtam;party;sajjala ramakrishna reddyజగడ్డ: ఏకగ్రీవాలే వైసీపీ కొంప ముంచుతాయా..?జగడ్డ: ఏకగ్రీవాలే వైసీపీ కొంప ముంచుతాయా..?jagan-nimmagadda-elections;peddireddy ramachandra reddy;assembly;minister;tdp;gift;ycp;ishtam;party;sajjala ramakrishna reddyThu, 28 Jan 2021 11:00:00 GMT
ఈ విషయాన్ని పక్కనపెడితే.. అసలు ఏకగ్రీవాలకు ప్రభుత్వం ఎందుకంత పట్టుబడుతుందనే విషయం అర్థం కావడంలేదు. ఏకగ్రీవాలు కేవలం పంచాయతీలకేనా, అసెంబ్లీ ఎన్నికల్ని కూడా ఏకగ్రీవం చేసుకుంటారా అంటూ సెటైర్లు పడుతున్నాయి. ఎన్నికలు ఎప్పుడు జరిగినా గెలుపుమాదేనంటూ బీరాలు పలికిన అధికార పార్టీ నేతలు ఇప్పుడు ఎన్నికలు అనేసరికి ఎందుకు వెనకడుగు వేస్తున్నారనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. ఏకగ్రీవాలపై చేసిన ప్రకటనతో ప్రభుత్వం పరోక్షంగా తన ఓటమిని ఒప్పుకున్నట్టేనని అంటున్నారు ప్రతిపక్ష నేతలు.

ఏకగ్రీవాలపై మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి సహా ఇతర నేతలు ఎన్నికల కమిషన్ తీరుని తప్పుబడుతున్నారు. ఏకగ్రీవాలకు నజరానా ప్రకటించడం ఎప్పటినుంచో ఉందని, కొత్తగా ఇప్పుడు దాన్ని కుదరదని చెప్పడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. అయితే ఎన్నికల కమిషనర్ మాత్రం ఏకగ్రీవాలను ప్రోత్సహిస్తామని, అవి మరీ ఎక్కువైతేనే వాటిపై ప్రత్యేక దృష్టిపెడతామని అంటున్నారు. అంటే ఏకగ్రీవాల పేరుతో జరిగే బెదిరింపుల్ని మాత్రమే అడ్డుకుంటామని అంటున్నారాయన. మరోవైపు టీడీపీ కూడా గ్రామాల్లో ఏకగ్రీవాల పేరుతో అధికార పార్టీ బెదిరింపులకు పాల్పడుతోందని మండిపడుతున్నారు. ఎన్నికలను నేరుగా ఎదుర్కొనే దమ్ములేకే ఇలా ఏకగ్రీవాలు, పారితోషికాలు అంటూ ప్రభుత్వం కొత్త ఎత్తులు వేస్తోందని, పరోక్షంగా తమ ఓటమిని అంగీకరించిందని అంటున్నారు. పోటీ వద్దని అంటున్న వైసీపీ నైతికంగా పరాజయం పాలయిందని దెప్పిపొడుస్తున్నారు.

పోటీ లేకుండా ఏకగ్రీవాలకోసం ప్రభుత్వం చేసిన ప్రకటన.. అధికార పార్టీకి నష్టం చేకూరుస్తుందనే విశ్లేషణలు వినపడుతున్నాయి. పోటీ చేసి గెలిచే సత్తా ఉన్న చోట కూడా ఏకగ్రీవాల పేరుతో ప్రత్యర్థుల్ని బుజ్జగించడం చాలామందికి ఇష్టంలేదు. బరిలో దిగి తాడోపేడో తేల్చుకోవాలనుకుంటున్నారు. అధికార పార్టీకి చెందిన ఇలాంటి వారంతా.. సొంత నేతలలపైనే గుర్రుగా ఉన్నారు.


డీజీపీ సవాంగ్ నిజాయితీపరుడు, సమర్ధుడు...!!!

జగడ్డ: ఏకగ్రీవ ఎన్నికల వెనుక కుట్ర కోణం ?

జగడ్డ: పవన్ పరువు నిలబడేనా ?

జగడ్డ: చంద్రబాబు, నిమ్మగడ్డ ఒకటేనా?

జగడ్డ: ఈ ఎన్నికలు నిమ్మగడ్డకు కత్తిమీద సాములాంటివి...?

జగడ్డ : నమ్ముకున్నోరిని జగనోరు ముంచేనా తేల్చేనా ?

జగడ్డ : గ్రౌండ్ రియాలిటీ ఇదే... పంచ్ పడేదెవరికంటే...?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Giddaluri Srinivasa Rao]]>